
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్ర వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి, టీడీపి నేత కింజరాపు అచ్చె న్నాయుడు గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అచ్చెన్నాయుడికి స్వల్ప గాయాలయ్యాయి. అమరావతి నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా నక్కపల్లి జంక్షన్ వద్ద రాత్రి 10.15 గంటల సమయంలో అడ్డుగా వచ్చిన మోటారు సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవర్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అచ్చెన్నాయుడిని పోలీసులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయన శ్రీకాకుళం బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment