నాడు వాజ్‌పేయ్.. నేడు మోడీ | Vajpayee And Modi Did Same On Pakistan | Sakshi
Sakshi News home page

నాడు వాజ్‌పేయ్.. నేడు మోడీ

Published Mon, Mar 4 2019 1:37 PM | Last Updated on Mon, Mar 4 2019 2:22 PM

Vajpayee Modi Did Same - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న సనత్‌కుమార్‌

రామగిరి: నరేంద్రమోదీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని, నాడు వాజ్‌పేయ్, నేడు మోడీ పాకిస్తాన్‌ కుట్రలను తిప్పికొట్టి భారత్‌ సత్తాను ప్రపంచ దేశాలకు చూపించారని  బీజేపీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి రేండ్ల సనత్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని కల్వచర్లలోని పార్టీ  కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, పైస్థాయి నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దాడి చేసి 42మంది జవానులు హతమార్చడంతో ప్రతీకారంగా సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి 300 మందికిపైగా తీవ్రవాదులను మట్టుబెట్టడంలో భారత్‌ విజయం సాధించడం, అభినందన్‌ విడుదలలో మోడీ కీలక భూమి పోషించారని వివరించారు. రానున్న పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో తర్డ్‌ ఫ్రంట్, పోర్ట్‌ ప్రంట్‌ అంటూ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఆరోపించారు.

బీజేపీలో పూర్తి స్థాయిలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, రానున్న కొద్ది రోజుల్లోనే నియోజకవర్గానికి సంబధించిన అన్ని కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు  ఆయన వివరించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని,  పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన వివరించారు. ముందుగా ఆయన ఇంటిపైన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్‌ విస్తారక్‌ మహేష్, జిల్లా కార్యదర్శి మహావాది రామన్న, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల శశి, నియోజకవర్గ కో కన్వీనర్‌ తూండ్ల క్రాంతి కుమార్, రామగిరి ఇన్‌చార్జి బత్తిని నర్సయ్య, మహదేవ్‌పూర్, కాటారం మండలాల అధ్యక్షులు ఆకుల శ్రీదర్, భాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మారెపల్లి శ్రీనివాస్, నాయకులు బండి రంజిత్‌ కుమార్, మల్లారపు అరుణ్‌కుమార్, జంగెపల్లి అజయ్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement