హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టిడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరోవైపు కరీంనగర్‌లోనూ అసెంబ్లీ ముట్టిడికి వెళ్తున్న పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.