bodabanda
-
సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ బ్రిడ్జిని నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సెల్ఫీ తీసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లు తోక ముడిచారు. వీరి సెల్ఫీకి బొడ్డబడ గ్రామస్తులంతా ప్రతిస్పందించారు. ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైందంటూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ప్రజల్లో అభాసుపాలయ్యామంట గురువారం ‘సెల్ఫీ’ పోస్టులు తొలగించారు. చదవండి: టీడీపీ నేతల ‘సెల్ఫీ’గోల్ -
మహిళ ఆత్మహత్య
గుత్తి రూరల్ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బోడబండ తండాకు చెందిన వెంకటమ్మ(28)అనే మహిళ కడుపునొప్పి తాళలేక గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడబండ గ్రామానికి చెందిన వెంకటమ్మ కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుండేది. వైద్యం చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కు కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.