
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం కాంగ్రెస్‌తో చేతులు కలిపి తెలుగు వారి ఆత్మ గౌర వాన్ని తాకట్టు పెట్టిందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారమిక్కడ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ నుంచి బయటికొచ్చామని చెబుతున్న సీఎం చంద్రబాబు..కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించారని, ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు కలపడంతో ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఖర్చు చేసిన నిధులపై కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.