దుబ్బాక: భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం సిద్దిపేటలోని వీఏఆర్ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె వంశీకృష్ణ గౌడ్ తెలిపారు. ఆదివారం దుబ్బాక విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే జిల్లా కార్యవర్గ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జిల్లా కమిటీ, కోర్ కమిటీ, నియోజక వర్గ బాధ్యులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఆయన కోరారు.