కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man suicide in erramanjil court | Sakshi
Sakshi News home page

కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Tue, Apr 7 2015 4:48 PM | Last Updated on Thu, Jul 11 2019 7:42 PM

కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - Sakshi

కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : కోర్టు వాయిదాకు హజరయ్యేందుకు వచ్చిన ఒక వ్యక్తి అదే కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం నగరంలోని ఎర్రమంజిల్ కోర్టు ఆవరణలో చోటు చేసుకుంది. వివరాలు..ఒక కేసు విషయంలో పశ్చిమగోదావరికి చెందిన వంశీకృష్ణ(35) కోర్టులో హాజరయ్యాడు. కాగా, తన వాదనను కోర్టులో న్యాయవాదికి వినిపించాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో అతను కోర్టు పరిసరాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు నిందితుడిని వెంటనే స్థానికంగా ఉన్న యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
(ఎర్రమంజిల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement