మార్గాని భరత్( ఫైల్ ఫోటో)
సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వక్రభాష్యంతో రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. 2014 నుండి 2018 వరకు ఈఎస్‌ఐలో జరిగిన అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలతో ఏసీబీ అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుందన్నారు. అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేస్తే.. కిడ్నాప్ చేశారనటం దారుణమన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం బీసీ కార్డ్‌ను వాడుకుంటున్నారన్నారు. ఈఎస్‌ఐలో 150 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగిందని అన్నారు. గతంలో డిమ్స్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తిని, అతని కుమారున్ని, అచ్చెన్నాయుడిని ఉదయం అరెస్టు చేశారని చెప్పారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చెయ్యదని, పక్కా ఆధారాలతో అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న దేవరపల్లి టు జీలుగుమిల్లు రహదారి మోక్షం కలిగిందన్నారు. హైవే నెంబర్ 516డి పునర్ నిర్మాణ పనులకు 160 కోట్లు రెండు విడతలుగా మంజూరు అయిందని తెలిపారు. మొదటి విడతగా 94 కోట్ల విలువ గల రోడ్ల నిర్మాణం పనులు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment