అర్హులందరికీ గ్యాస్‌ కనెక్షన్లు అందిస్తాం | Gas Connections Will Be Provided To All Qualified Persons | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ గ్యాస్‌ కనెక్షన్లు అందిస్తాం

Published Mon, Jul 9 2018 11:08 AM | Last Updated on Mon, Jul 9 2018 11:08 AM

Gas Connections Will Be Provided To All Qualified Persons - Sakshi

కామేపల్లిలో గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేస్తున్న దృశ్యం 

కామేపల్లి : అర్హులైన లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించే ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్‌ పొయ్యిలు అందిస్తామని, నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని చేస్తుందని బీజేపీ అనుబంధ సంఘం బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రేష్మా రాథోడ్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్‌ అన్నారు.

ఆదివారం మండల కేంద్రమైన కామేపల్లిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద మంజూరైన గ్యాస్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెల్లరేషన్‌ కలిగి గ్యాస్‌ కనెక్షన్‌ లేని లబ్ధిదారులందరికీ  కేంద్రప్రభుత్వం ఉచితంగా గ్యాస్‌ అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని, కేంద్ర ఇచ్చే నిధులతో సోకులుపడుతుందన్నారు.

ప్రజా సమస్యలను విస్మరించదని, మాటలతో ప్రభుత్వాన్ని కేసీఆర్‌ నడిపిస్తున్నారని, కేసీఆర్‌ మాటల గారడీకి వచ్చే ఎన్నికల్లో తాళం పడకతప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు భూక్యా శ్రీనివాస్‌ నాయక్, బీజీపీ మండల అధ్యక్షుడు పోలూరి రాంచంద్రయ్య, నాయకులు హతిరాం నాయక్, జె.నర్సింగ్, భద్రయ్య, కె.వీరయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement