ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్ | ys jagan mohan reddy condemns acham naidu comments on ap assembly | Sakshi
Sakshi News home page

ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్

Published Thu, Sep 3 2015 11:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్ - Sakshi

ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసనసభాప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. 'టీడీపీ మంత్రి అదేపనిగా రెచ్చగొట్టడానికి సభా సమయం వృధా చేయటానికి తన నోట్లో నుంచి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సైకో పార్టీ అంటారు. ఇటువంటి రౌడీ చేష్టలను ప్రజలు సహించరు అని అంటే...అదేదో మేమే తప్పు చేస్తున్నట్లు మళ్లీ వ్యాఖ్యలు చేయటం సరికాదు.

 ఇదే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కళ్లు చేసుకుని, ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగానే... వేలు చూపిస్తూ రౌడీ మాదిరిగా బెదిరించినా కూడా అది కూడా మాదే తప్పు అన్నట్లు చెప్పటం దురదృష్టకరమన్నారు'.  కాగా అంతకు ముందు అచ్చెన్నాయుడు...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా వైఎస్ జగన్ కౌంటర్పై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఖండించారు.  మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...  అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement