worst politics
-
బ్లడ్ గేమ్ బై సునీత.. తండ్రి రక్తంతో కూతురు కుటిల రాజకీయం
రక్తం ప్రశ్నిస్తోంది.. అవును రక్తం ప్రశ్నిస్తోంది. రక్త సంబంధం ఉన్న కూతురిని ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆడుతున్న బ్లడ్ గేమ్‌లో నువ్వెందుకు పావులా మారావని ప్రశ్నిస్తోంది. యస్.. వివేకా రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నా రాజకీయ ప్రత్యర్థులతో నువ్వు, నీ భర్త ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నిస్తోంది. నన్ను గొడ్డలితో కసితీరా నరికి నరికి చంపిన దస్తగిరి బయట తిరుగుతుంటే.. నువ్వు బస్సెక్కి షర్మిల వెంట ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నన్ను చంపినోడు బెయిల్‌పై బయట తిరుగుతుంటే.. అతడ్ని జైల్లో పెట్టించకుండా.. జగన్‌కు ఓటేయొద్దు.. అవినాష్‌కు ఓటేయొద్దు అంటూ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నా రక్తపు మరకల తడి ఆరక ముందు అన్నీ నిజాలే చెప్పిన నువ్వు.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. నీ పక్కనే అసలు హంతకులు ఉన్నారని నీ అంతరాత్మకు తెలుసు. వారిని కాపాడుకునేందుకు అవినాష్‌కు ఆ రక్తపు మరకలు పూసే ప్రయత్నం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. ఎందుకమ్మా అన్ని తెలిసి ఈ బ్లడ్ గేమ్ లో నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావ్.. అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. హత్య చేసినోడు ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. హత్య చేయించినోడు ఇంట్లోనే నీ పక్కనే తిరుగుతుంటాడు. ఎంటమ్మా సునీత ఇది.. పదేళ్లలో ఎప్పుడైనా నాన్నా అని ఆప్యాయంగా పిలిచావా ? ఇప్పుడు నా రక్తాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నావే.. ఇది కరెక్టేనా ? నా రెండో భార్య షమీమ్ ను నువ్వు హింసించినా.. అవమానించినా.. నేను నిన్నేమీ అనలేదే..ఓహో ఆస్తిలో వాటా తగ్గుతుందని నా తర్వాత హోదా, పదవి నీ భర్తకు దక్కవని కోపంతో ఉన్నావా ? అందుకే నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావా ? జగన్ కు ఓటేయొద్దని అంటున్నావా ? అమాయకుడైన అవినాష్ ను బలి పశువుని చేయాలని చూస్తున్నావా ? అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. మర్డర్ చేయడమే కాదు.. దాన్ని ఇంకొకరిపై నెట్టేసే కుట్రపై.. ఇదే రక్తం సాక్షిగా.. అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి.. ప్రధానంగా ఓ పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. 1. వివేకా రెండో భార్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కాలర్ పట్టుకుని బెదిరించింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 2. వివేకా రెండో భార్య కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని రక్త చరిత్రకు తెరలేపింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 3. వివేకాకు చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఆయనకు చెక్ పెట్టింది నువ్వు, నీ భర్త నర్రెడ్డి కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 4. తండ్రి బతికుండగా పట్టెడన్నం పెట్టని నువ్వు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 5. వివేకా రాజకీయ శత్రువులైన బీటెక్, ఆదినారాయణ రెడ్డి సహకారంతోనే హత్య జరిగిందని చెప్పింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 6. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచి పెట్టమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 7. అవినాష్ పేరు చెప్పకపోతే.. నీ భర్త జైలుకు పోక తప్పదని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 8. వివేకాను తానే నరికి చంపానని చెప్పినా.. దస్తగిరి బెయిల్‌కు నువ్వు సహకరించింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 9. వివేకా హంతకులు పక్కనే ఉన్నా.. రక్తపు మరకలు మరొకరికి పూయాలని ప్రయత్నిస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 10. నీ ఇంట్లో వారిని రక్షించుకునేందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుని రాజకీయం చేస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు -
ఓర్నీ ఏశాలో!.. నారా వారి ‘మడత’ రాజకీయం
నాలికను ఎటు కావాలంటే అటు వైపు మడత పెట్టడం కూడా ఒక ఆర్టే. అందులో చంద్రబాబు నాయుణ్ని మించిన ఆర్టిస్ట్ ఈ దేశంలోనే మరొకరు ఉండరు. పొద్దున్న తిట్టిపోసిన వ్యక్తినే మధ్యాహ్నం పొగిడేయగలరు. సాయంత్రానికల్లా అదే వ్యక్తిని మళ్లీ తిట్టనూగలరు. అంత ఫ్లెక్సిబుల్ నాలికలు ఉండడం చంద్రబాబు ప్రత్యేకతే అంటారు రాజకీయ పండితులు. అభిప్రాయాలను కూడా అలానే మార్చేస్తారు. తాను చేసిన వ్యాఖ్యకి పూర్తి భిన్నమైన వాదనను ఆయనే వినిపిస్తారు. దానికి ఏదో ఒక సాకు చెబుతారు. నలుగురూ నవ్విపోతారేమో అన్న సిగ్గుకూడా లేకుండా ఎంచక్కా నిర్లజ్జగా చంద్రబాబు నడుచుకుపోతారని ఆయనంటే గిట్టని వాళ్లు అంటూ ఉంటారు. 2019 ఎన్నికలకు ఇంచుమించు ఏడాది ముందు ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని తిట్ల దండకం అందుకున్నారు. మోదీ దుర్మార్గ విధానాల వల్లనే దేశం నాశనమైందన్నారు. అందుకే దేశాన్ని కాపాడుకోడానికి తాను కాంగ్రెస్‌తో జట్టు కట్టి విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు దేశంలోనే సీనియర్ నాయకుడైన తాను ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు ఈ క్రమంలో చంద్రబాబు దిక్కుమాలిన సిగ్గుమాలిన రాజకీయానికి తెరతీశారు. ఏ కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి టీడీపీ పుట్టిందో అదే టీడీపీని తీసుకెళ్లి కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టేశారు. రాహుల్ గాంధీకి ఓ బొకే ఇచ్చి వెచ్చగా ఉంటుందని ఓ శాలువా కప్పి ఫోటోకోసం ఓ నవ్వు నవ్వి అదే చాణక్యం అన్నట్లు తన పత్రికల్లో రాయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏంటి? కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఏంటి? ఏమన్నా సిగ్గుందా లేదా అని టీడీపీ సీనియర్లు కుతకుత లాడిపోయినా.. చంద్రబాబు పట్టించుకోలేదు. కాంగ్రెస్‌తో జట్టు కట్టడంపై విమర్శలు వెల్లువెత్తడంతో తన అవకాశవాద దిగజారుడు రాజకీయానికి ఓ ముద్దు పేరు పెట్టారు చంద్రబాబు. డెమొక్రటిక్ కంపల్షన్ తోనే కాంగ్రెస్‌తో కలిశామన్నారు. చక్రాలు తిప్పడం తనకు అచ్చొచ్చిన ఆర్ట్ అని తన మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని పొంగిపోయారు. ఆ సమయంలోనే కర్ణాటక ఎన్నికలు జరిగితే.. తానే అక్కడ బీజేపీని ఓడించానని భవిష్యత్తులో కూడా ఓడిస్తానని బీరాలు పలికారు నారా గిరీశం. 2019లో దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి బీజేపీ వ్యతిరేక కూటమిని గెలిపించుకుంటామన్నారు. నరేంద్ర మోదీని ఓడించి ఇంటికి పంపేస్తామన్నారు. 2018లో చంద్రబాబు ఎన్డీయే నుండి బయటకు వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వంపైనా మోదీపైనా విరుచుకుపడుతూ వచ్చారు. అంత వరకు ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన చంద్రబాబు హోదా కోసం ధర్మపోరాట దీక్ష అంటూ కొత్త డ్రామాకి తెరతీశారు. తాను ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడిన వారిని జైలుకు పంపించారు చంద్రబాబు.నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్న చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యాక అమరావతి రాజధానికి నరేంద్ర మోదీ కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని అది అక్కడ కేబుల్‌కి కూడా సరిపోదని అన్నారు. నరేంద్ర మోదీ కన్నా చాలా ముందుగానే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. రాజకీయాల్లో దేశంలోనే తాను సీనియర్ని అని చెప్పుకున్నారు. తనకంటే సీనియర్లు అయిన మల్లికార్జున ఖర్గే, కరుణానిధి వంటి వారు కూడా ఉన్నారని మర్చిపోయారు చంద్రబాబు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు చంద్రబాబు. హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువ లాభమని విచిత్ర వాదన చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చెప్పి కేంద్ర మంత్రులకు సన్మానం కూడా చేశారు. అదేదో ఘనత సాధించినట్లు వారిని కీర్తించారు. ఎన్డీయే నుండి బయటకు రాగానే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తోన్న హోదా ఉద్యమానికి జంకి తాను కూడా హోదా గురించి మాట్లాడ్డం మొదలు పెట్టారు. ఆక్రమంలోనే మోదీని విమర్శించారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్ట్ ఇదీ చదవండి: రఘురామా.. ప్లీజ్ గెటవుట్! -
బాబోయ్.. ఇదేం ఖర్మరా!.. బాబు డొల్ల మాటలు.. ఇవీ వాస్తవాలు
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలు.. నిస్సిగ్గుగా బుకాయింపు! ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గోబెల్స్‌ను తలదన్నే రీతిలో అంతులేని అబద్ధాలాడారు. యథాప్రకారం హైదరాబాద్‌ను తానే నిర్మించానని.. సెల్‌ఫోన్‌నూ తానే కనిపెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇదేం ఖర్మరా.. అని అంతా అనుకోవాల్సిందే మరి! 1. మేనిఫెస్టో మాయం.. చంద్రబాబు: కేవలం ఆరు పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పలు చెప్పుకున్న సీఎం జగన్ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. వాస్తవం: అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలోనే 98 శాతం హామీలను అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సీఎం జగన్ సిసలైన నిర్వచనం చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకూ రూ.1,77,585.51 కోట్లు అందచేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఈ స్థాయిలో పేదల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఇదే ప్రథమం. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో మొత్తం రూ.3,19,227.86 కోట్ల మేర పేదలకు ప్రయోజనం చేకూర్చారు. ఇది పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తోందని సామాజికవేత్తలు ప్రశంసిస్తుంటే చంద్రబాబుకు రుచించడం లేదు. 2014 ఎన్నికల్లో వందలకొద్దీ హామీలను గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానంటూ నమ్మబలికారు. అసలు రూ.87 వేలు కోట్లు, వడ్డీ రూ.24 వేలు కోట్లు కలిపి మొత్తం రూ.1.11 లక్షల కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా రూ.15 వేల కోట్లు విదిల్చి (అది కూడా సున్నా వడ్డీని ఎగ్గొట్టి) నయ వంచన చేశారు. రూ.14 వేల కోట్ల రుణాలను మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను దగా 2. ఓ గేటులో 1/4 బిగించి హంగామా చంద్రబాబు: పోలవరం ప్రాజెక్టుకు గేట్లు పెట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో సహా 72 శాతం పనులు నేనే పూర్తి చేశా... వాస్తవం: పోలవరం స్పిల్‌వేకు 25.72 మీటర్ల స్థాయిలో 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. వరద నీటిని దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి హైడ్రాలిక్ సిలిండర్లు, హాయిస్ట్‌లను అమర్చాలి. చంద్రబాబు హయాంలో పోలవరం స్పిల్‌వే పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్‌వేలో 39, 40 పియర్స్ మాత్రమే 32 మీటర్ల స్థాయి వరకు చేశారు. ఆ స్థాయిలో గేట్లను అమర్చడానికి వీలుకాదు. 2018 డిసెంబర్ 24న రెండు పియర్స్ మధ్య నాలుగు స్కిన్ పేట్లను వెల్డింగ్ చేసి (ఇది ఒక గేటులో నాలుగో వంతు) అడ్డుగా నిలిపారు. దీంతో 48 గేట్లు అమర్చినట్లు, ప్రాజెక్టు పూరై్తనట్లు భ్రమ కల్పించారు. చంద్రబాబు అమర్చిన గేటు అనంతరం గాలి ఉద్ధృతికి రెండు పియర్స్ నుంచి కిందకు పడిపోయింది. ప్రాజెక్టు వద్దకు బస్సు యాత్రలతో భజన చేయించుకునేందుకు ఏకంగా రూ.వంద కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా తీవ్రతలోనూ, గోదావరి వరద ఉద్ధృతిలోనూ స్పిల్‌వేను పూర్తి చేసి 48 గేట్లను బిగించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి వరదను అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్ మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యే దశకు చేరుకుంది. ఇప్పటివరకూ 12,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంకల్పించారు. మొత్తమ్మీద ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 47.94% పూర్తయ్యాయి. పరిహారం.. ఫలహారం చంద్రబాబు: న్యాయస్థానాల్లో దాఖలు కేసులను ఉపసంహరించుకునేలా రైతులతో చింతమనేని ప్రభాకర్ ద్వారా చర్చించి పోలవరం కుడి కాలువను పూర్తి చేశా.. వాస్తవం: దివంగత వైఎస్సార్ హయాంలోనే పోలవరం కుడి కాలువ 95% పూరై్తంది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వారితో భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కేసులు వేయించి కుడి కాలువ పనులను చంద్రబాబు అడ్డుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక తాను కేసులు వేయించిన రైతులతో చింతమనేని ద్వారా మంతనాలు జరిపి ఎకరానికి గరిష్టంగా రూ.69 లక్షల చొప్పున రూ.720 కోట్ల మేర పరిహారాన్ని అందించి చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత మిగతా ఐదు శాతం పనులు చేశారు. 4. అవగాహనారాహిత్యంతో.. నాడు కమీషన్లు వచ్చే పనులకే చంద్రబాబు పచ్చజెండా ఊపారు. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే నదీ గర్భంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక మధ్యలోనే వదిలేశారు. 2019 మే 29 నాటికి పరిస్థితి ఇదీ! 2019 జూన్ రెండో వారంలోనే గోదావరికి వరదలు వచ్చాయి. నదీ గర్భంలో కాఫర్ డ్యామ్‌లు అడ్డంకిగా ఉండటం వల్ల వరద ఉద్ధృతి పెరిగి ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గత సర్కారు అవగాహనా రాహిత్యం, కమీషన్ల దాహమే పోలవరం పనుల్లో జాప్యానికి మూలకారణం. 5. కళ్లాల వద్దే కొనుగోళ్లు కనపడవా? చంద్రబాబు: ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. దళారులతో కలిసి అధికారపార్టీ నేతలు రైతులను దోచుకుంటున్నారు. వాస్తవం: ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మూడున్నరేళ్లలో రూ.48,974 కోట్లతో రైతుల నుంచి 2.62 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం రైతులను దగా చేస్తుంటే చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. బీసీల వెన్నెముక విరిచింది మరిచావా బాబూ..? చంద్రబాబు: సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేశారు. జనాభాలో 50% ఉన్న బీసీలకు పదవులివ్వకుండా సామాజిక అన్యాయం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ పథకాలతో ఎంత ప్రయోజనం చేకూర్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. టీడీపీకీ బీసీలే వెన్నెముక. వాస్తవం: బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. సమాజానికి వెన్నెముకగా అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని రీతిలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పది మందికి స్థానం కల్పించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం లాంటి అత్యంత కీలకమైన శాఖలు అప్పగించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించారు. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీకి 8 రాజ్యసభ స్థానాలు దక్కితే అందులో 4 సీట్లు బీసీలకే ఇచ్చారు. స్థానిక సంస్థలలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై చంద్రబాబు టీడీపీ నేతలతో హైకోర్టులో సవాల్ చేయడంతో 24 శాతానికి తగ్గిపోయాయి. చంద్రబాబు కుట్ర వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంతో, గతంలో ఉన్న 33% కంటే ఎక్కువగా అవకాశం ఇస్తానని మాటిచ్చిన సీఎం జగన్ ఆ మేరకు సర్పంచ్‌లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ మేయర్లుగా సింహభాగం బీసీ వర్గాల వారినే నియమించారు. బీసీల కోసం శాశ్వత కమిషన్‌ను నియమించారు. బీసీ సామాజిక వర్గాల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో సింహభాగం ఆ వర్గాలకే ఇచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో ఇప్పటిదాకా రూ.1,77,585.51 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీ వర్గాలకే రూ.85,915.06 కోట్లు దక్కాయి. పరిపాలన భాగస్వామ్యం కల్పించడం, ఆర్థికంగా చేయూత, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీ వర్గాల సామాజిక సాధికారతకు సీఎం జగన్ బాటలు వేశారు. తోకలు కత్తిరిస్తా.. తాటతీస్తా! 2014లో బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమ హక్కులను పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ బెదిరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హెచ్చరించారు. నాడు చంద్రబాబు 25 మందితో కూడిన తన మంత్రివర్గంలో బీసీలకు ఆరు పదవులు మాత్రమే ఇచ్చారు. 2014–19 మధ్య చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు. జీవనాడి జాప్యానికి బాబే కారణం చంద్రబాబు: ప్రతి సోమవారాన్ని పోలవారంగా పరిగణించి సమీక్ష చేశా. నెలకు ఒకసారి ప్రాజెక్టు వద్దకే వెళ్లి సమీక్షించా. కేంద్రమే నిధులు ఇస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాశనం చేసింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి నేనే కారణమంటున్నారు.. వాస్తవం: విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల దాహం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నాడు చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం నిధులు ఇస్తే చాలని ఒప్పుకోవడంతో కేంద్రం రూ.20,398 కోట్లకే పరిమితం చేసింది. 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు కాగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168 కోట్లు అవుతుంది. ఇదే అంశాన్ని సీఎం జగన్ పలు దఫాలు కేంద్రానికి వివరించి సవరించిన అంచనా వ్యయం ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరుతూ వస్తున్నారు. అరకొరగా ఫీజులు.. ఆపై బడాయిలు చంద్రబాబు: నేను అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చా. సీఎం జగన్ కేవలం 11 లక్షల మందికే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అదీ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. విద్యార్థుల తండ్రులు ఆ డబ్బులు తీసుకుని మద్యం తాగుతున్నారు. వాస్తవం: ఇంజనీరింగ్ కళాశాలలో గరిష్టంగా ఫీజు రూ.1.10 లక్షలు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.35 వేలు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. రూ.1,700 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్ డబ్బులను ఎగ్గొట్టడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. సీఎం జగన్ అధికారంలో చేపట్టాక ఇంజనీరింగ్ సహా వివిధ కోర్సులకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజును ఏటా రెండు వాయిదాలలో రీయింబర్స్మెంట్ కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తల్లులు కాలేజీలకు వెళ్లి తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుని సదుపాయాలు, బోధనలో నాణ్యతను ఆరా తీయాలనే ఉద్దేశంతో వారి ఖాతాల్లో జమ చేస్తుంటే దారుణంగా అవమానించడం చంద్రబాబుకే చెల్లింది. చదవండి: చంద్రబాబు హైడ్రామా.. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా.. -
ఒక్క ఇంటినీ కూల్చకున్నా.. ‘ఇప్పటం’ అబద్ధాలు ఇంకా..
సాక్షి, అమరావతి: తప్పుడు అఫిడవిట్లు సమర్పించి సానుకూల ఉత్తర్వులు పొందడంపై కన్నెర్ర చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని సాక్షాత్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ‘ఇప్పటం’ అబద్ధాలను ఇంకా కొనసాగించేందుకు సన్నద్ధం కావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నెల 27వతేదీన పవన్‌కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల యజమానులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తారని ఆ పార్టీ పేర్కొంది. ఇప్పటంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలను రూ.1.65 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నగర పాలక సంస్థ అధికారులు ఈ నెల 4వ తేదీన ఆక్రమణలు తొలగించిన విషయం తెలిసిందే. మానవతా దృక్పథంతో ఇళ్ల జోలికి వెళ్లకుండా ఆక్రమించి కట్టిన ప్రహారీ గోడలు, మెట్లు లాంటి వాటినే అధికారులు తొలగించగా ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేసిందంటూ పవన్‌కళ్యాణ్ ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. ఓ వర్గం మీడియా కూడా తప్పుడు కథనాలను ప్రచురించింది. అయితే జనసేన సభకు భూములిచ్చిన రైతులెవరు వారిలో లేరని సాక్ష్యాధారాలతో ఇప్పటికే రుజువైంది. చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ -
ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..
ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? ‘ఆక్వా జోన్– నాన్ ఆక్వా జోన్’ అనే పరిమితులు లేకుండా... ఆక్వా రైతులు అందరికీ యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం... అదో మహా ప్రసాదంలా ‘ఈనాడు’ భజంత్రీలు కొడుతూ అచ్చేయటం!!. అసలు ఆక్వా రైతుల పాలిట విలన్ ఎవరు రామోజీ? సీడ్ నుంచి ఫీడ్ వరకూ... చివరకు రొయ్యల ఎగుమతిదారుల వరకూ ఒకే వర్గానికి చెందిన వారు సిండికేట్‌గా ఏర్పడి... రైతుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ముఠాగా మారటం అబద్ధమా? తన వర్గానికి చెందిన వ్యాపారుల దారుణాలకు వత్తాసు పలికింది చంద్రబాబు కాదా? ఫీడ్, సీడ్ ధరలు ఆకాశాన్నంటుతున్నా... రొయ్యల ధరలు పతనమవుతున్నా ఏనాడన్నా బాబు హయాంలో ప్రభుత్వం జోక్యం చేసుకుందా? ఇప్పటి మాదిరిగా కనీస మద్దతు ధరలు నిర్ణయించి వ్యాపారుల చేత కొనిపించే సాహసం చేసిందా? అప్పుడెందుకు పెన్నెత్తలేదు రామోజీ మీరు? బాబు అధికారంలో ఉంటే ఎన్ని దారుణాలు జరిగినా మీకు ‘సమ్మ’తమేనా? మరీ ఈ స్థాయి పాత్రికేయమా? అసలు ఆక్వా – నాన్ ఆక్వా జోన్లను తెచ్చిందే చంద్రబాబు నాయుడు కదా? ఆక్వా జోన్లలోని వారికే విద్యుత్తు, ఇతర సబ్సిడీలని నిబంధనలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా? అప్పుడెందుకు ఈ నిబంధనలు పెట్టారు... ఇప్పుడెందుకు తొలగిస్తామంటున్నారని అడిగే బాధ్యత ‘ఈనాడు’కు లేదా? తాను అధికారంలో ఉంటూ ఏకంగా నాలుగున్నరేళ్ల పాటు యూనిట్ విద్యుత్తు ఆక్వా జోన్ల రైతులకు కూడా రూ.3.86 చొప్పున ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ల్లకు 6 నెలల ముందు దాన్ని యూనిట్ రూ.2కు తగ్గించాడు. అది కూడా ఆక్వా జోన్లలోని రైతుల వరకే!!. ఆ నాలుగున్నరేళ్లూ యూనిట్‌కు రూ.3.86 చొప్పున చెల్లిస్తూ ఆక్వా రైతులు పడ్డ బాధలు ‘ఈనాడు’కు కనిపించలేదు... వినిపించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు మరి!!. కానీ అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తూ ఆక్వా రైతుల వెతలు చూశారు. తాను అధికారంలోకి వస్తే ఆక్వా జోన్లలోని రైతులకు విద్యుత్తు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాబుకు గుబులు పెరిగి... ఎన్నికల ముందు ధర తగ్గించి తన జబ్బలు తానే చరుచుకున్నారు. రామోజీ కూడా శక్తివంచన లేకుండా చంద్రబాబు నిర్ణయాన్ని శ్లాఘించారు. కానీ... ఈ ఎన్నికల గిమ్మిక్కును ఆక్వా రైతులు అర్థం చేసుకున్నారు. ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకునేట్టుగా బాబుకు బుద్ధి చెప్పారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా జోన్లలోని రైతులకు యూనిట్ రూ.1.50కే అందించటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. జోనింగ్ నిబంధనలకు అర్థమేంటి? అసలు చంద్రబాబు ఆక్వా జోనింగ్ నిబంధనలు తెచ్చిందెందుకు? ఆక్వా సాగును కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలని కదా? అలా కాక ఎక్కడ పడితే అక్కడ కాలువ నీరు పారిన చోటల్లా చేపల చెరువులు వెలిస్తే మామూలు వ్యవసాయానికి భవిష్యత్తు ఉంటుందా? రాయలసీమలోని కడప జిల్లా మైదుకూరులో సైతం కాలువల వెంబడి చేపల చెరువులు తవ్వే ప్రయత్నాలు చేశారంటే ఏమనుకోవాలి? అలాంటి నాన్ –ఆక్వా ప్రాంతాల్లో కూడా రొయ్యల చెరువుల్ని విద్యుత్తు సబ్సిడీలిచ్చి ప్రోత్సహించాలన్న చంద్రబాబు ఆలోచన ఏ మేరకు సమంజసం? అలా రాయితీలిస్తే కాస్తో కూస్తో లాభసాటి కాబట్టి అంతా అటువైపే వెళతారు. అలా ఆక్వా సాగు చేసిన ప్రాంతాలన్నీ ఉప్పు నీటి కయ్యలుగా మారి మామూలు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. ఒకవేళ ఎప్పుడైనా... ప్రస్తుతం మాదిరిగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు తలెత్తి ఆక్వా సాగు దెబ్బతింటే... ఆ భూముల్ని మళ్లీ మామూలు సాగులోకి తీసుకురావటం అసాధ్యం. ఆ ఉద్దేశంతోనే జోనింగ్–నాన్ జోనింగ్ నిబంధనలొచ్చాయని ఎవరైనా చెబుతారు. మరిప్పుడు చంద్రబాబుకు ఏమైంది? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నేను అధికారంలోకి వస్తే చాలన్న దుర్బుద్ధి స్పష్టంకావటం లేదూ? ఈయన్ని... ఈయన తానా అంటే... తందానా అంటూ తయారయ్యే రామోజీరావును ఏం చెయ్యాలి? అంతా బాబు మనుషులు కాదా? ఫీడ్ తయారు చేసే కంపెనీలూ వారివే. రొయ్యల్ని ఎగుమతి చేసే కంపెనీలూ వారివే. అంటే రైతుకు పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించేదీ వారే... ఉత్పత్తి ధరను నిర్ణయించేదీ వారే. వీళ్లు ఈ స్థాయిలో ముఠాలా మారి అన్నీ శాసించినపుడు గత ప్రభుత్వం ఏం చేసింది? ఆక్వా కార్య కలాపాల్లోని అవంతి ఫీడ్స్, దేవి సీఫుడ్స్, దేవి ఫిషరీస్, నెక్కంటి సీఫుడ్స్, సంధ్య ఆక్వా, గ్రోవెల్ ఫీడ్స్, వాటర్ బేస్ లిమిటెడ్... ఇవన్నీ ఎవరివి? చంద్రబాబు సన్నిహితులవి కావా? అసలు రాష్ట్రంలో వనామీ రొయ్యల పెంపకం 2009లో మొదలైనపుడు... 2014 వరకూ నాటి ప్రభుత్వాలు 2–3 సార్లు రేట్లు పెంచాయి. కిలో రేటు దాదాపుగా రూ.20 వరకూ పెరిగింది. మరి 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కేవలం 70 పైసలు మాత్రమే ఎందుకు పెంచారు? ఎందుకు రైతులకు సరైన ధర రాకుండా వారి పొట్టగొట్టారు? 2019లో ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాకా దాదాపు కిలోకు రూ.27 వరకూ పెరగటం అబద్ధమా? కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అండగా నిలవటం అబద్ధమా? ఈ నిజాలు ఎన్నడూ ఎందుకు చెప్పరు రామోజీ? బాబు అబద్ధాలను మాత్రమే అచ్చేసే మీదీ ఒక పత్రికేనంటారా? ప్రతి ఏటా దోచుకోవటం... పచ్చి నిజం ఆక్వా ఎగుమతిదారుల మెడపై ప్రభుత్వం కత్తిపెట్టిందంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు... తన హయాంలో వారందరికీ ఇష్టారీతిన దోచుకోవటానికి లైసెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఏటా తొలిసారి రొయ్యల పంట చేతికొచ్చినపుడు ఏ రైతూ ఎక్కువ ధరను కళ్ల జూసేవాడు కాదు. 200 కౌంట్ ధర రూ.170–180 రూపాయలకు మించి పలికేది కాదు. ఎందుకంటే కంపెనీలన్నీ సిండికేట్‌గా ఏర్పడి ఈ మాయాజాలాన్ని కొనసాగించేవి. దానికి బాబు, రామోజీల అండ ఎటూ ఉంది. ‘ఈనాడు’ సైతం వీరి పక్షమే కనక... రైతుల వెతలను రాస్తే ఒట్టు!. అలా 170–180కి వీళ్లంతా రైతుల దగ్గర కొనుగోలు చేసిన తరవాత... అకస్మాత్తుగా ధర పెరిగిపోయేది. కానీ అలా పెరిగేటప్పటికి రైతుల చేతిలో రొయ్యలుండేవి కావు. ఇలాంటి పరిస్థితులుండకూడదనే చట్ట సవరణలు చేసి మరీ ఈ ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించింది. అదే రామోజీరావు దృష్టిలో పెద్ద నేరమైపోయింది. ఆక్వా రైతుల గురించి ‘ఈనాడు’ రాసే ప్రతి రాతలో ప్రభుత్వంపై విషం చిమ్మటానికి... ఈ సిండికేట్లను బ్రేక్ చేయటమన్నదే ప్రధాన కారణమని వేరే చెప్పాల్సిన పని లేదు కూడా. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈ సిండికేట్లు దోచుకోవటానికి చంద్రబాబు సాయపడితే... ఎన్నికలు వచ్చినపుడు వీళ్లంతా కలిసి చంద్రబాబుకు ఆర్థికంగా సాయపడతారు. అదీ వీళ్ల లెక్క. అందుకే వీళ్లకు సాధారణ రైతులంటే లెక్క ఉండదు. ఇక్కడ గమనించాల్సిందొకటుంది. బాబు హయాంలో ముడిపదార్థాల ధరలు తగ్గినా.... ఫీడ్‌పై మాత్రం కిలోకు రూ.7 అధికంగా దోచుకున్నారు. కానీ బాబు పట్టించుకుంటే ఒట్టు!!. అదే ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చేసరికి ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఇదే కారణంతో ఈ ఏడాది జూన్ నుంచి సెపె్టంబరు మధ్య 6 సార్లు కంపెనీలు ఫీడ్ ధరలు పెంచాయి. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుని 3 సార్లు తగ్గించింది. అంతేకాకుండా ముగ్గురు సీనియర్ మంత్రులు, సీనియర్ అధికారులతో ఆక్వా సాధికార కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ అందరితో చర్చించి... కిలోకు రూ.2.60 చొప్పున ఫీడ్ ధరలు తగ్గించింది. ఇలా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచకుండా ఏకంగా చట్టాన్ని సైతం సవరించింది ప్రభుత్వం. అలా.. ఫీడ్ ధరలను నియంత్రించే వ్యవస్థను తేవటంతో పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు దాదాపు రూ.10 లక్షల మేర ప్రయోజనం కలిగింది. కాకపోతే ఇలాంటి నిజాలను ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే ఇవి బాబు చేయలేని... కనీసం చేయాలనుకోని పనులు కాబట్టి!. జగన్ హామీ... బాబు జీవో.. బకాయిలు చెల్లించిన జగన్!! వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నపుడు... తాను అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో కలత చెందిన బాబు... అప్పటికప్పుడు ఆక్వా జోన్లలోని రైతులకు రూ.2కే యూనిట్ ఇస్తానని జీవో ఇచ్చారు. అది కూడా 2018 సెప్టెంబర్‌లో. అంటే 6 నెలల్లో ఎన్నికలున్నాయనగా!!. చిత్రమేంటంటే జీవో ఇచ్చినా ఆ మేరకు సబ్సిడీ నిధుల్ని విద్యుత్తు కంపెనీలకు మాత్రం ఇవ్వలేదు బాబు. అధికారంలోకి వచి్చన వెంటనే... 2019 జూలై 2 నుంచి వీరికి విద్యుత్తు యూనిట్ రూ.1.50కే ఇస్తున్నట్లు వైఎస్ జగన్ జీవో ఇచ్చారు. ఈ మూడున్నరేళ్లలో ఏకంగా రూ.2,687.47 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ రూపంలో ఖర్చు చేశారు. బాబు చెల్లించకుండా వదిలేసిన బకాయిలనూ చెల్లించారు. అదీ చిత్తశుద్ధి అంటే. ధరలెందుకు తగ్గాయి? అసలిప్పుడు రొయ్యల ధరలెందుకు పతనమయ్యాయి? ప్రధానంగా చైనా, అమెరికాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈక్వెడార్ లాంటి చిన్న దేశం నాణ్యమైన రొయ్యల్ని ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో సవాల్ విసిరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లేక... ధరలు పతనమయ్యాయి. ఇక దేశీయంగా పరిస్థితులెలా ఉన్నా రాష్ట్రం మాత్రం నాణ్యమైన విద్యుత్తును సబ్సిడీ ధరకే అందించటంతో ఇక్కడ ఉత్పత్తి పెరిగింది. ఎగుమతిలో పోటీ పెరిగింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా దానికి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాహసమే చేసింది. మత్స్య రంగంలో ఏపీ ఉత్తమ రాష్ట్రం.. కేంద్రం కితాబు మత్స్య రంగానికి సంబంధించి అన్ని అంశాలలో ఆంధ్రప్రదేశ్‌ను భారత ప్రభుత్వం 2021లో ఉత్తమ రాష్ట్రంగా గుర్తించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అదే ఏడాది నవంబర్ 21న బహుమతి ప్రదానం చేసింది. మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రం.. దేశంలోనే 30 శాతం వాటా కలిగి అగ్రగామిగా ఉంది. స్థూల విలువ జోడింపులో 2014–15లో 4.6 శాతంగా ఉన్న వాటా, 2020–21 నాటికి 9 శాతానికి అభివృద్ధి చెందింది. మొత్తం దేశ సముద్ర ఆహార ఎగుమతుల విలువలో రాష్ట్ర వాటా 2014–15 లో 28 శాతం ఉండగా, 2020–21 నాటికి అది 35 శాతానికి పెరిగింది. ఎగుమతుల విలువ 2014–15లో రూ.9,671 కోట్లు ఉండగా, 2020–21 నాటికి అది రూ. 20,019 కోట్లకు పెరిగింది. 2014–15లో 19.78 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న మత్స్య ఉత్పత్తి.. 2021–22లో ఏకంగా 48.13 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, మత్స్య రంగం వృద్ధి చెందలేదని చెప్పడం ఎవరి బాగు కోసం? -
బూతుల మోతాదు పెంచిన చంద్రబాబు.. పీక్స్‌లో ఫ్రస్టేషన్!
బహుశా ఏపీలో మాత్రమే ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం, ఇలాంటి అధ్వాన్నపు మీడియా ఉంటుందేమో! అధికారపక్షంపై ఎవరైనా దాడి చేస్తే అది నిరసన, ప్రజాస్వామ్యం. ప్రతిపక్షానికి నిరసన తెలిపితే మాత్రం దాడి.. ప్రతిపక్ష నేతతో సహా టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే అది వేద పారాయణం. అధికారపక్షం వారు ఘాటుగా సమాధానం ఇస్తే బూతులు మాట్లాడినట్లు.. ఈ రకంగా అటు ప్రతిపక్ష రాజకీయం, దానికి మద్దతు ఇచ్చే తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేయాలని విశ్వయత్నం చేస్తోంది. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా అంగీకరించకూడదు. కాని నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందరికి ఆదర్శంగా ఉండవలసింది పోయితానే బూతుల మోతాదు పెంచేశారు. ఏపీలో అధికారంలోకి రావాలన్న తహతహతో ఇలా ప్రవర్తిస్తున్నారు. చివరికి ఆయన నా కొడుకులు.. ఆంబోతులు.. రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని.. రా.. నేనేంటో చూపిస్తా... ఇలా రకరకాల బూతులతో కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన ప్రసంగాలు అందరిని విస్తుపరచాయి. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కావాలన్నది అక్కడి ప్రజల డిమాండ్. దానికి రాయలసీమ అంతటా మద్దతు ఉంది. రాయలసీమ పట్టణాలు, గ్రామాలు అన్నిటా వికేంద్రీకరణ ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. అయినా దానిని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కర్నూలులో మాట్లాడే సాహసం చేశారు. ఆయనకు అమరావతే సర్వస్వంగా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడే తన పార్టీ వారికి తన వర్గం వారికి దక్కించడం కోసం నానా తంటాలు పడుతున్నారు. అమరావతి నినాదం గత ఎన్నికలలో ముంచినా ఆయనలో మార్పు రాలేదు. దానికి కారణం అక్కడ ఉన్న వెస్టెడ్ ఇంటరెస్టు అనండి.. రియల్ ఎస్టేట్ ఇంటరెస్టు అనండి.. ఇలాంటివేవో ఆయనకు బలంగా ఉన్నాయని అంటారు. చంద్రబాబు వైఖరిపై వివిధ జిల్లాలలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మరింత తీవ్రమైన ప్రతికూలత ఉండడంతో, దానిని తగ్గించుకోవడం కోసం చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు వెళ్లారు. అక్కడ ఏదో రకంగా జనసమీకరణ చేసి ప్రసంగాలు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తాను భావించానని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి విభజిత ఏపీలో కర్నూలులో హైకోర్టు పెట్టాలని రాయలసీమ న్యాయవాదులు ధర్నాలు చేశారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. అసలు ఆ మాటే ఎత్తవద్దన్నట్లుగా వ్యవహరించారు. శ్రీ బాగ్ ఒడంబడిక అన్నది ఆంధ్ర, రాయలసీమ నేతల మధ్య జరిగిన ఒక అవగాహన. దానిని గౌరవించడం పాలకుల విధి. కాని చంద్రబాబు రాయలసీమ వారే అయినా, ఆయన అక్కడివారి ఆకాంక్ష తీర్చడానికి సిద్దపడలేదు. నిజంగానే ఒకవేళ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే అదోరకంగా ఉండేది. కాని అలా చేయకపోగా, ఇప్పుడు అసత్యాలు చెబుతున్నారు. పైగా తన ర్యాలీ వద్దకో, పార్టీ ఆఫీస్ వద్దకో వచ్చి హైకోర్టు ఏర్పాటును డిమాండ్‌ను వ్యక్తం చేసిన న్యాయవాదులను, విద్యార్థులను రౌడీలని, గూండాలని సంభోదిస్తున్నారు. వాళ్ల సంగతి చూస్తానంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి సభలనైనా, ర్యాలీనైనా అడ్డుకోరాదు. కాని అదే సమయంలో తమ కోర్కెల సాధనకోసం ప్రశాంతంగా నిరసన చెప్పుకునే హక్కు ఉంటుంది. కర్నూలులో న్యాయ వాదుల ప్రతినిధులను పిలిపించుకుని వారి వాదన ఏమిటో విని ఉండవచ్చు. అలా కాకుండా తన పార్టీ ఆఫీస్ వద్దకు వస్తారా అంటూ హుంకరించారు. ఇదంతా రాజకీయంగా ఆయనకు నష్టమే తప్ప లాభం ఉండదు. ఆ సంగతి తెలిసినా, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ట్రాప్‌లో పడి నోటికి వచ్చినట్లు నిరసనకారులను దూషించారు. దీనిపై కవరింగ్ ఇవ్వడానికి తెలుగుదేశం వీర మద్దతుదారుగా ఉన్న ఈనాడు పత్రిక చాలా కష్టపడింది. చంద్రబాబు మాట్లాడిన బూతులను యథాతధంగా ఇవ్వలేదు. అదే సమయంలో నిరసనకారులకు చంద్రబాబు గట్టి జవాబు ఇచ్చారని రాసింది. అదేమిటంటే బూతులు తిట్టడం అన్నమాట. ఒకే.. ముఖ్యమంత్రిని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పద్దతిగా విమర్శించవచ్చు. కాని వారితో పాటు ప్రజలను దూషించడం ఏమిటో అర్థం కాదు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, మంత్రులు బదులు చెబితే వారంతా దాడి చేస్తామంటున్నారని ఈ పత్రిక హెడ్డింగ్‌లు పెడుతోంది. నిజంగానే ఇలాంటి నిరసనలు మంచిది కాదని చంద్రబాబు కాని, ఈనాడు వంటి పత్రికలు కాని భావిస్తే వారు ఆ విషయం చెప్పవచ్చు కాని, దూషణలకు లంఖించుకుంటారా? మరి అదే టీడీపీ వారు ఎక్కడైనా దాడులు చేస్తే మాత్రం వాటిని నిరసనలుగా చూపించే యత్నం చేస్తున్నారు. కొందరు చోటామోట నేతలు బూతులు తిట్టినా, వారి జోలికి రాకూడదని, పోలీసులు చర్యలు తీసుకోరాదని, ఒకవేళ అలా తీసుకుంటే ప్రజాస్వామ్యం నాశనం అవుతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు.. కొందరు వైసీపీ నేతలు, మంత్రులపై దాడులకు తెగబడితే అది అసలు జరగనట్లు, పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నట్లు టీడీపీ మీడియా ప్రచారం చేసింది. పైగా పవన్‌కు సంఘీభావం అని, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని చంద్రబాబు కొత్త డ్రామాకు తెరదీశారు. కాని అంతలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ టీడీపీ గురించి ప్రస్తావించడం తగ్గించడంతో ఆ డ్రామాకు బ్రేక్ పడింది. టీడీపీ మీడియా కూడా పవన్‌కు కవరేజీ తగ్గించేసిందట. ఇది వేరే సంగతి. వైసీపీ ప్రభుత్వం గడప, గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో పాల్గొనే ఎమ్మెల్యేలకు ప్రజలు ఎవరైనా తమ సమస్యలు విన్నవిస్తే, గడపగడపలో నిరసన అని, నిలదీశారు అని ఇదే ఈనాడు, తదితర టీడీపీ మీడియా పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చింది. కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు చంద్రబాబును ప్రశ్నిస్తే అది మాత్రం దాడి అని వక్రీకరిస్తున్నారు. నిజంగా దాడి అయితే ఎంత గొడవ జరగాలి. అలాంటిదేమీ కనిపించలేదు. చాలా వరకు శాంతియుతంగానే నిరసన చెప్పారు. చంద్రబాబు తన ప్రసంగాలలో రెచ్చగొట్టేలా మాట్లాడారు. అక్కడి ప్రజల మనోభావాలు గాయపడేలా ప్రసంగించారు. ఆయనకు ఇది అలవాటే. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కొన్నిసార్లు ఇలాగే చేశారు. ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేసినప్పుడు పలుమార్లు ఘర్షణ వాతావరణం సృష్టించేవారు. చివరికి తన రాజకీయ అవసరాల కోసం తానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జై కొట్టారు. దానిపై లగడపాటి రాజగోపాల్ వంటివారు చంద్రబాబుకు ఏపీలో నిరసన చెప్పబోగా వారిని గృహ నిర్భంధం చేయాల్సి వచ్చింది. చిత్రమేమిటంటే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పర్యటిస్తే తనవల్లే రాష్ట్రం వచ్చిందని, ఏపీలో పర్యటిస్తే, రాష్ట్రాన్ని విడదీసి సోనియా గాంధీ ఆంధ్రుల పొట్టకొట్టిందని రెండు మాటలూ తానే చెప్పేవారు. ఇప్పుడు కూడా రాజకీయంగా తను బాగా నష్టపోతానని అనుకుంటే చంద్రబాబే కర్నూలు హైకోర్టుకు జై కొట్టినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో ఏదో రకంగా శాంతి భద్రతలను చెడగొట్టడానికే చంద్రబాబు కాని, ఆయన పార్టీ నేతలు కాని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. తమ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎవరైనా నిరసనకారులు ఆవేశపడితే, అప్పుడు ఏదైనా జరిగితే దానిని వైసీపీపై నెట్టవచ్చన్నది వారి వ్యూహం కావచ్చు. అంతేకాదు. తాము నోటికి వచ్చినట్లు దూషించినప్పుడు పోలీసులు కేసులు పెడితే ఎలా అబద్దాలతో ఎదుర్కోవాలో టీడీపీ నేతలు ట్రైనింగ్ ఇస్తున్న సన్నివేశం వీడియో గమనిస్తే వారికి న్యాయ వ్యవస్థను మోసం చేయడంలో ఎంతటి అనుభవం ఉన్నది అర్థం చేసుకోవచ్చు. వీలైతే వ్యవస్థలను మేనేజ్ చేయి.. లేదంటే అబద్దాలతో న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించు.. అని బాహాటంగానే చెప్పుకునే పరిస్థితి టీడీపీలో వచ్చిందంటే ఆ పార్టీ ఎంత దయనీయ స్థితిలో ఉందో ఊహించుకోవచ్చు. అధికారం కోసం ఎంతకైనా దిగజారడానికి తెలుగుదేశం అధినేతతో సహా ఆ పార్టీ నేతలంతా సిద్ధం అవుతున్నారన్నమాట. కనుక వారిపట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
విష నాలుకలు.. నీచ నాయకులు...
నవ్విపోదురు గాక.. అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. ఎవరేమనుకోనీ గాక.. అని కూడా ముక్తాయిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ అనుభవాన్ని, తాము అధిష్టించిన పదవుల గొప్పతనాన్ని గాలికొదిలేస్తున్నారు. వీళ్లకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిస్సిగ్గుగా నాయకత్వం వహిస్తున్నారు. వీళ్లంతా కలిసి నోటికొచ్చిన తీరులో మాటలు విసిరేస్తున్నారు. అవతలివారు ఎవరన్నది కూడా చూడకుండా.. తాము ఏమంటున్నదీ ఆలోచించకుండా బురద జల్లుతున్నారు. అయితే ఆ విధంగా వీరు ఉన్న కొద్దిపాటి పరువును తామే నడిబజారులో దిగజార్చుకుంటున్నారు. జనం ఛీత్కారాలను దండిగా పోగు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై ట్విట్టర్ వేదికగా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి మరణంపై ఇంత దారుణమైన ట్వీట్ చేశారంటే అచ్చెన్న రాజకీయంగా ఎంత దిగజారిపోయారో, ఎంత సంస్కార హీనంగా మాట్లాడారో ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని జనం ఆక్షేపిస్తున్నారు. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంను ‘ఆమదాలవలస నడిరోడ్డుపై గుడ్డలూడదీస్తాను’ అంటూ.. పరిషత్ ఎన్నికల రోజున పెనుబుర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేసిన సందర్భంలో పోలీసు అధికారులను దుర్భాషలాడిన కేసులో గురువారం అరెస్టై బెయిల్‌పై వచ్చిన తర్వాత పరుషపదజాలంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ దూషించారు. ►ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అచ్చెన్న, రవికుమార్‌లను చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా? అని ముక్కున వేలేసుకున్న పరిస్థితి ఏర్పడింది. నోరు పారేసుకోవడం, అరెస్టులవ్వడం, బెయిల్‌పై విడుదల కావడం, మళ్లీ నోటికొచ్చినట్టు దురుసుగా, అసభ్యకరంగా మాట్లాడం వీరిద్దరికి అలవాటైపోయింది. వీరా మన నాయకులు అంటూ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఇంత హీనంగా వ్యవహరిస్తున్న నాయకులు మన జిల్లాకు చెందిన వారు కావడం బాధాకరమని అసహ్యించుకుంటున్నారు. అచ్చెన్నకు, కూన రవికి ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో నోరు పారేసుకున్నారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిపై దాడి ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో ‘ఏయ్ ఎవర్నువ్. ఎలా అరెస్టు చేస్తావ్. ఏమనుకుంటున్నావ్. ఎవర్నీ వదల్ను. మళ్లీ అధికారంలోకి వచ్చాక నేనే హోం మంత్రినవుతా..సంగతి తేలుస్తా..’ అని పోలీసు అధికారులను అచ్చెన్నాయుడు బెదిరించారు. ►ఏయ్ ఎగ్స్ట్రాలు చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు? నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? యూజ్లెస్ ఫెలో..’అంటూ అమరామతిలో పోలీసు అధికారులపై తీవ్ర పదజాలంతో అచ్చెన్న దూషించారు. ►ఈఎస్ఐలో రూ.150 కోట్ల మేర కుంభకోణం చేసి విచారణలో బయటపడి అరెస్టయితే...ఇది కక్ష సాధింపు అంటూ పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఇలా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ పోటీ పడి నోటికొచ్చినట్టు మాట్లాడి సిక్కోలు జిల్లా గౌరవాన్ని మంట కలిపేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. జిల్లా వాసులు ఎక్కడున్నా మంచి ప్రవర్తన, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తారు. వినయంగా మాట్లాడతారు. కానీ జిల్లాకు మచ్చ తెచ్చేలా అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ మాట్లాడుతుండటంపై ప్రజలు ఛీకొడుతున్నారు. వీరికి మంచి బుద్ధి ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. తీరు మారని కూన.. అచ్చెన్నాయుడి కన్నా తానేమీ తక్కువ కాదన్నట్టుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ దురుసుగా మాట్లాడుతున్నారు. ‘ఏయ్ జాగ్రత్త.. శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. మీ స్థాయి ఎంత..మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి రవికుమార్ గతంలో తీవ్ర పదజాలంతో మాట్లాడారు. ►పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. ‘.. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే నీ సంగతి చూస్తా’ అని కూన బెదిరించారు. ►‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తాను..’ అంటూ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ►‘నీకెంత ఒల్లు బలిసింది... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు ’ అంటూ మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న పొందూరు తహశీల్దార్‌ను పరుష పదజాలంతో బెదిరించారు. చదవండి: కూన తీరు మారదు.. పరుగు ఆగదు! ‘కూన’ గణం.. క్రూర గుణం -
పచ్చ నేతల కుటిల రాజకీయం
అంబాపురం (గురజాల రూరల్): ఒకే సామాజికవర్గంలోని బంధువుల్లో ఇంటివద్ద బోరింగ్ వివాదంలో ప్రత్యర్థులు గొడ్డళ్లతో చేసిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని అంబాపురం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న సంగతి విదితమే. కుటుంబాల గొడవల్లో పాతకక్షల నేపపథ్యంలో జరిగిన హత్యకు పచ్చపార్టీ నేతలు పార్టీల రంగు పులుముతున్నారు. వివరాల్లోకి వెళితే..అంబాపురం గ్రామంలో 2019 జనవరిలో జరిగిన గొడవల్లో బాజీ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటనలో దోమతోటి విక్రమ్, బత్తుల వాసు నిందితులు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య పలుమార్లు చెదురుమదురు ఘటనలు(గొడవలు) చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో తాగునీటి బోరు విషయంలో జరిగిన తగాదా నేపథ్యంలో.. దోమతోటి విక్రమ్, బత్తుల వాసు ఒక ద్విచక్రవాహనపై, బత్తుల నాగరాజు, అర్జున్, జంగా పాపులు మరో ద్విచక్రవాహనపై శనివారం రాత్రి గురజాలకు వచ్చి స్వగ్రామమైన అంబాపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు మంటి పుల్లయ్య, మంటి బ్రహ్మయ్య, మామిడిపల్లి మల్లయ్య, కసుకుర్తి కొండా, గొట్టిముక్కల నాగులు, పెంటమళ్ల వెంకటేశ్వర్లు, దోమతోటి బాజితోపాటు మరికొంతమంది గొడ్డళ్లతో నాగరాజు, అర్జున్, పాపులపై ముందుగా దాడి చేశారు. అనంతరం రెండో ద్విచక్రవాహనంపై వచ్చిన వాసు, విక్రమ్‌పై దాడి చేశారు. విక్రమ్‌కు కాళ్లు, చేతులపై తీవ్రగాయాలై కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను పోలీసుల సొంత వాహనంలో గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అధిక రక్తస్రావమై అపస్మారకస్థితిలో ఉన్న విక్రమ్(33)ను వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారు. మిగతా వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ బాలకృష్ణ గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ మాట్లాడుతూ కేసును త్వరగా ఛేదిస్తామని తెలిపారు. ఇప్పటికే కొంతమంది నిందుతులను పట్టుకుని విచారిస్తున్నట్లు అనధికార సమాచారం. అయితే ఇలాంటి ఘటనలకు కూడా పచ్చ పార్టీ నేతలు పార్టీల రంగులు పులిపి గ్రామాల్లో ఫ్యాక్షన్ చెలరేపేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. -
కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురు దాడి
-
నీచ రాజకీయాలు తగవు
కర్నూలు(రాజ్‌విహార్): టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక భాగ్యనగర్‌లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజల విశ్వాసం కోల్పోయిన ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోందన్నారు. మొన్నటి వరకు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీదేవిపై అవిశ్వాసానికి తీవ్ర ప్రయత్నాలు చేయగా హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులు ఆరుగురిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకుని జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న నీచ సంస్కృతి ఆ పార్టీ నేతలదన్నారు. తాజాగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ జిల్లా చైర్మన్ రాంపుల్లయ్య యాదవ్‌పై అవిశ్వాసానికి సిద్ధపడ్డారన్నారు. ఈ క్రమంలో ఇరువురు డెరైక్టర్లు పెద్దిరెడ్డి, తమ్మన్నలను కిడ్నాప్ చేశారని మరో డెరైక్టర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. ఎలాంటి ఆధారం లేకపోయినా రాంపుల్లయ్య ఇంటికి వెళ్లి శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టడం సమంజసం కాదన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని.. కనీసం తప్పుడు కేసులను నిర్ధారించుకోవాలనే ఆలోచన రాకపోవడం శోచనీయమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామన్నారు. కోర్టులు తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు పోతే టీడీపీ నేతలు కాపాడలేరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. గోనెగండ్ల మండలం కులుమాలకు చెందిన జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ డెరైక్టర్ కె.పెద్దిరెడ్డి మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు. ఉల్లిగడ్డల వ్యాపారంలో భాగంగా తాడేపల్లిగూడెంకు వెళ్లానన్నారు. ఆదోని మండలం బైచిగేరికి చెందిన మరో డెరైక్టర్ కె.తమ్మన్న మాట్లాడుతూ తనను కూడా ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. దైవదర్శనార్థం తిరుపతికి వెళ్లొచ్చానన్నారు. తామిద్దరి విషయంలో తప్పుడు కేసు బనాయించినట్లు చెప్పారు. చైర్మన్ రాంపుల్లయ్య యాదవ్‌కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో రాంపుల్లయ్య యాదవ్ తనయుడు గోపినాథ్ యాదవ్ పాల్గొన్నారు. -
బెయిల్‌కు ముందు భూతాలు
జగన్ బెయిల్‌పై తీర్పు నేపథ్యంలో హస్తినలో చంద్రబాబు నీచ రాజకీయాలు తెలుగుదేశానికి అధిష్టానం ఢిల్లీలో ఉందా? చంద్రబాబు నాయుడి రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందా? జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ ఆయన ఢిల్లీకి వెళ్లటం చూస్తుంటే అది నూరుశాతం నిజమనిపించకమానదు. సాక్ష్యాలతో సహా బయటపడ్డ ఐఎంజీ, ఎమ్మార్ వంటి కుంభకోణాల్లో సైతం సీబీఐ తనవైపు చూడకుండా ఢిల్లీ వెళ్లి చీకటి రాజకీయాలు నడిపిన బాబు... అందుకోసం ఏకంగా తెలుగుదేశం ఆవిర్భావ సిద్ధాంతాన్నే తాకట్టు పెట్టేశారు. కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన ఆ పార్టీని... తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో విలీనం చేసే స్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం పడిపోకుండా నాలుగేళ్లుగా కాపాడుతున్న చంద్రబాబు... కేంద్రంలోనూ కాంగ్రెస్ సర్కారు ఓడిపోతుందనే భయంతో ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌కు తన ఎంపీలను గైర్హాజరు చేశారంటే ఏమనుకోవాలి? జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న ప్రతిసారీ ఏదో సాకుతో హస్తినకు వెళ్లడం... ప్రభుత్వ పెద్దలను కలిసి హడావుడి చేయడం... తన చీకటి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చీకట్లో మంతనాలు సాగించడం... ఇదీ బాబు మార్కు ‘మోడస్ ఆపరెండీ’... వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై కేసు వేయటం నుంచీ... 16 నెలలుగా ఆయనకు బెయిలు రాకుండా చేయటం దాకా చంద్రబాబు- కాంగ్రెస్- ఎల్లోమీడియా కుమ్మక్కయి చేస్తున్న హోమ్‌వర్క్ ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. రెండున్నర ఎకరాల నుంచి మొదలైన బాబు ఆస్తుల యాత్ర ఇపుడు దాదాపు 2వేల కోట్లను దాటేసింది. ఇక ఆయన దాచిపెట్టిన, విదేశాల్లో కూడబెట్టిన ఆస్తుల్ని కలుపుకుంటే ఆ మొత్తం ఎన్ని వేల కోట్లు ఉంటుందనేది ఈ భూమ్మీద ఎవ్వరైనా చెప్పటం కష్టం. ఇంత దోపిడీకి పాల్పడి కూడా... ఆయన ఏడాదికోసారి ఆస్తుల్ని వెల్లడిస్తూ... వందలాది కోట్ల విలువైన ఆస్తుల్ని సైతం కేవలం లక్షలుగా చూపిస్తూ ముందుకొస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలంటే ఆయనకెంత చిన్నచూపో అర్థం కాక మానదు. అయినా సరే... ఈయన స్కాములపై సాక్షాత్తూ హైకోర్టు విచారణకు ఆదేశించినా కూడా సీబీఐ ఒక్క అడుగు ముందుకు కదలదు. ఆయన్ను పిలిచి కనీసం విచారించదు. చివరకు బాబు, తన ఎల్లో కవల రామోజీరావుతో సహా కోర్టులకెక్కి ఆ విచారణను నిలుపు చేయించుకునేదాకా... సీబీఐకి సమయమే చిక్కదు. పోనీ ఆయనపై సీబీఐ దర్యాప్తు జరపండని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేస్తే... తమ దగ్గర సిబ్బంది లేరని చెప్పి సీబీఐ మిన్నకుంటుంది!! అసలు ఒక దర్యాప్తు సంస్థ తన దగ్గర సిబ్బంది లేరన్న కారణంతో ఒక అవినీతి కుంభకోణాన్ని విచారించలేదంటే ఏమనుకోవాలి? కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందనుకోవాలి? ఇంత నలుపు పెట్టుకున్న బాబు... జగన్మోహన్రెడ్డి బెయిలుపై తీర్పు రానున్న ప్రతిసారీ తన ఎల్లోమీడియా సాయంతో శివాలెత్తుతుండటమే ఘోరాతిఘోరం. కేసు వేయించటం నుంచే కుట్ర రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన్న తరవాత... ఆయన తనయుడికి రాష్ట్రంలో అభిమానం అంతకంతకూ పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యే శంకర్రావుతో కేసు వేయించటమే ఈ కుట్రకు ఆరంభం... పరాకాష్ట కూడా. దానికి తెలుగుదేశం తోడవటం చంద్రబాబు దిగజారుడుతనానికి, అపవిత్ర కలయికకు తారస్థాయి తప్ప మరొకటి కాదు. ఇంకా చిత్రమేంటంటే ఈ కేసులో ప్రతివాదులుగా ఒకటి నుంచి 9 వరకు ప్రభుత్వ విభాగాలే ఉన్నాయి. జగన్మోహన్రెడ్డి 52వ ప్రతివాది. అయినప్పటికీ ఈ కేసులో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. కేసు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించినదైనా... ఆ నిర్ణయాలు తప్పో, ఒప్పో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. నిజానికి ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ నిబంధనల ప్రకారం తీసుకున్నవే. ఆ విషయం గనక కోర్టుకు ప్రభుత్వం చెబితే ఈ కేసే లేదు. అలాంటి కేసులో ప్రభుత్వం సమాధానం ఇవ్వకున్నా... ఆ ఒక్క కారణంతో కేసు కొట్టేయలేమన్న న్యాయమూర్తి అభిప్రాయం కారణంగా తీర్పు జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా వచ్చేసింది. అసలు ఈ కేసేంటి? వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఆస్తులు, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు కొందరు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, అందుకు ప్రతిగా వారు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని. మరి ఈ ప్రాజెక్టుల్ని, కాంట్రాక్టుల్ని కట్టబెట్టినపుడు నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అడ్డగోలుగా ఏమైనా కట్టెబెట్టేశారా? అన్నీ నిబంధనల ప్రకారం జరిగి ఉంటే వారు ముడుపులు చెల్లించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ప్రతిదీ జీవోల మేరకు జరిగిందే కదా? మరి ఆ జీవోలు తప్పో, ఒప్పో ప్రభుత్వం చెప్పాలి కదా? ప్రభుత్వం కోర్టుకు సమాధానమెందుకు చెప్పలేదు? జగన్మోహన్రెడ్డిని ఇరికించడానికి కాదా? ఛార్జిషీట్లు వేశాక అరెస్టా? కోర్టు తీర్పు మేరకు 2011 ఆగస్టులో దర్యాప్తు ఆరంభించిన సీబీఐ... 2012 మే నాటికి మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఆ మూడింట్లోనూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని మొదటి నిందితుడిగానే పేర్కొంది. చిత్రమేంటంటే ఆ మూడు ఛార్జిషీట్లు వేసేదాకా జగన్‌ను కనీసం విచారణకు కూడా పిలవలేదు. అసలు ఒక వ్యక్తిని విచారించకుండా ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ ఛార్జిషీట్లు వేయటమనేది భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. అలాంటిది ఆ ఛార్జిషీట్లను విచారణకు స్వీకరించేటపుడు తన ఎదుట హాజరుకావాల్సిందిగా కోర్టు జగన్‌కు సమన్లిస్తే... తెల్లారితే ఆయన కోర్టుకు వెళతారనగా అర్ధరాత్రి సీబీఐ అరెస్టు చేసింది. అది కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారని కూడా విస్మరించి... బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంతో అరెస్టు చేసింది. అయినా మూడు ఛార్జిషీట్లు వేసేదాకా విచారణకు అడ్డుపడని... సాక్షులను ప్రభావితం చేయని వ్యక్తి ఆ తరవాత చేస్తారని సీబీఐ వాదించిందంటే ఏమనుకోవాలి? నిజానికి కోర్టు ఎదుట హాజరైతే సొంత పూచీకత్తుపై బెయిలిచ్చే అవకాశముంది. అపుడు సీబీఐ అరెస్టు చేయడానికి ఉండదు. ఈ నేపథ్యంలో సీబీఐ ఆయన్ను అరెస్టు చేయటమే ఇక్కడ కుట్రను కళ్లకు కట్టే అంశం. ఈ అరెస్టు అక్రమమని సీబీఐ కోర్టే స్వయంగా చెప్పింది. ఛార్జిషీట్లు వేశాక అరెస్టు చేయడాన్ని సీబీఐ ఏ రకంగానూ సమర్థించుకోజాలదని హైకోర్టు కూడా స్పష్టంచేసింది. అంటే కుట్ర ఏ స్థాయిలో జరిగిందో కనపడటం లేదా? పెపైచ్చు కేసులో ఏం తేలుతుందో తేలదోనన్న భయంతో దర్యాప్తుకన్నా వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబ పరువు ప్రతిష్టలనే టార్గెట్ చేసింది సీబీఐ. దర్యాప్తు జరుగుతుండగానే దాన్ని ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులివ్వటం, దర్యాప్తు అధికారి నేరుగా ఓ వర్గం మీడియా విలేకరులకు ఐదారు వందల ఫోన్‌కాల్స్ చేసి ఉన్నవీ లేనివీ వెల్లడించటం చూస్తే వీళ్ల టార్గెట్ వైఎస్ కుటంబమని తెలియకమానదు. రాష్ట్ర సమస్యలు పట్టవా? అడ్డగోలుగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయంతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. సమైక్యాంధ్ర కోసం 53 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులతో సీమాంధ్ర జిల్లాల జనమంతా రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేశారు. జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలూ రాజీనామాలకు దిగారు. రాష్ట్రాన్ని విభజించడానికి ఓకే అంటూ బ్లాంక్ చెక్ మాదిరి కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు... విభజన నిర్ణయంపై సీమాంధ్ర జిల్లాల్లో రేగిన ఆందోళన చూశాక అక్కడ యాత్రకు దిగారు. అంతేతప్ప తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోవటం గానీ... తన ఎమ్మెల్యేలు, ఎంపీలచేత రాజీనామా చేయించటం గానీ ఏమీ చేయలేదు. పెపైచ్చు ఈ అంశంపై రాష్ట్రం రావణకాష్టంలా మండుతుండగా ఈయన జగన్ మోహన్‌రెడ్డిపై ఫిర్యాదు చేయటం కోసం ఢిల్లీకి బయలుదేరారంటే ఏమనుకోవాలి? అయినా రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థపై ప్రభావం చూపించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నించటం సమంజసమేనా? ఒకసారి దర్యాప్తు అంటూ పూర్తయితే న్యాయమూర్తి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఈ కేసలో జరిగింది కూడా అదే. తమ దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ మౌఖికంగా, లిఖితపూర్వకంగా కూడా కోర్టుకు తెలియజేసింది. మరి ఈ సమయంలో కోర్టును ప్రభావితం చేసేలా రాజకీయాలకు దిగుతున్న చంద్రబాబును ఏమనాలి? ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? భారతి సిమెంట్‌పై ఛార్జిషీట్లో పేర్కొన్నారంటూ ‘ఈనాడు’ రెండు రోజుల పాటు తోచిన కథనాన్ని వండేసింది. కడప జిల్లాలో సున్నపురాయి గనుల మైనింగ్ కోసం గుజరాత్ అంబుజా సంస్థ దరఖాస్తు చేసినా దానికివ్వకుండా భారతి సిమెంట్‌కు ఇచ్చారని, వైఎస్ చక్రం తిప్పారని రాసేసిన ‘ఈనాడు’... అక్కడ ఐదేళ్లపాటు లీజు తనపేరిటే ఉన్నా ఫ్యాక్టరీ కట్టడంలో గుజరాత్ అంబుజా విఫలమైన అంశాన్ని మాత్రం ప్రస్తావించదు. జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలోనే ఫ్యాక్టరీని సాకారం చేశారని గానీ... ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా పరోక్షంగా 8వేల పైచిలుకు మంది ఉపాధి పొందుతున్నారని గానీ రామోజీ రాయనే రాయరు. ఆ లీజు భూములన్నీ ప్రైవేటువని, ఎకరా రూ.3 లక్షల పైచిలుకు పెట్టి కొనుగోలు చేసినవే తప్ప చంద్రబాబు నాయుడి మాదికి పప్పులు బెల్లాలకు ప్రభుత్వం కేటాయించినవి కాదని కూడా రాయరు. అవన్నీ వదిలిపెట్టి అడ్డగోలు రాతలు రాసిన రామోజీ... మర్నాడు మరీ చెలరేగిపోయారు. జగన్మోహన్ రెడ్డి పైసా పెట్టకుండా భారతి సిమెంట్స్‌లో వాటా దక్కించుకున్నారని, ఆయన పెట్టిన రూ.30 కోట్ల ప్రారంభ పెట్టుబడి కూడా నిమ్మగడ్డ ప్రసాద్ ఇచ్చినదేనని రాసి పారేశారు. ‘‘వ్యవహారం బయటపడకుండా ఉండటానికి నిమ్మగడ్డ ప్రసాద్‌కు సాండూర్ పవర్లో షేర్లు కేటాయించారు’’ అని కూడా అదే ‘ఈనాడు’లో రాస్తారు. అంటే! నిమ్మగడ్డ ప్రసాద్‌కు సాండూర్ పవర్లో వాటా విక్రయించి, ఆ వచ్చిన సొమ్మును భారతి సిమెంట్‌లో జగన్ మోహన్‌రెడ్డి ఇన్వెస్ట్ చేశారనే కదా దానర్థం. అలా జరిగితే తప్పేంటి? తన సొంత సంస్థలో వాటా విక్రయించటం తప్పా? అలా విక్రయించగా వచ్చిన సొమ్మును వేరొక సంస్థలో పెట్టుబడి పెట్టడం తప్పా? అయినా ఆయన షేర్లు విక్రయించింది 2008లో అని ‘ఈనాడే’ రాసింది. అప్పటికి జగన్‌పై ఎలాంటి కేసులూ లేవు కూడా. దానర్థం ఈ షేర్ల విక్రయంలో ఎలాంటి దురుద్దేశాలూ లేనట్లేగా? కేసులు నమోదయ్యాక ఏ 2012లోనో, 2013లోనో షేర్లు విక్రయిస్తే తప్పుగానీ... మామూలప్పుడు తన కంపెనీలో షేర్లు విక్రయించుకోవటం తప్పా? అసలు మార్గదర్శిపై నిండా మునిగిపోయినపుడు... మార్గదర్శి కేసుల్లో ఇరుక్కున్నపుడు... ఆ డబ్బులతోనే ఎదిగిన ‘ఈనాడు’లో వాటా అమ్మటం తప్పుకాదా రామోజీ!! మార్గదర్శి డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా మళ్లించుకుని, బండారం బయటపడి అందరికీ తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి డబ్బా కంపెనీల ద్వారా నిధులు పొందటం తప్పు కాదా రామోజీ!! లిస్టెడ్ కంపెనీ అయిన రిలయన్స్... తన పెట్టుబడిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు చెప్పాల్సి ఉన్నా, విచారణకు హైకోర్టు ఆదేశించేదాకా చెప్పకపోవటం తప్పు కాదా రామోజీ! వివిధ వ్యవస్థల్లో తమను కాపాడేవారున్నారని ఎన్ని అక్రమాలు చేసినా చెల్లిపోతుందనుకుంటే... ఏదో ఒక రోజు జనం చీకొట్టక తప్పదు. చరిత్ర చెబుతున్న సత్యమిది. ఆది నుంచీ అదే కుట్ర చట్టప్రకారమైతే అరెస్ట్ చేసిన 90 రోజుల్లో బెయిలివ్వాలి. కానీ జగన్మోహన్రెడ్డి బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్ విచారణకు వచ్చే ప్రతి సారీ... ఏదో ఒక సంచలనం. ఈ కేసుకు సంబంధించి ఏదో కొండను తవ్వేసినట్లుగా సీబీఐ ప్రకటనలు చేయటం, దాన్ని ఎల్లోమీడియా తాటికాయలంత అక్షరాలతో ప్రచురించటం, బాబు- టీడీపీ తమ్ముళ్లు ఢిల్లీకి వెళ్లి నానాయాగీ చేయటం.. ఇవన్నీ కుట్ర ఎంత లోతైనదో చెప్పటం లేదా? అరెస్టయిన వెంటనే దాన్ని సవాలు చేస్తూ సీబీఐ కోర్టులో జగన్ బెయిలు పిటిషన్ వేశారు. దీనిపై 2012 జూన్ 1న కోర్టు తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పునకు కొన్ని గంటల ముందు.. గాలి జనార్థనరెడ్డి బెయిలు కోసం జడ్జిలకు ముడుపులిచ్చిన వ్యవహారాన్ని సీబీఐ బయటపెట్టింది. అక్రమాన్ని బయటపెట్టడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ తనకు నాలుగు రోజుల ముందే అందిన సమాచారాన్ని...బెయిలు ముందు వెల్లడించటమే తీవ్రస్థాయి సందేహాలకు తావిచ్చింది. అంతకుముందే ఆ సమాచారం అందినా దాన్ని ఎందుకు బయటపెట్టలేదన్న ప్రశ్నలకు సీబీఐ నుంచి సమాధానమే లేదు. ఇదంతా జగన్ బెయిలుపై ప్రభావాన్ని చూపించిందని, ఆయనకు బెయిలివ్వాలంటే జడ్జిలు భయపడే స్థాయిలో సీబీఐ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని రాజకీయ నేతల నుంచి విమర్శలెన్నో వచ్చాయి. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్. 2012 జులై 4న తీర్పు రానుండగా.. జులై 3న సీబీఐ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. అపుడెపుడో మార్చి 31న దాఖలు చేసిన తొలి ఛార్జిషీటుకు అనుబంధమంటూ కొన్ని పత్రాలు వేసింది. వాటి లో కొత్త అంశాలేవీ లేకున్నా.. ఏదో ఉందని.. బెయిలిస్తే ప్రమాదమని న్యాయవ్యవస్థకు సంకేతాలివ్వటానికే సీబీఐ ఇలా చేసిందని విమర్శలొచ్చాయి. అనుబంధ ఛార్జిషీట్‌పై ఎల్లో మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలొచ్చాయి కూడా. హైకోర్టు తీర్పుపై జగన్ సుప్రీంను ఆశ్రయించారు. బెయిలుపై ఉత్తర్వులు వెలువడే ముందు... సీబీఐకి రెగ్యులర్‌గా వచ్చే లాయరు మారారని, ఆయన బదులుగా వచ్చిన ప్రభుత్వ న్యాయవాదికసలు మాట్లాడటమే రాదని, చట్టం గురించే తెలియదని చెబుతూ సీబీఐ లీకులిచ్చింది. దాన్ని ఒక వర్గం మీడియా బీభత్సంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌తో జగన్ రాజీకి వచ్చారని, అందుకే ఇలా లాయరును మార్చి ఉండవచ్చని ఆ మీడియా వండి వార్చేసింది. ఇంత ఘోరమా? మళ్లీ పాత లాయరు వచ్చి, వాదనలు పూర్తయి.. సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్‌పై ఉత్తర్వులు రాబోయే తరుణంలో తెలుగుదేశం పార్టీ నేరుగా రంగంలోకి దిగింది. మరికొద్ది గంటల్లో తీర్పు వెలువడనున్నదనగా... నామా నాగ్వేరరావుతో సహా తెలుగుదేశం ఎంపీలు ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిశారు. జగన్ ఆస్తుల్ని స్తంభింపజేయాలంటూ ఒక నోట్‌ను సమర్పించారు. వారు కోరిన కొన్ని గంటల్లో... సాక్షి ఆస్తులు, ఇన్వెస్టర్లయిన హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలకు చెందిన కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఒక నోట్ విడుదల చేసింది. తరువాతి రోజు బెయిలు తిరస్కరణకు గురైంది. అసలు తీర్పునకు కొన్ని గంటల ముందు టీడీపీ ఎంపీలు ఆర్థికమంత్రిని కలవటమేంటి...? వారు కోరినట్లుగా ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని ఈడీ నోట్ ఇవ్వటమేంటి? చూస్తే తెలియటం లేదా? తనను అరెస్టు చేసింది మొదటి ఛార్జిషీటులోనని, అరెస్టుకు ముందే ఆ ఛార్జిషీటు వేశారు కనక... 90 రోజుల్లో దర్యాప్తు ముగించి ఛార్జిషీటు వేయలేదు కనక... బెయిలివ్వాలంటూ సీబీఐ కోర్టులో జగన్ స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ వేశారు. కోర్టు దీన్ని తిరస్కరించడంతో హైకోర్టులో సవాల్ చేశారు జగన్. వాదనలు ముగిసి ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా... వాన్‌పిక్ కేసు నిందితుడైన మంత్రి దర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ను సీబీఐ తెరపైకి తెచ్చింది. షరా మామూలుగా ఎల్లోమీడియా దీన్ని పతాక శీర్షికల్లో అచ్చేసింది. హైకోర్టు తీర్పు కొన్ని గంటల్లో వెలువడనున్న ఈ తరుణంలోనే... ఏడు నెలలుగా జైల్లోనే ఉన్న సీనియర్ అధికారి బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఉన్నట్టుండి అనుమతినిచ్చింది. మరి ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వానికి వాటా లేదని చెప్పగలమా? కాంగ్రెస్-టీడీపీల కనుసన్నల్లోనే ఈ కుట్ర మొత్తం నడుస్తోందని చెప్పటానికి ఇంకా ఆధారాలేమైనా కావాలా? ఇప్పుడూ అదే తీరు? ఇప్పుడూ ఎల్లో కూటమి అదే తీరు కనబరుస్తోంది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, ఆ తరవాత బెయిలు కోసం జగన్ దరఖాస్తు చేసుకోవచ్చని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానిప్రకారం ఆ గడువుకు నాలుగైదు రోజుల తరవాత సీబీఐ అన్ని ఛార్జిషీట్లనూ వేసి... దర్యాప్తు ముగిసిందని కోర్టుకు స్పష్టంగా చెప్పింది. దర్యాప్తు ముగిశాక బెయిలు పిటిషన్ వేస్తే కోర్టు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని గతంలో హైకోర్టు సైతం చెప్పింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై వాదన ప్రతివాదనలు ముగిశాయి. సోమవారం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల వేసిన ఛార్జిషీట్లలో అంశాల్ని నాణేనికి ఒకే వైపున చూపిస్తూ రెండు రోజులుగా ‘ఈనాడు’, దాని తోకపత్రిక శివాలెత్తేస్తున్నాయి. విచారణకు స్వీకరించని ఛార్జిషీటు... కనీసం నిందితుడికి కూడా అందని ఛార్జిషీటు తనకెలా వచ్చిందో గానీ రామోజీరావు రంకెలు మొదలుపెట్టారు. అయితే దర్యాప్తు ముగిసింది కనక బెయిలొచ్చే అవకాశం ఉందని భావించిన చంద్రబాబునాయుడు... దీన్ని అడ్డుకోవటానికి ఏకంగా ఢిల్లీ యాత్రకు దిగారు. రెండు రోజుల కిందట తమ్ముళ్లను పంపించి ఢిల్లీలో కనిపించిన ప్రతి గడపా ఎక్కించిన చంద్రబాబు... నేరుగా రాష్ట్రపతితో సైతం ఈ అంశాన్ని చర్చించడానికి వెళ్లారంటే ఏమనుకోవాలి? అయినా జగన్మోహన్రెడ్డికి బెయిలొస్తుందంటే చంద్రబాబుకు ఎందుకంత ఉలికిపాటు? తన అడ్రస్ గల్లంతయిపోతుందనా? తన పార్టీ తుడిచిపెట్టుకు పోతుందనా? రాజకీయాల్ని జన క్షేత్రంలో తేల్చుకోవాలి తప్ప ఇలా చీకటి ఒప్పందాలకు పాల్పడటం సరైనదేనా? జనాభిమానం ఎవరివైపున ఉంటే వారు ఎన్నికల్లో గెలుస్తారు! అంతేతప్ప తనకు జనాభిమానం లేదు కాబట్టి... ఆ అభిమానం సంపాదించుకున్న నేతను జనంలోకి రానివ్వకుండా చేద్దామని కుట్రలు పన్నితే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేంటి? బాబుపై అంత ప్రేమెందుకు? వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అరెస్టు నుంచి బెయిలు వరకూ అడుగడుగునా కుట్ర బుద్ధి చూపిస్తున్న సీబీఐ... చంద్రబాబుపై మాత్రం ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. ఎమ్మార్ కేసులో అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడటమే కాక... హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 535 ఎకరాలను గోల్ఫ్‌కోర్సు కోసం, శ్రీమంతుల విల్లాల కోసం కారుచౌకగా కట్టబెట్టేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ... ఈ కేసులో కూడా లేని లింకుల్ని వెదుకుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబీకులను, సన్నిహితులను వేధించటానికే ప్రయత్నించింది. అసలు 535 ఎకరాల స్థలాన్ని సింగిల్ టెండరు వేసిన సంస్థకు పోటీ లేకుండా ఎందుకు కట్టబెట్టారో, అలా చేయటం ద్వారా చంద్రబాబు ఏం లబ్ధి పొందారో తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరించింది. ఇంత పెద్ద కేసులో విచారణ జరుపుతూ... సింగిల్ టెండరుపై భూమి కట్టబెట్టేసిన బాబును కనీసం విచారణకు సైతం పిలవలేదు. ఆయన్ను విచారించకుండానే తంతు ముగించేసింది కూడా. మరి దీన్నేమనాలి? చంద్రబాబుకు సీబీఐ ఎందుకు కొమ్ము కాస్తోంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టనని మాట ఇచ్చి... దాన్ని కాపాడుతూ వస్తున్నందుకా? కేంద్రంలో సైతం అంశాల వారీగా తన ఎంపీలను హోల్‌సేల్‌గా, రిటైల్‌గా విక్రయించేస్తున్నందుకా? దర్యాప్తు పూర్తయితే బెయిలు సాక్ష్యాలు సరిపోతాయని భావిస్తే ఛార్జిషీటు దాఖలు చేసే ముందు నిందితుడిని తీసుకెళ్లి నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి. అప్పుడు ఆ తుది నివేదికను విచారణకు స్వీకరిస్తూ... నిందితుడికి బెయిలు మంజూరు చేసే అధికారం ఆ న్యాయమూర్తికి ఉంటుంది. అయితే ఛార్జిషీట్లు వేశాక జగన్ మోహన్‌రెడ్డిని అరెస్టు చేయటాన్ని సీబీఐ ఏ రకంగానూ సమర్థించుకోజాలదు. దర్యాప్తు ఇంకా ముగియలేదు. కీలక దశలో ఉన్నందున ఇప్పుడు జగన్మోహన్రెడ్డికి బెయిలివ్వలేం’’ - జూలై 5, 2012న రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు