కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మనకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని జగ్గంపేటకు చెందిన విద్యార్థిని సాయిలక్ష్మీ స్పష్టం చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదాపై యువభేరీ పేరిట విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయిలక్ష్మీ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా తప్పకుండా రావాలని ఆమె ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా కోసం మన తరఫున పోరాడుతున్న జగనన్నకు అండగా నిలుద్దామని ఈ సందర్భంగా ప్రజలకు సాయిలక్ష్మీ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా దక్కే వరకు వెనకడుగు వేయొద్దు అంటూ ప్రజలకు సాయిలక్ష్మీ సూచించారు.