బ్లడ్ గేమ్ బై సునీత.. తండ్రి రక్తంతో కూతురు కుటిల రాజకీయం | Sunita And Sharmila Worst Politics With Chandrababu Support | Sakshi

బ్లడ్ గేమ్ బై సునీత.. తండ్రి రక్తంతో కూతురు కుటిల రాజకీయం

Published Sat, Apr 6 2024 7:49 PM | Last Updated on Sat, Apr 6 2024 8:27 PM

Sunita And Sharmila Worst Politics With Chandrababu Support - Sakshi

రక్తం ప్రశ్నిస్తోంది.. అవును రక్తం ప్రశ్నిస్తోంది. రక్త సంబంధం ఉన్న కూతురిని ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆడుతున్న బ్లడ్ గేమ్‌లో నువ్వెందుకు పావులా మారావని ప్రశ్నిస్తోంది. యస్.. వివేకా రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నా రాజకీయ ప్రత్యర్థులతో నువ్వు, నీ భర్త ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నిస్తోంది. నన్ను గొడ్డలితో కసితీరా నరికి నరికి చంపిన దస్తగిరి బయట తిరుగుతుంటే.. నువ్వు బస్సెక్కి షర్మిల వెంట ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది.

నన్ను చంపినోడు బెయిల్‌పై బయట తిరుగుతుంటే.. అతడ్ని జైల్లో పెట్టించకుండా.. జగన్‌కు ఓటేయొద్దు.. అవినాష్‌కు ఓటేయొద్దు అంటూ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నా రక్తపు మరకల తడి ఆరక ముందు అన్నీ నిజాలే చెప్పిన నువ్వు.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. నీ పక్కనే అసలు హంతకులు ఉన్నారని నీ అంతరాత్మకు తెలుసు. వారిని కాపాడుకునేందుకు అవినాష్‌కు ఆ రక్తపు మరకలు పూసే ప్రయత్నం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. ఎందుకమ్మా అన్ని తెలిసి ఈ బ్లడ్ గేమ్ లో నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావ్.. అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. హత్య చేసినోడు ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. హత్య చేయించినోడు ఇంట్లోనే నీ పక్కనే తిరుగుతుంటాడు.

ఎంటమ్మా సునీత ఇది.. పదేళ్లలో ఎప్పుడైనా నాన్నా అని ఆప్యాయంగా పిలిచావా ? ఇప్పుడు నా రక్తాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నావే.. ఇది కరెక్టేనా ? నా రెండో భార్య షమీమ్ ను నువ్వు హింసించినా.. అవమానించినా.. నేను నిన్నేమీ అనలేదే..ఓహో ఆస్తిలో వాటా తగ్గుతుందని నా తర్వాత హోదా, పదవి నీ భర్తకు దక్కవని కోపంతో ఉన్నావా ? అందుకే నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావా ? జగన్ కు ఓటేయొద్దని అంటున్నావా ? అమాయకుడైన అవినాష్ ను బలి పశువుని చేయాలని చూస్తున్నావా ? అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. మర్డర్ చేయడమే కాదు.. దాన్ని ఇంకొకరిపై నెట్టేసే కుట్రపై.. ఇదే రక్తం సాక్షిగా.. అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి.. ప్రధానంగా ఓ పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి..

1. వివేకా రెండో భార్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కాలర్ పట్టుకుని బెదిరించింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు
2. వివేకా రెండో భార్య కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని రక్త చరిత్రకు తెరలేపింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు
3. వివేకాకు చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఆయనకు చెక్ పెట్టింది నువ్వు, నీ భర్త నర్రెడ్డి కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు
4. తండ్రి బతికుండగా పట్టెడన్నం పెట్టని నువ్వు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు
5. వివేకా రాజకీయ శత్రువులైన బీటెక్, ఆదినారాయణ రెడ్డి సహకారంతోనే హత్య జరిగిందని చెప్పింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 
6. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచి పెట్టమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు
7. అవినాష్ పేరు చెప్పకపోతే.. నీ భర్త జైలుకు పోక తప్పదని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు
8. వివేకాను తానే నరికి చంపానని చెప్పినా.. దస్తగిరి బెయిల్‌కు నువ్వు సహకరించింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు
9. వివేకా హంతకులు పక్కనే ఉన్నా.. రక్తపు మరకలు మరొకరికి పూయాలని ప్రయత్నిస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 
10. నీ ఇంట్లో వారిని రక్షించుకునేందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుని రాజకీయం చేస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement