dharwad
-
బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని ఎంపీ ఫైర్..
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ యూత్ వింగ్ నాయకుడు ప్రవీణ్ కమ్మార్ దారుణ హత్యకు గురయ్యాడు. ధార్వాడ్ జిల్లా కొట్టూరు గ్రామ పంచాయితీలో మంగళవారం రాత్రి ఓ ఆలయం వద్ద ఊరేగింపు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో ఆపేందుకు ప్రయత్నించిన ప్రవీణ్‌ను ప్రత్యర్థి వర్గం కత్తితో పొడిచింది. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రవీణ్ వర్గంతో గొడవపడిన వర్గం తాగినమత్తులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కాగా.. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేసజ్వీ సూర్య ఆరోపించారు. ప్రత్యర్థి వర్గం కుట్రపన్నే ఈ దారుణ హత్యకు ఒడిగట్టారని మండిపడ్డారు. పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఊరేగింపు సమయంలో జరిగిన గొడవే హత్యకు దారీతీసిందని చెప్పారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: బార్బడోస్‌లో గుండెపోటుతో ఖమ్మం విద్యార్థి మృతి.. శోకసంద్రంలో ఎస్సై కుటుంబం -
ప్రాణం మీదకు తెచ్చిన సరదా..సెల్ఫీ కోసం రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి..
బెంగళూరు: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల కిరణ్ రాజ్‌పుర్ నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. ఇతరుల కంటే భిన్నంగా సెల్ఫీ దిగాలనే ఉత్సుకతతో నీర్సాగర్ రిజర్వాయర్ వద్ద ఎత్తైన అంచుకు వెళ్లాడు. ఆనందంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో పొరపాటున కాలుజారి పడిపోయాడు. అనంతరం వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువకుడి కోసం అతని స్నేహితులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అతని కోసం గాలింపు చేపట్టిన సహాయక బృందాలు భారీ వర్షం, వరదల కారణంగా ఆపరేషన్ నిలిపివేశాయి. ధార్వాడ్ బెగూర్‌కు చెందిన ఈ యువకుడు చాలా ఎత్తైన ప్రాంతం నుంచి పడిపోయాడని పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో గజ ఈతగాల్లు కూడా అక్కడి నుంచి దూకే సాహయం చేయరని తెలిపారు. యువకుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కష్టమే అన్నారు. రిజర్వాయర్ దిగువన ఉండే గ్రామస్థులకు సమాచారం అందించామని, ఏమైనా ఆచూకీ లభిస్తే తెలుస్తుందని చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్తుంటే అడ్డుకుని వెనక్కి పంపించామని వివరించారు. వానలు పడినప్పుడు నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు చాలా మంది వెళ్తుంటారు. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని అక్కడున్న సిబ్బంది, పోలీసులు సందర్శకులను హెచ్చరిస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫోటోలు దిగేందుకు రిజర్వాయర్ అంచు వరకు వెళ్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు. డ్యాంలో నీటి స్థాయి తగ్గేవరకు సందర్శకులు రాకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్ -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిశ్చితార్థ వేడుకకు వెళ్లి వస్తుండగా..
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ధార్వాడ్ జిల్లాలోని నిగడి ప్రాంతంలో బెంకన్‌కట్టికి వెళ్తుండగా శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు.. అనన్య (14), హరీష్ (13), శిల్పా (34), నీలవ్వ (60), మదుశ్రీ (20), మహేశ్వర్ (11), శంబులింగయ్య (35)గా గుర్తించారు. మృతులంతా ధార్వాడ తాలూకా బెనకట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మే 20న రాత్రి మన్సూర్ గ్రామంలో జరిగిన నిశ్చితార్థవేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: జైలులో కాంగ్రెస్ నేత సిద్ధూ.. ఆయన షెడ్యూల్, వసతులు ఇవే.. -
డబుల్ డోస్ వ్యాక్సిన్.. అయినా 66 మందికి సోకిన కరోనా!
బెంగళూరు: కరోనా ముప్పు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లో దాదాపు 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. టీకాలు వేయించుకున్నప్పటికీ వీరికి కోవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవల ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. దీని తర్వాత 300 మంది మొదటి సంవత్సరం విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాలలోని రెండు హాస్టళ్లను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. ప్రస్తుతం ఫిజికల్ క్లాసులు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్నప్పటికీ విద్యార్థులు కరోనా బారిన పడ్డారని, వారికి హాస్టల్లోనే చికిత్స చేయిస్తామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ తెలిపారు. ‘ముందు జాగ్రత్తగా విద్యార్థులను క్వారంటైన్ చేసి, రెండు హాస్టళ్లను మూసివేశాము. విద్యార్థులకు వైద్యం, ఆహారం అందిస్తాం. హాస్టళ్ల నుంచి వారిని ఎవరూ బయటకు రానివ్వరు. పరీక్షల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను కూడా ఇదే ప్రాంగణంలో ఉంచుతాం. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంద’ని నితీష్ పాటిల్ చెప్పారు. (చదవండి: సీఎం ఆఫీసులో కరోనా కలకలం) ఫ్రెషర్స్ పార్టీ కారణంగా విద్యార్థులకు వ్యాధి సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ‘విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాం. వీరిని కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థులందరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నార’ని నితీష్ పాటిల్ వెల్లడించారు. కాగా, వ్యాధి సోకిన కొంతమంది విద్యార్థులకు దగ్గు, జ్వరం ఉండగా మరికొందరికి ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవన్నారు. (చదవండి: డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు, నగలు.. అవాక్కయిన ఏసీబీ అధికారులు) -
కరోనా: మిఠాయి రాజాకు ఎదురుదెబ్బ
రాయచూరు : చిక్కని పాలు, చక్కెర, యాలకుల పొడి వీటికి తోడు ఎంతో నైపుణ్యం రంగరించి చేసే ధార్వాడ పేడా పేరు వింటే నోరూరని వారు ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆ తీయని రుచి స్వర్గాన్ని తలపిస్తుందంటారు పేడా ప్రియులు. కరోనా వైరస్ వల్ల అలాంటి పేడకు వ్యాపారాలు తగ్గాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రా, తమిళనాడు ప్రజలు మక్కువ చూపుతారు. కరోనా వైరస్ భీతితో, రెండున్నర నెలల లాక్డౌన్ వల్ల ఈ మిఠాయి రాజాకు దెబ్బ తగిలింది. స్వీట్‌షాపులు మూతపడడం, కార్మికులు ఇళ్లకు వెళ్లిపోవడం తదితర కారణాలతో క్వింటాళ్ల కొద్దీ పేడా అమ్మకాలు నిలిచిపోయి లక్షల రూపాయల నష్టం సంభవించినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.(వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు) పేడా వెనుక పెద్ద కథ ఉత్తర కర్ణాటక భాగంలోని హుబ్లీ, ధార్వాడకు ప్రత్యేక కథ వుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవధ్ బీహరీ 1933లో ధార్వాడలో పేడా దుకాణాలను ప్రారంభించారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి నిత్యం పెద్దమొత్తంలో తయారు చేసేలా 1955లో పేడా ఫ్వాక్టరీని స్థాపించాడు. దాని బాధ్యతలను మోసుకున్న గణేష్మిశ్రా దీనిని హుబ్లీకి విస్తరింప చేశారు. మిశ్రా కుటుంబం మూడోతరం కుటుంబ సభ్యుల 87 ఏళ్ల క్రితం పారంభించిన పేడాను సంజయ్ మిశ్రా బిగ్ మిశ్రా పేడాగా పేరుమార్చారు. ప్రస్తుతం ఉత్తర కర్ణాటకతో పాటు అనేకచోట్ల పేడా దుకాణాలు వెలిశాయి. కానీ ధార్వాడలో తయారయ్యే పేడాకు ఏదీ సాటిరాదంటారు. ధార్వాడ తాలుకా క్యారకొప్పలో రూ.20 కోట్లతో పేడా ఉత్పాదన చేసే పరిశ్రమను నెలకొల్పారు. పరిశ్రమలో 450 మందికి పైబడి కార్మికులు పనిచేస్తుండగా ప్రతి రోజు 2000 కేజీల పేడా మిఠాయిని ఉత్పత్తి చేసి మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంభవించడంతో ఇప్పుడు వెయ్యికేజీలకు ఉత్పత్తి పడిపోయిందని తెలిపారు. కొనుగోళ్లు తగ్గినట్లు చెప్పారు. నాలుగు నెలల్లో తమకు ఒక్కరికే రూ.2 కోట్ల మేర నష్టం సంభవించిందని మరో ప్రముఖ వ్యాపారి సంజయ్ మిశ్రా తెలిపారు. అందరిపైనా ఎఫెక్టు మరోవైపు హుబ్లీ–ధార్వాడల్లో స్థానిక వ్యాపారులు సొంతంగా చేసి, లేదా హోల్‌సేల్‌గా కొని అమ్ముతూ ఉండేవారు. రెండున్నర నెలల పాటు షాప్‌లు మూతపడడం, ఇప్పుడిప్పుడే తెరిచినా కరోనా ప్రభావం వల్ల వ్యాపారాలు తగ్గినట్లు చెప్పారు. దీనివల్ల పాల రైతులు, పేడా తయారీ కార్మికులకు ఆదాయం పడిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వాపోయారు. మళ్లీ పుంజుకోవడానికి కొంతకాలం పడుతుందని అన్నారు. -
కూతురు కోసం 36 గంటల పోరాటం
బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి ఇటీవల కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ఈ ఘటనలో తన కుమార్తెను కాపాడుకునేందుకు 36 గంటల పాటు ఓ తల్లి చేసిన పోరాటం వెలుగులోకి వచ్చింది. విస్టేజ్ మార్కెటింగ్ సంస్థ ఈ భవంతిలో ఆఫీస్ ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో ప్రేమా ఉనకల్(36) మార్కెటింగ్ ప్రతినిధిగా చేస్తోంది. స్కూల్‌కు వేసవి సెలవు కావడంతో ప్రేమాతోపాటు ఆమె కూతురు దివ్య(8) సైతం ఆఫీస్‌కు వచ్చింది. మంగళవారం సాయంత్రం భవంతి కుప్పకూలిపోవడంతో తల్లీకుమార్తెలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత మేలుకున్న ప్రియ, కుమార్తె కోసం వెతుకులాట ప్రారంభించింది. అక్కడే శిథిలాల కింద చిక్కుకున్న దివ్య చేతులు కనిపించాయి. ఆ చీకటిలోనే 45 నిమిషాల పాటు కష్టపడి దివ్యను బయటకు తీసుకొచ్చింది. అంతలోనే అప్పటివరకూ కదలకుండా ఉన్న మరో పిల్లర్ చిన్నారి దివ్యపై పడిపోయింది. దీంతో బాలిక బాధతో విలవిల్లాడింది. ఈ పిల్లర్ కింద చిక్కుకున్న దివ్యను కాపాడేందుకు ప్రియ మరో 24 గంటల పాటు ప్రయత్నించింది. చిన్నారి స్పృహ కోల్పోకుండా ఉండేందుకు తాను అంతసేపు మెలకువగానే ఉంది. 20న దివ్య ఏడుపు ఆపేసింది. అదేరోజు ఉదయం అధికారులు యంత్రాల ద్వారా శిథిలాల తొలగింపు ప్రారంభించారు. ఆ శబ్దం విన్న ప్రియ ‘మేమిక్కడ చిక్కుకున్నాం’ అని గట్టిగా అరిచింది. దీంతో అధికారులు ప్రియను రక్షించి ఆసుపత్రికి తరలించారు. దివ్యను శిథిలాల కిందనుంచి బయటకు తీసినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయింది. ఈ విషయాన్ని ప్రియ కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదు. ఈ విషయమై ప్రియ పిన్ని మాట్లాడుతూ..‘ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రాగానే తనను కాకుండా కుమార్తెను రక్షించాలని ప్రియ కోరింది. కానీ ఆమెను తొలుత వెలికితీసిన అధికారులు ఆసుపత్రికి తరలించారు. దివ్య అప్పటికే చనిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రియ చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మెలకువలోకి వచ్చిన ప్రతీసారి కుమార్తె దివ్య గురించి ప్రియ అడుగుతోంది. ఏడుస్తూ అంతలోనే స్పృహ కోల్పోతోంది. కానీ దివ్య ఇక లేదన్న విషయాన్ని మేం చెప్పలేకపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
తోక లేని రామ సైనికుడితో తలనొప్పి
నిన్నటి దాకా నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే తన లక్ష్యం అని ప్రకటించిన శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఇప్పుడు మోడీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే తన ధ్యేయం అంటున్నాడు. 'రా రమ్మని' తలుపులు తీసి, ఆ వెంటనే 'పో పొమ్మని' తలుపులు మూసిన బిజెపికి గుణపాఠం చెబుతానంటున్నాడు ఈ రామ సైనికుడు. ఇప్పుడు ముతాలిక్ ధార్వాడ్, బెంగుళూరు సౌత్ నుంచి లోకసభకు పోటీ చేయబోతున్నారు. ధార్వాడ్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషీ, బెంగుళూరు సౌత్ లో అనంత కుమార్ లు బిజెపి అభ్యర్థులు. వారిద్దరి వల్లే తనకు పార్టీలో చోటు దక్కలేదని, అందుకే వారిద్దరినీ ఓడిస్తానని ముతాలిక్ చెబుతున్నారు. బెంగుళూరులో పెద్దగా పట్టులేకపోయినా, ముతాలిక్ ధార్వాడ్ లో బిజెపిని డామేజీ చేసే అవకాశాలున్నాయి. ధార్వాడ్ లో అతివాద హిందూ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అవి ముతాలిక్ ఖాతాలోకి వెళ్తే బిజెపి ఓడిపోయే ప్రమాదం ఉంది. 'ఎరక్కపోయి కెలుక్కున్నాము బాబోయ్ ఈ తోకలేని రామసైనికుడిని' అని బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు.