![Red Bus People Choice Award To APSRTC - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/6/Red-Bus-People-Choice-Award.jpg.webp?itok=tvYoS40B)
అవార్డు స్వీకరిస్తున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ‘ప్రవాస్ ఎక్సలెన్స్’ వేడుకల్లో భాగంగా ఏపీఎస్ ఆర్టీసీకి ‘రెడ్ బస్ పీపుల్స్ చాయిస్’ అవార్డు దక్కింది.
చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్!
శుక్రవారం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అవార్డును అందుకున్నారు. సురక్షితమైన, స్మార్ట్, స్థిరమైన ప్యాసింజర్ మొబిలిటీ అనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి దేశవ్యాప్తంగా 4వేల మంది పబ్లిక్, ప్రైవేటు రవాణా వాహనాల ఆపరేటర్లు, వ్యాపారులు, సందర్శకులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment