
మాట్లాడుతున్న ప్రభాకరరావు, రాజారావు
పొందూరు: మండలంలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు, టీడీపీకి గట్టిషాక్ తగిలింది. ఇంతవరకు పార్టీ బలోపేతానికి కృషి చేసిన పార్టీ మండల కార్యదర్శి గుడ్ల మోహన్, శ్రీశైలం దేవస్థానం డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాకర్ల రాజారావులు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వీరు వెల్లడించారు. ఈ మేరకు మండల కేంద్రంలో శుక్రవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనకు ఆకర్షితులమై ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించామన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ ఆధ్వర్యంలో పారీ్టలో చేరనున్నామన్నారు. ఉత్తరాంధ్రను పరిపాలన రాజధానిగా వ్యతిరేకిస్తున్న టీడీపీకి భవిష్యత్ ఉండదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment