![minister anil kumar yadav comments on acham naidu - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/1/anil_0.jpg.webp?itok=VRiVBQKQ)
సాక్షి, నెల్లూరు: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీనే అడ్డదారులు తొక్కుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, స్వయానా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లే అరాచకాలు చేస్తూ నిందలు తమపై వేయడం సిగ్గుచేటన్నారు. (చదవండి: ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సర్కారు ‘నో’)
మూన్నాళ్లు వుండే ఓ వ్యక్తి అండ చూసుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారని.. పల్లెలు ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదని మంత్రి అనిల్ ఆరోపించారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా.. పంచాయితీ ఎన్నికల్లో 90 శాతం పైగా గెలుపు వైస్సార్సీపీదేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.(చదవండి: కాపీల రాయుడు.. చంద్రబాబునాయుడు)
Comments
Please login to add a commentAdd a comment