Reshma Rathod
-
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సినీనటి రేష్మా రాథోడ్
ములుగు రూరల్ : బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని, ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి, సినీ నటి రేష్మారాథోడ్ అన్నారు. ములుగు మండలం దేవగిరిపట్నం సేవాఘడ్‌తండా(చర్లతండా)లో గురువారం తీజ్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బంజారాలు ఐకమత్యంగా ఉండాలని కోరారు. అనంతరం మహిళలతో కలిసి ఆడి పాడారు. తర్వాత శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్, మేరాయాడి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి భూక్య రాజునాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ బలరాం, రవిరెడ్డి, భిక్షపతి, దశరథం, హరినాయక్, ఆలయ పూజారి కిషన్‌మహరాజ్ పాల్గొన్నారు. -
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సినీనటి రేష్మా రాథోడ్
జూలూరుపాడు : మండలంలోని కొమ్ముగూడెంలో గిరిజన యువతులు, మహిళలు, ప్రజలు తీజ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆదివారం జరుపుకున్నారు. తీజ్ వేడుకలను 9 రోజులుపాటు జరిగిన ఉత్సవాలు ఆదివారం ఆఖరి రోజు కావడంతో గిరిజన యువతులు, మహిళలు, పిల్లలు గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతర ం సింగభూపాలెం చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ పండగ సందర్భంగా 9 రోజులపాటు మహిళలు, యువతులు ఉపవాస దీక్షలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచెపై వెదురు బుట్టల్లో మట్టి, ఎరువు, గోధుములు, వేరుశనగ గింజలను వేసి నీళ్లు పోసి ప్రతి రోజు పెళ్లికాని యువతులు పూజలు నిర్వహించారు. తొమ్మిదో రోజు ఆదివారం మొలకలు వచ్చిన వెదురు బుట్టలతోపాటు ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన శివపార్వతుల ప్రతిమలను మోస్తూ యువతులు గ్రామంలో మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. యువకులు బాణా సంచా కాల్చడంతోపాటు, నృత్యాల చేస్తూ సందడి చేశారు. తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సినీనటి రేష్మా రాథోడ్ కొమ్ముగూడెం గ్రామంలో జరిగిన ఈ తీజ్ ఉత్సవాల్లో సినీనటి రేష్మా రాథోడ్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ ఆఫ్ ముంబాయి ఎల్. జీవన్‌లాల్ (ఐఆర్ఎస్)లు పాల్గొన్నారు. గిరిజన లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన తీజ్ ఉత్సవాలకు రేష్మా రాథోడ్, జీవన్లాల్లు రావడంతో వారికి లంబాడీ గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనస్వాగతం పలికారు. సినీనటి రేష్మా రాథోడ్‌తో కరచాలం చేసేందుకు, సెల్ఫీ ఫొటోలు దిగేందుకు మహిళలు, యువతీ, యువకులు, పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా జీవన్‌లాల్ తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాయక్, గిరిజన నాయకులు భూక్యా దేవిలాల్ నాయక్, భూక్యా బాలు నాయక్, శ్రీను చౌహాన్, బాలాజీ చౌహాన్, సురేష్, హాతిరామ్ పవార్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తాం
కామేపల్లి : అర్హులైన లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించే ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ పొయ్యిలు అందిస్తామని, నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని చేస్తుందని బీజేపీ అనుబంధ సంఘం బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రేష్మా రాథోడ్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కామేపల్లిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద మంజూరైన గ్యాస్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెల్లరేషన్ కలిగి గ్యాస్ కనెక్షన్ లేని లబ్ధిదారులందరికీ కేంద్రప్రభుత్వం ఉచితంగా గ్యాస్ అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని, కేంద్ర ఇచ్చే నిధులతో సోకులుపడుతుందన్నారు. ప్రజా సమస్యలను విస్మరించదని, మాటలతో ప్రభుత్వాన్ని కేసీఆర్ నడిపిస్తున్నారని, కేసీఆర్ మాటల గారడీకి వచ్చే ఎన్నికల్లో తాళం పడకతప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు భూక్యా శ్రీనివాస్ నాయక్, బీజీపీ మండల అధ్యక్షుడు పోలూరి రాంచంద్రయ్య, నాయకులు హతిరాం నాయక్, జె.నర్సింగ్, భద్రయ్య, కె.వీరయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘గురి’ అదిరింది
షూటింగ్లో రష్మీ... ఆర్చరీలో బైరాగిలకు స్వర్ణాలు తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో తెలుగు తేజాల గురి అదిరింది. షూటింగ్లో తెలంగాణ అమ్మాయి రష్మీ రాథోడ్... ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్ యువతార జెమ్మిలి బైరాగి నాయుడు పసిడి పతకాలను సాధించారు. శనివారం జరిగిన మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్లో రష్మీ రాథోడ్ 63 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆరుగురు పాల్గొన్న ఫైనల్స్‌లో సానియా షేక్ (చత్తీస్‌గఢ్) 62 పాయింట్లతో రజతం సాధించగా... మహేశ్వరి చౌహాన్ (రాజస్థాన్-59 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల ఆర్చరీలో ఇండియన్ రౌండ్ వ్యక్తిగత విభాగంలో బైరాగి నాయుడు విజేతగా నిలిచాడు. ఫైనల్లో బైరాగి నాయుడు 6-2 పాయింట్ల తేడాతో బీరేంద్రనాథ్ సింగ్ (మణిపూర్)ను ఓడించాడు. విష్ణుకు కాంస్యం: పురుషుల టెన్నిస్ వ్యక్తిగత విభాగంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో విష్ణు తమిళనాడు ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు. మరోవైపు పురుషుల, మహిళల డబుల్స్ విభాగాల్లో తెలంగాణకు రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల డబుల్స్‌లో విష్ణువర్ధన్-సాకేత్ మైనేని ద్వయం; మహిళల డబుల్స్‌లో సౌజన్య భవిశెట్టి-నిధి చిలుముల జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మరోవైపు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పతకాల పట్టికలో 67 పతకాలతో (42 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో 12 పతకాలు (4 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్యాలు); తెలంగాణ ఖాతాలో 11 పతకాలు (3 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలు) ఉన్నాయి.