కొచ్చి:'నైతిక పోలీసింగ్’కు నిరసనగా పిలుపునిచ్చిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించి తీరుతామని నిర్వాహకులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వనప్పటికీ ప్రజల్లో నైతిక పోలీసింగ్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు దీన్ని జరుపుతామని ‘ఫ్రీ థింకర్స్’ అనే ఫేస్‌బుక్ స్నేహితుల బృందం తెలిపింది. సుమారు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించడం తెలిసిందే.
మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
'కిస్ ఆఫ్ లవ్'పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు!
Published Sat, Nov 1 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement
Advertisement