JAC activists
-
టీడీపీ కార్యకర్తలు, జేఏసీ నేతలపై ఎస్సై సునీత ఫిర్యాదు!
సాక్షి, విశాఖపట్నం: విధి నిర్వహణలో తనని అడ్డుకున్నారంటూ టీడీపీ కార్యకర్తలపై, జేఏసీ నేతలపై ఎస్సై సునీత ఫిర్యాదు చేయడంతో పలువురిపై 46, 47, 48 సెక్షన్ల కింద ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో శనివారం కేసులు నమోదయ్యాయి. ఇందులో టీడీపీకి చెందిన 20 మంది కార్యకర్తలు, 32 మంది జేఏసీ నేతలు ఉన్నారు. కాగా పెట్రల్‌తో పొలీసుల వాహానం ఎక్కిన ఉత్తరాంధ్ర జేఏసీ అధ్యక్షుడు జేటి రామరావు, మాల మహానాడు ఉపాధ్యక్షురాలు ఎన్ కృపాజ్యోతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘ఇన్నేళ్లు అద్దె రాజధానిలో ప్రజలు గడిపారు’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజా సంఘాల జేఏసీగా స్వాగతిస్తున్నామని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వెనకబాటును గుర్తించి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి మహా నగరాన్ని వదిలి వచ్చినా ఢిల్లీ పెద్దలు ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఒక్క ప్యాకేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కనీసం వెనుకబాటు అధ్యయనానికి ఒక్క కమిటీ, కమీషన్ గానీ వేయలేదని పేర్కొన్నారు. మద్రాస్, కర్నూలు, అమరావతిలో అద్దె రాజధానిలో ఉత్తరాంధ్ర ప్రజలు గడిపారని, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించడంతో సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి రైతులకు తాము వ్యతిరేకం కాదని జేటీ రామారావు స్పష్టం చేశారు. రాష్ట్ర నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించి ఏపీకి ప్రాజెక్టులు,వెనుకబడి ప్రాంతాలు ప్యాకేజీలు ఇచ్చి ఏపీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించాలని శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీకి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. కమీటీ సిఫార్సులపై చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టకపోగా సిఫార్సులు చట్టబుట్టలో వేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే వంశధారా, పోలవరం ప్రాజెక్టుల సమస్యలు తొలిగిపోతాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, 70 సంవత్సరాల తరువాత ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. 1956 విశాఖకు ఆంధ్రాయూనివర్సిటీ,1971లో స్టీల్ ప్లాంట్,2020 లో సీఎం జగన్ పుణ్యమా అని ఎగ్జిగుటివ్ రాజధాని వస్తుందన్నారు. అధికార వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు మారినా.. ఉత్తరాంధ్ర తలరాత మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం న్యాయం. హై కోర్టు బెంచ్‌లతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు కల్పింది జవహర్ లాల్ నెహ్రు, ముంచింది ఇందిరాగాంధీ, రాచి రంపాన పెట్టింది సోనియా గాంధీ, నటిస్తున్నది నరేంద్రమోదీ. ఇంత బాధలో సైతం నేను ఉన్నానని ముందడుగు వేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి. జీయన్ రావ్, బోస్టన్ కమీటీలు అద్భుతమైన గ్రౌండ్ రియాలిటీ తో రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చుని తయారు చేసినవి కావు ఆ నివేదికలు. వైఎస్ జగన్‌కు ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలే జీవోలుగా చట్టాలవుతున్నాయి. చంద్రబాబు వినతి పత్రాలు ఏనాడు అయినా తీసుకున్నాడా.. ఆయన పాలనలో అరెస్టులు, బైండోవర్లే సరిపోయాయి. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్న వారికి సమస్యలు తెలుస్తాయి. చంద్రబాబు అమరావతి అంటూ అక్కడి రైతులను మభ్యపెట్టారు. వంశధార ప్రాజెక్టు, భూమాలు కోల్పోయిన, స్టీల్ ప్లాంట్ కు భూముల ఇచ్చిన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఇప్పటికే 3 తరాలు నష్టపోయాయి. వాటి గురించి చర్చించరు. ఎందుకు...? పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఉత్తరాంద్ర అభివృద్ధి అడ్డం పడవద్దని కోరుతున్నాము. అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది. రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యే లు అక్కడికి వస్తారు’’ అని జేఏసీ నేత జేటీ రామారావు స్పష్టం చేశారు. -
ఫిబ్రవరి 6నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె !
-
ఫిబ్రవరి 6నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె !
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్మిక సంఘాల నేతలు ఆయనకు ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఐకాస సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సంస్థ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్మికులు సహకరించాలని కోరారు. గతంలో కార్మికులు అడిగినంత ఫిట్మెంట్ ఇచ్చామని చెప్పారు. ఆర్టీసీ ఇంకా నష్టాల్లోనే ఉందని ఆయన తెలిపారు. -
హామీలు నెరవేర్చకుండా సభలూ.. సంబరాలా?
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రగతి నివేదన సభపై ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం ఉస్మానియా వర్సిటీలో విలేకరులతో విద్యార్థి జేఏసీ చైర్మన్ దయాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సగం కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తారని కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే ఐదేళ్లు పూర్తికాక ముందే ఎన్నికలకు వెళ్దా మనుకోవడం దారుణమన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు. కార్యక్రమం లో వామపక్ష, దళిత, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఉపన్యాసాలే తప్ప మీరు చేసిందేమిటి?
⇒ కోదండరామ్‌కు టీజేఏసీ అసంతృప్త నేతల బహిరంగ లేఖ ⇒ వివిధ జిల్లాలకు చెందిన 22 మంది సమావేశం ⇒ ఉద్యమకారులకు న్యాయం చేయడం లేదని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం లోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఉపన్యా సాలు ఇవ్వడంతప్ప టీజేఏసీ చైర్మన్ కోదండరాం చేసిందేమీ లేదని జేఏసీ అసం తృప్తి నేతలు ఆరోపించారు. జేఏసీ కో–చైర్మన్ నల్లపు ప్రహ్లాద్ అధ్యక్షతన కన్వీనర్ పిట్టల రవీందర్, కో–కన్వీనర్ తన్వీర్ సుల్తానా సహా వివిధ జిల్లాలకు చెందిన 22 మంది జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని అశోకా హోటల్లో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం సమావేశం వివరాలను, కోదండరామ్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. నల్లపు ప్రహ్లాద్, పిట్టల రవీందర్, తన్వీర్ సుల్తానా రాసిన లేఖను సమావేశం ఏకగ్రీ వంగా సమర్థించినట్టుగా వెల్లడించారు. నియామాలకు విరుద్ధం.. జేఏసీ రూపొందించుకున్న నిబంధనలకు విరుద్ధంగా కోదండరాం వ్యవహరిస్తున్నారని నేతలు తమ లేఖలో ఆరోపించారు. టీ జేఏసీ రాజకీయపార్టీలతో కలసి పనిచేయ దని, రాజకీయ పార్టీగా మారదని ప్రకటి స్తూనే.. రాజకీయ పార్టీలతో, రాజకీయ నాయకులతో కోదండరాం అంటకాగుతున్నా రని విమర్శించారు. తెలంగాణ సామాజిక సమన్యాయ సాధనలో ఒక ప్రత్యేక కార్యా చరణను ఎందుకు రూపొందించుకోలేదని... ఇంతవరకూ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు. జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయ డానికి కనీస అవకాశాల్లేవని.. కోదండరాం అనుసరిస్తున్న స్వీయ అస్తిత్వ ధోరణితో ఇది స్పష్టమవుతోందన్నారు. ఉద్యమకారులు ఇంకా నష్టపోతున్నారు... ఉద్యమకారులు ఇంకా అనేక విధాలుగా నష్టపోతున్నారని, అణచివేత అనుభవిస్తున్నారని.. దీనికి కోదండరాం వైఖరే కారణమని నేతలు విమర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత కోదండరాంపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు నిర్వహించిన పాత్ర గొప్పదని, కానీ వారికి సంబంధించిన ఏ అం శాన్నీ జేఏసీ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. జేఏసీలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయా లకు సమాధానం రాకపోవడంతో ఇలాంటి కీలకాంశాలపై అంతర్గత చర్చకు అవకాశం లేదని స్పష్టమైందని, అందుకే బహిరంగలేఖ రాస్తున్నామని నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు సి.రాంచందర్, చొప్పరి శంకర్ ముదిరాజ్, ఆదిలాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ దుర్గం రాజేశ్, ఎం.మధుసూదన్‌బాబు (గద్వాల జిల్లా కో–కన్వీనర్), తొగరి బాబూరావు (భూపాలపల్లి జిల్లా కన్వీనర్), నాగుర్ల సంజీవరావు (మేడ్చల్ జిల్లా కన్వీనర్), ఆకుల మహేందర్(పెద్దపల్లి), వెంకట మల్లయ్య (జేఏసీ కరీంనగర్ జిల్లా చైర్మన్), శ్రీనివాస్ (రంగారెడ్డి మాజీ చైర్మన్), సదానందం(రంగారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్), ముకుంద నాగేశ్వర్ (పరిగి), పూల్‌సింగ్ (మంథని), రవీందర్ (హైదరాబాద్, పాతబస్తీ), సుభద్ర (సిరిసిల్ల జిల్లా జేఏసీ కోకన్వీనర్), తుమ్మల సుమిత్ర, పుష్పలత, వరలక్ష్మి, లలిత (కరీంనగర్ జిల్లా మహిళా జేఏసీ) తదితరులు పాల్గొన్నారు. కోదండరాం వైఖరితో అన్యాయం తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణ సందర్భంలోనూ కోదండరాం చేసిందేమీ లేదని నేతలు తమ లేఖలో ఆరోపించారు. ఉద్యమ, పౌర సంఘాలు ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల కు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోవడంతప్ప ఆయన పాత్రేమీ లేదన్నారు. ఉద్యమ సమయంలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కుల, మహిళా, యువజన సంఘాలు, జేఏసీ కార్యకర్తలు, నేతలు నిర్వహించిన పాత్రను కోదండరాం ఏనాడూ ప్రస్తావించలేదన్నారు. ఉద్యమంలో అనేకమంది నేతలు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయారని.. వారికి న్యాయం చేయడానికి కోదండరాం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. -
ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు
హిందూపురం అర్బన్ : ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల చెవ్వుల్లో పూలు పెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయని విద్యార్థి యువ జేఏసీ గౌరవధ్యక్షుడు ఇందాద్, అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద చెవుల్లో పూలు పెట్టుకుని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంతో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదాపై ఏమాత్రం స్పందించకుండా నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో జెఏసీ నాయకులు జమీల్, బాబావలి, కదీరిష్, నాగభూషణ్, రవి, అభిషేక్, లోకేష్, సంపత్ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆశలపై నీళ్లు చల్లారు హిందూపురం టౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్లు చల్లాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధు మండిపడ్డారు. శనివారం రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో బైఠాయించి రాస్తారోకో చేశారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో ఆందోళనకారులను అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపత్‌కుమార్, ఆసీఫ్, సునీల్, బెన్నీ, సీపీఐ నాయకులు కృష్ణ, మధు, నౌషాద్, రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.