హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రగతి నివేదన సభపై ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం ఉస్మానియా వర్సిటీలో విలేకరులతో విద్యార్థి జేఏసీ చైర్మన్ దయాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సగం కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు తదితర హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తారని కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే ఐదేళ్లు పూర్తికాక ముందే ఎన్నికలకు వెళ్దా మనుకోవడం దారుణమన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు. కార్యక్రమం లో వామపక్ష, దళిత, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Published Sun, Sep 2 2018 1:47 AM | Last Updated on Sun, Sep 2 2018 1:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment