kiss festival
-
‘కిస్ ఫెస్టివల్ మా ఆచారం’
రాంచీ: ముద్దు ద్వారా ప్రేమను వ్యక్తపరచడం తమ ఆచారమని జార్ఖండ్‌లోని గిరిజనులు అంటున్నారు. ప్రతి ఏడాది చివరి మాసం (డిసెంబర్)లో గ్రామస్తులందరూ తమ సహచరులతో కలిసి కిస్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. పాకూర్ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్తులు ఎంతో కాలంగా ఈవింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం)కు చెందిన స్థానిక ఎమ్మెల్యే సీయో మారండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ముద్దు ద్వారా ప్రేమను వ్యక్తం పరచడం గిరిజనుల ఆచారమని ఆయన అంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం కిస్ ఫెస్టివల్ నిర్వహణకు అధికార బీజేపీ అనుమతులను నిరాకరించింది. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం భారతీయ గిరిజన సంస్కృతికి కాదని, అది సమాజానికి చెడు సందేశాన్ని ఇస్తోందని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ ఏడాది కిస్ ఫెస్టివల్ నిర్వహించేది లేదని స్థానిక జిల్లా ఎస్డీఓ జితేంద్ర కుమార్ అదేశాలు జారీచేశారు. గత ఏడాది 18 జంటలు పబ్లిక్‌గా ముద్దుపోటీలో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కిస్ ఫెస్టివల్‌పై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ముద్దుల పోటీలు గిరిజనుల ఆచారంలో భాగమని, వారు స్వచ్ఛంగా ప్రేమను వ్యక్త పరుచుకోవడం కోసమే ఈ పోటీలో పాల్గొంటారని అన్నారు. -
వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
-
వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
రాంచీ : పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవటం అనేది భారతీయ సంస్కృతిలో భాగం కాదనేది కొందరి అభిప్రాయం. అయితే ఆధునికత పేరిట ఈ మధ్య యువత పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ, జార్ఖండ్‌లో ఈ మధ్య ఓ గ్రామంలో నిర్వహించిన ముద్దుల పోటీలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్ జిల్లా డుమారియా గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంత ఎమెల్యే సిమన్ మరాండి(జేఎంఎం) నేతృత్వంలోనే ఈ పోటీలు జరుగుతుండటం విశేషం. పెళ్లయిన గిరిజన దంపతులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎవరు ఎంత ఎక్కువ సేపు ముద్దు పెట్టుకుంటే.. వారి మధ్య అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. చివరకు మిగిలిన జంటకు బహుమతులను అందిస్తారు. ‘‘ఆదివాసీయులు అమాయకులు.. పైగా నిరక్షరాస్యులు. అందుకే వారి కుటుంబాలలో బంధాలు అంత బలంగా ఉండవు. భార్యభర్తల మధ్య ప్రేమను పెంచేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నా. ఆధునికత నేర్పించి వారిని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తా’’ అని సిమన్ చెబుతున్నారు. కాగా, ఇలా బహిరంగ ముద్దులు సభ్యత కాదని ఆరోపిస్తూ మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాయి. ఇక డుమారియాలో ఈ మేళాను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. గత 37 ఏళ్లుగా సిమన్ కుటుంబ సభ్యులే ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. విలు విద్య, గిరిజన నృత్యాలు, పరుగు పందాలు తదితర పోటీలు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాదే ప్రయోగాత్మకంగా ముద్దుల పోటీని ఆయన ప్రవేశపెట్టారు. శుక్ర, శని వారాల్లో ఈ పోటీలు నిర్వహించగా.. 18 మంది దంపతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. -
'కిస్ ఆఫ్ లవ్'పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు!
కొచ్చి:'నైతిక పోలీసింగ్’కు నిరసనగా పిలుపునిచ్చిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించి తీరుతామని నిర్వాహకులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వనప్పటికీ ప్రజల్లో నైతిక పోలీసింగ్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు దీన్ని జరుపుతామని ‘ఫ్రీ థింకర్స్’ అనే ఫేస్బుక్ స్నేహితుల బృందం తెలిపింది. సుమారు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించడం తెలిసిందే. మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆ ముద్దుల వ్యవహారంలో మేం వేలు పెట్టం!
మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఎర్నాకులం ప్రభుత్వ న్యాయకళాశాల, శ్రీ సత్యసాయి అనాథల ట్రస్టులకు చెందిన ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎం షఫీక్‌లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఐపీసీలోని నిబంధనలను ఈ కార్యక్రమం ఉల్లంఘిస్తోందని, ఇది భారతీయ సంస్కృతికి కూడా విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యతను నిరోధించాల్సిందిగా ఎర్నాకులం జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్లను ఆదేశించాలని కోరారు. నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అణగదొక్కడానికి వీల్లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల ఓ ఫేస్బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు. అయితే నిరసనకారులు మాత్రం శాంతిభద్రతల సమస్యను సృష్టించకూడదని ఆయన అన్నారు. గతవారం కోజికోడ్‌లోని ఓ హోటల్లో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కొంతమంది భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అక్కడ విధ్వంసం సృష్టించారు. దీనికి నిరసనగానే నవంబర్ రెండో తేదీ ఆదివారం నాడు కౌగిలింతలు, ముద్దులతో బహిరంగ నిరసన నిర్వహించాలని వివిధ పక్షాలు నిర్ణయించాయి.