ప్రతీకాత్మక చిత్రం
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఏపీ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..మంత్రి గంటా విడుదల చేసిన శ్వేత ప్రతం అంతా తప్పుల తడక అని విమర్శించారు. అది శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం అని దుయ్యబట్టారు. అందులో ఉన్నదంతా బూతేనని మండిపడ్డారు. పెట్రోలియం విశ్వవిద్యాలం కోసం సబ్బవరం భూవివాదాన్ని పరిష్కరించలేని చేతగాని మంత్రి గంటా శ్రీనివాసరావని ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాసంస్థలపై మాట్లాడే హక్కు గంటాకు లేదన్నారు. ఐఐఎంకు సంబంధించి ప్రారంభోత్సవంలో హడావుడిగా బోర్డు తగిలించి ప్రభుత్వానికి చూపించేశారని విమర్శించారు.
అక్కడ కరెంటు, వాటర్ ఇవ్వకుండా నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు నెలల్లో 33 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు..అందులో 70 శాతం గంటా వియ్యంకుడు పి. నారాయణకు చెందిన నారాయణ కాలేజీల్లోనే జరిగాయని..దీనికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. కేంద్ర విద్యాసంస్థలపై విడుదల చేసిన శ్వేతపత్రం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment