హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత | abvp, bjym trying to stop kiss of love at hyderabad central university | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత

Published Sun, Nov 2 2014 6:19 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించ తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కేరళకు చెందిన విద్యార్థులు క్యాంపస్ లోని క్యాంటీన్ వద్ద గుమిగూడారు. 'నైతిక పోలీసింగ్'కు నిరసనగా 'కిస్ ఆఫ్ లవ్'  కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమయాత్తమయ్యారు. మిగతా రాష్ట్రాల విద్యార్థుల కూడా వీరికి మద్దతు పలికారు.

ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని జరగనీయబోయమని వర్సిటీ గేటు వెలుపల బైఠాయించారు. 'కిస్ ఆఫ్ లవ్' వ్యతిరేకులు, మద్దతుదారుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. 'కిస్ ఆఫ్ లవ్'  ఎటువంటి అసభ్యత లేదని మద్దతుదారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement