
మేము ఎందుకూ పనికిరామా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
సుబ్బారెడ్డి: అమరావతి నిర్మాణం జరుగుతోంది.. అక్కడ మన రాష్ట్ర సివిల్ ఇంజనీర్లను కాదని విదేశాలకు వెళ్తున్నారు. అంటే మేం ఎందుకూ పనికిరామా, మేం ఈ రాష్ట్రంలో చదవడం తప్పా.. గాంధీగారు చెడు వినద్దు, చెడు మాట్లాడొద్దు అంటే చంద్రబాబు ప్రత్యేక హోదా అనద్దు, వినొద్దు అంటున్నారు.
వైఎస్ జగన్: చంద్రబాబు ఈసారి కనపడినప్పుడు ఇదే మాట గట్టిగా అడుగు.