సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ లలో సీఐడీ విస్తృత సోదాలునిర్వహిస్తోంది. 7 జిల్లాల్లో మార్గదర్శి బ్రాంచిలలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, ఏలూరు, అనంతపురం మార్గదర్శి బ్రాంచ్‌లలో సోదాలు జరుగుతున్నాయి.
మార్గదర్శి చిట్ ఫండ్ లిమిటెడ్ అక్రమాలు, నిధుల దారి మళ్లింపుపై సీఐడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 గా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఏ2గా ఎండీ శైలజ కిరణ్ ఉన్నారు.
మార్గదర్శి అక్రమాలపై ఇప్పటికే రామోజీరావు, శైలజ కిరణ్‌లన సీఐడీ విచారించింది. ఈ విచారణలో వెలుగుచూసిన అక్రమాల ఆధారంగా సీఐడీ మరోమారు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. గతంలోను తనిఖీలునిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.
కాగా.. డిపాజిటర్లకు చేసిన చెల్లింపుల్లో ఏమైనా రహస్యం దాగుందా అని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించించిన విషయం తెలిసిందే. అలాంటిదేమీ లేని పక్షంలో ఆయా వివరాలు పూర్తిగా కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.
చదవండి: డిపాజిట్లలో రహస్యం ఉందా? మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి, రామోజీరావుకి సుప్రీంకోర్టు ప్రశ్న
Comments
Please login to add a commentAdd a comment