గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వైఎస్ జగన్కు పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పలేటి కల్పన, రక్షణ నిధి, మేకా ప్రతాప అప్పారావుతోపాటు నేతలు కె పార్థసారధి, జోగి రమేష్, గౌతంరెడ్డి, సామినేని ఉదయభాను, డాక్టర్ దుట్టా రామచంద్రరావు స్వాగతం పలికారు.
అనంతరం హనుమాన్ జంక్షన్ వరకు వైఎస్ జగన్ భారీ ర్యాలీగా వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నేడు జరగనున్న యువ భేరిలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు.