
వచ్చే నెలలో ఏపీకి అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.
రాజమహేంద్రవరం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. మార్చి 6న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నబీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్ర సహాయంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, పార్టీ బలోపేతం చేసేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.