మరోసారి నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు | Acham naidu again satirical comments on YS Jagan | Sakshi
Sakshi News home page

మరోసారి నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు

Published Wed, Mar 18 2015 10:30 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

మరోసారి నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు - Sakshi

మరోసారి నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి  అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వలేక తప్పించుకోవటానికి అధికార పక్షం వ్యక్తిగత విమర్శలకు దిగుతోంది.  విపక్ష నేత ప్రసంగానికి అడ్డు తగలడం, సమయం సందర్భం లేకుండా కొందరు మంత్రులు.. వైఎస్‌ జగన్ను విమర్శించడం పనిగా పెట్టుకున్నారు . ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మైక్ దొరికితే చాలు అన్నట్లు నరంలేని నాలుకకు పని చెబుతున్నారు.  బుధవారం సభలో ఆయన మరోసారి నోరు పారేసుకున్నారు. వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  దాంతో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిరసన తెలిపారు.

కాగా అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని విమర్శించకుండా మౌనంగా వున్న మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తన ఛాంబర్‌లోకి పిలిచి క్లాసులు తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో వైఎస్‌ జగన్‌ను విమర్శించి తమ పదవులను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రేసులో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉండగా,  ఆ తర్వాత మంత్రి దేవినేని ఉమా, రావెల కిషోర్‌ బాబు... ఎమ్మెల్యేల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యరావు, కళా వెంకటరావు, దూళిపాళ నరేంద్ర తదితరులు పోటీపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement