శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని అడిగే హక్కు కేసీఆర్కు ఎక్కడిదని ఆంద్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు ఇష్టం లేకపోతే ముందు ఆయన కొడుక్కి ఆ పేరు తొలగించాలని కేసీఆర్కు సూచించారు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో మర్చిపోయావా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ తెలంగాణ వ్యక్తా.. తెలుగువాడా, ఆయన పేరు తొలగించాలని ఎందుకు అడగరని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా ఎన్టీఆర్ను అభిమానిస్తారని, రాజకీయ దురుద్దేశంతో అలాంటి వ్యక్తి పేరు తొలగించాలనడం సమంజసం కాదని అచ్చెన్నాయుడు చెప్పారు.