నాలికను ఎటు కావాలంటే అటు వైపు మడత పెట్టడం కూడా ఒక ఆర్టే. అందులో చంద్రబాబు నాయుణ్ని మించిన ఆర్టిస్ట్ ఈ దేశంలోనే మరొకరు ఉండరు. పొద్దున్న తిట్టిపోసిన వ్యక్తినే మధ్యాహ్నం పొగిడేయగలరు. సాయంత్రానికల్లా అదే వ్యక్తిని మళ్లీ తిట్టనూగలరు. అంత ఫ్లెక్సిబుల్ నాలికలు ఉండడం చంద్రబాబు ప్రత్యేకతే అంటారు రాజకీయ పండితులు. అభిప్రాయాలను కూడా అలానే మార్చేస్తారు. తాను చేసిన వ్యాఖ్యకి పూర్తి భిన్నమైన వాదనను ఆయనే వినిపిస్తారు. దానికి ఏదో ఒక సాకు చెబుతారు. నలుగురూ నవ్విపోతారేమో అన్న సిగ్గుకూడా లేకుండా ఎంచక్కా నిర్లజ్జగా చంద్రబాబు నడుచుకుపోతారని ఆయనంటే గిట్టని వాళ్లు అంటూ ఉంటారు.
2019 ఎన్నికలకు ఇంచుమించు ఏడాది ముందు ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని తిట్ల దండకం అందుకున్నారు. మోదీ దుర్మార్గ విధానాల వల్లనే దేశం నాశనమైందన్నారు. అందుకే దేశాన్ని కాపాడుకోడానికి తాను కాంగ్రెస్‌తో జట్టు కట్టి విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు దేశంలోనే సీనియర్ నాయకుడైన తాను ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు
ఈ క్రమంలో చంద్రబాబు దిక్కుమాలిన సిగ్గుమాలిన రాజకీయానికి తెరతీశారు. ఏ కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి టీడీపీ పుట్టిందో అదే టీడీపీని తీసుకెళ్లి కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టేశారు. రాహుల్ గాంధీకి ఓ బొకే ఇచ్చి వెచ్చగా ఉంటుందని ఓ శాలువా కప్పి ఫోటోకోసం ఓ నవ్వు నవ్వి అదే చాణక్యం అన్నట్లు తన పత్రికల్లో రాయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏంటి? కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఏంటి? ఏమన్నా సిగ్గుందా లేదా అని టీడీపీ సీనియర్లు కుతకుత లాడిపోయినా.. చంద్రబాబు పట్టించుకోలేదు. కాంగ్రెస్‌తో జట్టు కట్టడంపై విమర్శలు వెల్లువెత్తడంతో తన అవకాశవాద దిగజారుడు రాజకీయానికి ఓ ముద్దు పేరు పెట్టారు చంద్రబాబు. డెమొక్రటిక్ కంపల్షన్ తోనే కాంగ్రెస్‌తో కలిశామన్నారు.
చక్రాలు తిప్పడం తనకు అచ్చొచ్చిన ఆర్ట్ అని తన మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని పొంగిపోయారు. ఆ సమయంలోనే కర్ణాటక ఎన్నికలు జరిగితే.. తానే అక్కడ బీజేపీని ఓడించానని భవిష్యత్తులో కూడా ఓడిస్తానని బీరాలు పలికారు నారా గిరీశం. 2019లో దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి బీజేపీ వ్యతిరేక కూటమిని గెలిపించుకుంటామన్నారు. నరేంద్ర మోదీని ఓడించి ఇంటికి పంపేస్తామన్నారు.
2018లో చంద్రబాబు ఎన్డీయే నుండి బయటకు వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వంపైనా మోదీపైనా విరుచుకుపడుతూ వచ్చారు. అంత వరకు ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన చంద్రబాబు హోదా కోసం ధర్మపోరాట దీక్ష అంటూ కొత్త డ్రామాకి తెరతీశారు. తాను ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడిన వారిని జైలుకు పంపించారు చంద్రబాబు.నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్న చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యాక అమరావతి రాజధానికి నరేంద్ర మోదీ కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని అది అక్కడ కేబుల్‌కి కూడా సరిపోదని అన్నారు.
నరేంద్ర మోదీ కన్నా చాలా ముందుగానే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. రాజకీయాల్లో దేశంలోనే తాను సీనియర్‌ని అని చెప్పుకున్నారు. తనకంటే సీనియర్లు అయిన మల్లికార్జున ఖర్గే, కరుణానిధి వంటి వారు కూడా ఉన్నారని మర్చిపోయారు చంద్రబాబు.
ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు చంద్రబాబు. హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువ లాభమని విచిత్ర వాదన చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చెప్పి కేంద్ర మంత్రులకు సన్మానం కూడా చేశారు. అదేదో ఘనత సాధించినట్లు వారిని కీర్తించారు. ఎన్డీయే నుండి బయటకు రాగానే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తోన్న హోదా ఉద్యమానికి జంకి తాను కూడా హోదా గురించి మాట్లాడ్డం మొదలు పెట్టారు. ఆక్రమంలోనే మోదీని విమర్శించారు.
-సీఎన్‌ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్ట్
ఇదీ చదవండి: రఘురామా.. ప్లీజ్ గెటవుట్!
Comments
Please login to add a commentAdd a comment