వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసనసభాప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. 'టీడీపీ మంత్రి అదేపనిగా రెచ్చగొట్టడానికి సభా సమయం వృధా చేయటానికి తన నోట్లో నుంచి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సైకో పార్టీ అంటారు. ఇటువంటి రౌడీ చేష్టలను ప్రజలు సహించరు అని అంటే...అదేదో మేమే తప్పు చేస్తున్నట్లు మళ్లీ వ్యాఖ్యలు చేయటం సరికాదు.