Karnataka Road Accident Today: 3 Children Among 7 Killed In Road Incident Near Dharwad - Sakshi
Sakshi News home page

Karnataka Road Accident Today: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిశ్చితార్థ వేడుకకు వెళ్లి వస్తుండగా..

Published Sat, May 21 2022 10:59 AM | Last Updated on Sat, May 21 2022 1:11 PM

Karnataka:3 children Among 7 Killed In Road Accident Near Dharwad - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ధార్వాడ్‌ జిల్లాలోని నిగడి ప్రాంతంలో బెంకన్‌కట్టికి వెళ్తుండగా శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు.. అనన్య (14), హరీష్ (13), శిల్పా (34), నీలవ్వ (60), మదుశ్రీ (20), మహేశ్వర్‌ (11), శంబులింగయ్య (35)గా గుర్తించారు. మృతులంతా ధార్వాడ తాలూకా బెనకట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మే 20న రాత్రి మన్సూర్‌ గ్రామంలో జరిగిన నిశ్చితార్థవేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  
చదవండి: జైలులో కాంగ్రెస్‌ నేత సిద్ధూ.. ఆయన షెడ్యూల్‌, వసతులు ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement