తిరుపతి: ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రదీప్ రాచకొండ విశ్వనాథ్, హేమంత్, దామోదర్ అనే వ్యక్తులు శ్రీనగర్ కాలనీలో తాము క్రైం పోలీసులమని బెదిరించి ఓ వ్యభిచార కేంద్రంపై దాడి చేశారు. అనంతరం అక్కడ ఇద్దరు యువతులపై లైంగికదాడి చేశారు. దీంతో అలిపిరికి చెందిన పోలీసులు వీరినలుగురితోపాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.