
సాక్షి, విశాఖపట్నం: విధి నిర్వహణలో తనని అడ్డుకున్నారంటూ టీడీపీ కార్యకర్తలపై, జేఏసీ నేతలపై ఎస్సై సునీత ఫిర్యాదు చేయడంతో పలువురిపై 46, 47, 48 సెక్షన్‌ల కింద ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో శనివారం కేసులు నమోదయ్యాయి. ఇందులో టీడీపీకి చెందిన 20 మంది కార్యకర్తలు, 32 మంది జేఏసీ నేతలు ఉన్నారు. కాగా పెట్రల్‌తో పొలీసుల వాహానం ఎక్కిన ఉత్తరాంధ్ర జేఏసీ అధ్యక్షుడు జేటి రామరావు, మాల మహానాడు ఉపాధ్యక్షురాలు ఎన్ కృపాజ్యోతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.