vamsikrishna
-
కాంగ్రెస్‌లోకి వివేక్... బీజేపీకి గుడ్ బై
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి బరు వైన హృదయంతో రాజీనామా చేస్తున్నట్టు, పార్టీలో ఉన్నప్పుడు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. బుధవారం నోవాటెల్ హోటల్లో వివేక్, ఆయన కుమారుడు వంశీకృష్ణకు కండువా కప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఉదయం తన కుటుంబసభ్యులతో హోటల్‌కు చేరుకున్న వివేక్.. రాహుల్‌గాం«దీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆహ్వానించడంతో అందుకు అంగీకారం తెలిపినట్లు వివేక్ చెప్పారు. కాగా పలు దఫాలుగా వివేక్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. సీఎల్పినేత భట్టి విక్రమార్క చర్చలు జరిపిన దరిమిలా ఈ కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. వివేక్‌కు, ఆయన కుమారుడు వంశీకృష్టకు కాంగ్రెస్ పార్టీ ఒక అసెంబ్లీ టికెట్, ఒక లోక్‌సభ సీటు కేటాయించను న్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి వివేక్ నిలబడే అవకాశముందని, పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని ఆయన కుమారుడికి కేటాయించే విషయంపై అంగీకారం కుదిరిందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కేసీఆర్ కుటుంబపాలన అంతం చేయాలనే లక్ష్యంతోనే చేరా: వివేక్ వెంకటస్వామి తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన, బీఆర్ఎస్ రాక్షస పాలన అంతం చేయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వివేక్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను తప్పక గద్దె దించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ సాధనలో అప్పటి ఎంపీల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.ఎన్నికల్లో పోటీ, టికెట్ కేటాయింపు వంటివి అంత ముఖ్యమైనవి కాదన్నారు. తన రాజకీయ భవిష్యత్, చేపట్టే కార్యాచరణను కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయిస్తుందని వివేక్ చెప్పారు. వివేక్ చేరిక బలాన్నిస్తుంది: రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే ప్రజల ఆకాంక్షకు వివేక్ చేరిక బలాన్నిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన ఎంపీల బృందం తిరిగి కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమన్నారు. తెలంగాణలో అధికారమార్పిడి జరగబోతోందని చెప్పారు. శంషాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని వివేక్ విశ్వసిస్తున్నారని తెలిపారు. ‘గాంధీ కుటుంబంతో వివేక్ కు ఎంతో అనుబంధం ఉంది. వివేక్ తో రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడి కాంగ్రెస్ లో చేరాలని కోరారు. వివేక్ తిరిగి కాంగ్రెస్ లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లే. ఆయన్ను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. వారి చేరిక కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చింది’అని వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ కు వంశీకృష్ణ అవయవాలు
హైదరాబాద్ : విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన వంశీకృష్ణ కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో జీవన్‌దాన్ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆంధ్రా ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించారు. వంశీకృష్ణ గుండెను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి.. లివర్‌ను యశోద ఆసుపత్రికి తరలించారు. అవయవాల తరలింపు సందర్భంగా విజయవాడ నగరంలో పోలీసులు గ్రీన్ ఛానల్ చేపట్టి... బెంజి సర్కిల్ నుంచి గన్నవరం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అవయవాలను హైదరాబాద్‌కు తరలించారు. వంశీకృష్ణ.. మూత్రపిండాలు, కళ్లు విజయవాడలోని వివిధ ఆస్పత్రుల్లో బాధితులకు వినియోగించనున్నారు. -
నేడు బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశం
దుబ్బాక: భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం సిద్దిపేటలోని వీఏఆర్ గార్డెన్లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె వంశీకృష్ణ గౌడ్ తెలిపారు. ఆదివారం దుబ్బాక విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే జిల్లా కార్యవర్గ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జిల్లా కమిటీ, కోర్ కమిటీ, నియోజక వర్గ బాధ్యులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఆయన కోరారు. -
పోలీసుల గుటికి మరో ప్రేమజంట
-
కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : కోర్టు వాయిదాకు హజరయ్యేందుకు వచ్చిన ఒక వ్యక్తి అదే కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం నగరంలోని ఎర్రమంజిల్ కోర్టు ఆవరణలో చోటు చేసుకుంది. వివరాలు..ఒక కేసు విషయంలో పశ్చిమగోదావరికి చెందిన వంశీకృష్ణ(35) కోర్టులో హాజరయ్యాడు. కాగా, తన వాదనను కోర్టులో న్యాయవాదికి వినిపించాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో అతను కోర్టు పరిసరాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు నిందితుడిని వెంటనే స్థానికంగా ఉన్న యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. (ఎర్రమంజిల్) -
ఓటు అడిగే హక్కు ఎమ్మెల్యేలకు లేదు
పెదవాల్తేరు, కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు, తూర్పు నియోజక వర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. జీవీఎంసీ 17వ వార్డు పెద జాలరిపేటలో శనివారం ఆయన స్థానిక నాయకుడు కందుకూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దోమల నివారణకు మెషీన్లు పంపిణీ చేశారు. అనంతరం 200 మందికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ జాలరిపేటలో సమస్యలు తిష్ట వేశాయన్నారు. అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో గెలిచి ప్రజా సమస్యలను విస్మరించిన ఎమ్మెల్యేను ఇంట్లో కూర్చోపెట్టాలని అన్నారు. పెదజాలరిపేటలో పట్టాలు లేక మత్స్యకారులు ఇళ్లు కూడా నిర్మిం చుకోలేక పోతున్నారన్నారు. వీరి సమస్యలు పరిష్కరించడంలో ఇక్కడి ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే జాలరిపేటలో అందరికీ పట్టాలు ఇప్పించి పక్కా ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, తాగునీరు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్డులో దోమలు నివారణకు మెషీన్లు పంపిణీ చేశామని, వార్డు సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కండిపిల్లి అప్పారావు, మత్స్యకార నాయకులు తెడ్డు పరసన్న, తెడ్డు గుర్నాథం, కారీ శ్రీలక్ష్మీ, దాసరాజు, చిల్లా రామారావు, రాము, రమణారెడ్డి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.