
తీజ్ బుట్టలతో రేష్మారాథోడ్
ములుగు రూరల్ : బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని, ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి, సినీ నటి రేష్మారాథోడ్ అన్నారు. ములుగు మండలం దేవగిరిపట్నం సేవాఘడ్‌తండా(చర్లతండా)లో గురువారం తీజ్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బంజారాలు ఐకమత్యంగా ఉండాలని కోరారు.
అనంతరం మహిళలతో కలిసి ఆడి పాడారు. తర్వాత శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్, మేరాయాడి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి భూక్య రాజునాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ బలరాం, రవిరెడ్డి, భిక్షపతి, దశరథం, హరినాయక్, ఆలయ పూజారి కిషన్‌మహరాజ్ పాల్గొన్నారు.