సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్మిక సంఘాల నేతలు ఆయనకు ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఐకాస సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సంస్థ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్మికులు సహకరించాలని కోరారు. గతంలో కార్మికులు అడిగినంత ఫిట్‌మెంట్ ఇచ్చామని చెప్పారు. ఆర్టీసీ ఇంకా నష్టాల్లోనే ఉందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment