కొమ్ముగూడెంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సినీనటి రేష్మా రాథోడ్
జూలూరుపాడు : మండలంలోని కొమ్ముగూడెంలో గిరిజన యువతులు, మహిళలు, ప్రజలు తీజ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆదివారం జరుపుకున్నారు. తీజ్ వేడుకలను 9 రోజులుపాటు జరిగిన ఉత్సవాలు ఆదివారం ఆఖరి రోజు కావడంతో గిరిజన యువతులు, మహిళలు, పిల్లలు గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతర ం సింగభూపాలెం చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ పండగ సందర్భంగా 9 రోజులపాటు మహిళలు, యువతులు ఉపవాస దీక్షలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచెపై వెదురు బుట్టల్లో మట్టి, ఎరువు, గోధుములు, వేరుశనగ గింజలను వేసి నీళ్లు పోసి ప్రతి రోజు పెళ్లికాని యువతులు పూజలు నిర్వహించారు.
తొమ్మిదో రోజు ఆదివారం మొలకలు వచ్చిన వెదురు బుట్టలతోపాటు ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన శివపార్వతుల ప్రతిమలను మోస్తూ యువతులు గ్రామంలో మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. యువకులు బాణా సంచా కాల్చడంతోపాటు, నృత్యాల చేస్తూ సందడి చేశారు.
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న సినీనటి రేష్మా రాథోడ్
కొమ్ముగూడెం గ్రామంలో జరిగిన ఈ తీజ్ ఉత్సవాల్లో సినీనటి రేష్మా రాథోడ్, ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషన్ ఆఫ్ ముంబాయి ఎల్. జీవన్‌లాల్ (ఐఆర్‌ఎస్)లు పాల్గొన్నారు. గిరిజన లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన తీజ్ ఉత్సవాలకు రేష్మా రాథోడ్, జీవన్‌లాల్‌లు రావడంతో వారికి లంబాడీ గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనస్వాగతం పలికారు.
సినీనటి రేష్మా రాథోడ్‌తో కరచాలం చేసేందుకు, సెల్ఫీ ఫొటోలు దిగేందుకు మహిళలు, యువతీ, యువకులు, పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా జీవన్‌లాల్ తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాయక్, గిరిజన నాయకులు భూక్యా దేవిలాల్ నాయక్, భూక్యా బాలు నాయక్, శ్రీను చౌహాన్, బాలాజీ చౌహాన్, సురేష్, హాతిరామ్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment