నవ్విపోదురు గాక.. అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. ఎవరేమనుకోనీ గాక.. అని కూడా ముక్తాయిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ అనుభవాన్ని, తాము అధిష్టించిన పదవుల గొప్పతనాన్ని గాలికొదిలేస్తున్నారు. వీళ్లకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిస్సిగ్గుగా నాయకత్వం వహిస్తున్నారు. వీళ్లంతా కలిసి నోటికొచ్చిన తీరులో మాటలు విసిరేస్తున్నారు. అవతలివారు ఎవరన్నది కూడా చూడకుండా.. తాము ఏమంటున్నదీ ఆలోచించకుండా బురద జల్లుతున్నారు. అయితే ఆ విధంగా వీరు ఉన్న కొద్దిపాటి పరువును తామే నడిబజారులో దిగజార్చుకుంటున్నారు. జనం ఛీత్కారాలను దండిగా పోగు చేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై ట్విట్టర్ వేదికగా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి మరణంపై ఇంత దారుణమైన ట్వీట్ చేశారంటే అచ్చెన్న రాజకీయంగా ఎంత దిగజారిపోయారో, ఎంత సంస్కార హీనంగా మాట్లాడారో ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని జనం ఆక్షేపిస్తున్నారు.
శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంను ‘ఆమదాలవలస నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తాను’ అంటూ.. పరిషత్ ఎన్నికల రోజున పెనుబుర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేసిన సందర్భంలో పోలీసు అధికారులను దుర్భాషలాడిన కేసులో గురువారం అరెస్టై బెయిల్‌పై వచ్చిన తర్వాత పరుషపదజాలంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ దూషించారు.
►ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అచ్చెన్న, రవికుమార్‌లను చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా? అని ముక్కున వేలేసుకున్న పరిస్థితి ఏర్పడింది. నోరు పారేసుకోవడం, అరెస్టులవ్వడం, బెయిల్‌పై విడుదల కావడం, మళ్లీ నోటికొచ్చినట్టు దురుసుగా, అసభ్యకరంగా మాట్లాడం వీరిద్దరికి అలవాటైపోయింది. వీరా మన నాయకులు అంటూ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఇంత హీనంగా వ్యవహరిస్తున్న నాయకులు మన జిల్లాకు చెందిన వారు కావడం బాధాకరమని అసహ్యించుకుంటున్నారు. అచ్చెన్నకు, కూన రవికి ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో నోరు పారేసుకున్నారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిపై దాడి ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో ‘ఏయ్ ఎవర్నువ్. ఎలా అరెస్టు చేస్తావ్. ఏమనుకుంటున్నావ్. ఎవర్నీ వదల్ను. మళ్లీ అధికారంలోకి వచ్చాక నేనే హోం మంత్రినవుతా..సంగతి తేలుస్తా..’ అని పోలీసు అధికారులను అచ్చెన్నాయుడు బెదిరించారు.
►ఏయ్ ఎగ్‌స్ట్రాలు చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు? నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? యూజ్‌లెస్ ఫెలో..’అంటూ అమరామతిలో పోలీసు అధికారులపై తీవ్ర పదజాలంతో అచ్చెన్న దూషించారు.
►ఈఎస్‌ఐలో రూ.150 కోట్ల మేర కుంభకోణం చేసి విచారణలో బయటపడి అరెస్టయితే...ఇది కక్ష సాధింపు అంటూ పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఇలా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ పోటీ పడి నోటికొచ్చినట్టు మాట్లాడి సిక్కోలు జిల్లా గౌరవాన్ని మంట కలిపేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. జిల్లా వాసులు ఎక్కడున్నా మంచి ప్రవర్తన, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తారు. వినయంగా మాట్లాడతారు. కానీ జిల్లాకు మచ్చ తెచ్చేలా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ మాట్లాడుతుండటంపై ప్రజలు ఛీకొడుతున్నారు. వీరికి మంచి బుద్ధి ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
తీరు మారని కూన..
అచ్చెన్నాయుడి కన్నా తానేమీ తక్కువ కాదన్నట్టుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ దురుసుగా మాట్లాడుతున్నారు. ‘ఏయ్ జాగ్రత్త.. శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. మీ స్థాయి ఎంత..మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి రవికుమార్ గతంలో తీవ్ర పదజాలంతో మాట్లాడారు.
►పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్‌లోనే వార్నింగ్ ఇచ్చారు. ‘.. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే నీ సంగతి చూస్తా’ అని కూన బెదిరించారు.
►‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తాను..’ అంటూ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీకి వార్నింగ్ ఇచ్చారు.
►‘నీకెంత ఒల్లు బలిసింది... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు ’ అంటూ మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న పొందూరు తహశీల్దార్‌ను పరుష పదజాలంతో బెదిరించారు.
చదవండి:
కూన తీరు మారదు.. పరుగు ఆగదు!
‘కూన’ గణం.. క్రూర గుణం
Comments
Please login to add a commentAdd a comment