
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ లీడర్ నారా లోకేష్ బాబు విశాఖలో హల్‌చల్ చేశారు. పోలీసులతో దుసురుగా ప్రవర్తించారు. ఏం తమాషాగా ఉందా.. మీ అందరి సంగతి తేలుస్తానంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు. ఆవేశంతో ఊగిపోతూ.. హంగామా క్రియేట్ చేశారు.
వివరాల ప్రకారం.. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు కుమారుడు పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి లోకేష్ హాజరయ్యారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు.. లోకేష్‌తో మాట్లాడారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదంటూ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో, ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన లోకేష్.. విచక్షణ మరిచిపోయి పోలీసులపైనే తన రుబాబు చూపించారు.
ఆగ్రహానికి లోనైన లోకేష్.. బహిరంగంగానే నేను మాజీ మంత్రిని, ఎమ్మెల్సీని.. నన్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులపైకి చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఏం తమాషాగా ఉందా.. మీ అందరి సంగతీ తేలుస్తానంటూ పోలీసులనే బెదిరించే ప్రయత్నం చేశారు. పోలీసులు సంయమనం పాటిస్తున్నప్పటీకీ వారితో దురుసుగా ప్రవర్తించారు.
ఇది కూడా చదవండి: పలాసలో ఉద్రిక్తత.. మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment