సాక్షి ఎఫెక్ట్‌: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు | Boddabada Bridge: Tdp Leaders Removed Selfie Posts | Sakshi
Sakshi News home page

సాక్షి ఎఫెక్ట్‌: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు

Published Fri, Apr 14 2023 8:22 AM | Last Updated on Fri, Apr 14 2023 2:53 PM

Boddabada Bridge: Tdp Leaders Removed Selfie Posts - Sakshi

నాటి కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కేటాయించిన నిధులతో నిర్మించిన వంతెనను చూపిస్తున్న బొడ్డబడ గ్రామస్తులు

ఇచ్ఛాపురం రూరల్‌(శ్రీకాకుళం జిల్లా): టీడీపీ ప్రభు­త్వ హయాంలో రూ.7 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొ­డ్డబడ బ్రిడ్జిని నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సెల్ఫీ తీసి సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్న ఎంపీ రామ్మోహన్‌నాయు­డు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లు తోక ముడిచారు. వీరి సెల్ఫీకి బొడ్డబడ గ్రామస్తులంతా ప్రతిస్పందించారు.

ఈ వంతెన కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరైందంటూ గురువారం ‘సాక్షి’ దినపత్రిక­లో వార్త ప్రచురితం కావడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ప్రజల్లో అభాసుపాలయ్యామంట  గురువారం ‘సెల్ఫీ’ పోస్టులు తొలగించారు.
చదవండి: టీడీపీ నేతల ‘సెల్ఫీ’గోల్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement