
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ యూత్ వింగ్ నాయకుడు ప్రవీణ్ కమ్మార్ దారుణ హత్యకు గురయ్యాడు. ధార్వాడ్ జిల్లా కొట్టూరు గ్రామ పంచాయితీలో మంగళవారం రాత్రి ఓ ఆలయం వద్ద ఊరేగింపు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో ఆపేందుకు ప్రయత్నించిన ప్రవీణ్‌ను ప్రత్యర్థి వర్గం కత్తితో పొడిచింది. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ప్రవీణ్ వర్గంతో గొడవపడిన వర్గం తాగినమత్తులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
కాగా.. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేసజ్వీ సూర్య ఆరోపించారు. ప్రత్యర్థి వర్గం కుట్రపన్నే ఈ దారుణ హత్యకు ఒడిగట్టారని మండిపడ్డారు. పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఊరేగింపు సమయంలో జరిగిన గొడవే హత్యకు దారీతీసిందని చెప్పారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: బార్బడోస్‌లో గుండెపోటుతో ఖమ్మం విద్యార్థి మృతి.. శోకసంద్రంలో ఎస్సై కుటుంబం
Comments
Please login to add a commentAdd a comment