moral policing
-
కాలేజీల్లో మోరల్ పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో మోరల్ పోలీసింగ్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అన్ని ఇంటరీ్మడియెట్, డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరిస్తే.. దుష్ఫలితాలను నివారించుకోవచ్చన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులను వలంటరీ పోలీసింగ్‌కు కోసం వినియోగించుకోవాలని సూచించారు.శనివారం జేఎన్టీయూలో వలంటరీ పోలీసింగ్ వ్యవస్థపై నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమాజంలో పెడధోరణులు పెరగడానికి సాంకేతికత ఓ కారణమన్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా పెడితే.. చాలావరకు సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్నారుల మానసిక దృఢత్వానికి తోడ్పతాయని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలకు కారణమని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మత్తు పదార్థాలతో జరిగే నష్టాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్యాంశంగా బోధించడంతోపాటు నైతిక పోలీసింగ్‌ను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. బడులు, కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్స్ అవసరం ఎంతో ఉందని తెలిపారు. వారితో పోలీసులకు సమాచారం చేరవేసే వ్యవస్థను తయారు చేసుకుంటే.. తెలంగాణను డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా మార్చవచ్చని చెప్పారు. డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందంటూ ‘మీ అన్నగా పిలుపునిస్తున్నా... డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి’అని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని, అందుకోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యతని, ప్రజా సమస్యలపై ఫోకస్‌గా పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. సమస్యలకు భయపడి పారిపోకుండా, పోరాడాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీకైనా, బిల్ గేట్స్కైనా, రేవంత్ రెడ్డికైనా ఉండేది రోజుకు 24 గంటలేనని, రోజుకు 16 గంటలు మీరు ఎంత ఫోకస్‌గా పనిచేస్తే అంత బాగా మీ లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
మోరల్ పోలీసింగ్ వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: పోలీసు అధికారులు మోరల్ పోలీసింగ్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితుల నుంచి వస్తు తదితర రూపేణా ప్రతిఫలాలు ఆశించడం, డిమాండ్ చేయడం తగదంటూ హితవు పలికింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జె.కె.మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. సంతోష్ కుమార్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగిస్తూ క్షమశిక్షణ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. సంతోష్ 2001 అక్టోబర్ 26న అర్ధరాత్రి వడోదరలో నైట్ డ్యూటీ సందర్భంగా నిశ్చితార్థమైన ఓ జంట రోడ్డుపై వెళ్తుండగా ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలొచ్చాయి. తనకు కాబోయే భార్యతో కాసేపు గడుపుతానంటూ వెకిలిగా ప్రవర్తించాడని బాధితుడు మర్నాడు ఫిర్యాదు చేశాడు. అది నిజమని విచారణలో తేలడంతో అతన్ని డిస్మిస్ చేశారు. అతడు హైకోర్టులో సవాలు చేయగా, విధుల్లోకి తీసుకోవడంతో పాటు డిస్మిస్ కాలానికి 50 శాతం వేతనమివ్వాలని 2014లో కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘దోషి తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. ఇంతా చేస్తే అతను లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు. వాళ్లయినా సరే, ఇలా మోరల్ పోలీసింగ్‌కు దిగకూడదు. భౌతిక తదితర ప్రతిఫలాలు డిమాండ్ చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. -
Iran: యువతి ప్రాణం తీసిన హిజాబ్ రూల్.. ఆందోళన
కఠిన మత చట్టాలకు పేరుగాంచిన ఇరాన్ గడ్డపై మరో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యే ఉరి శిక్ష పడ్డ ఓ మహిళకు.. ఆమె కూతురితోనే కుర్చీ తన్నించి తల్లికి ఉరి వేసింది అక్కడి ప్రభుత్వం. తాజాగా హిజాబ్ ధరించనందుకు ఓ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శవంగా ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఇరాన్ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. మహ్సా అమినీ(22) అనే యువతి గతవారం తన కుటుంబంతో టెహ్రాన్ ట్రిప్‌కు వెళ్లింది. అయితే ఆమె హిజాబ్ ధరించకపోవడంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిందంటూ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆమెను హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు. అమినీ కోమాలోకి వెళ్లిందని ప్రకటించిన పోలీసులు.. చివరకు శనివారం ఆమె కన్నుమూసినట్లు ప్రకటించారు. అమినీ మృతిపై పోలీసులు అనుమానాస్పద ప్రకటన చేయకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా వందల మంది ప్రజలు ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించినప్పటి నుంచి ఆస్పత్రిలో చేర్చే వరకు ఏం జరిగిందో ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఓ ప్రైవేట్‌ఛానెల్ మాత్రం.. కస్టడీలో ఆమెను హింసించారని, తలకు బలమైన గాయం అయ్యిందని, ఒంటిపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. కస్టడీలో ఆమె హింసకు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. గత మంగళవారం అమినీతో పాటు మతపరమైన డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన కొందరిని స్టేషన్‌కు తరలించామని, సందర్శకుల హాలులో ఉన్న టైంలో ఆమె ఉన్నట్లుండి కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించామని, అక్కడ ఆమె కోమాలోకి వెళ్లిందని చెప్పిన వైద్యులు.. శుక్రవారం మరణించిందని ప్రకటించారని పోలీసులు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటన రాజధాని టెహ్రాన్‌ను ఆందోళనకారులతో కుదిపేస్తుండడంతో అధ్యక్షుడు ఎబ్రహీమ్ రైసీ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. జులైలో భద్రతా సిబ్బంది వ్యాన్ ఎదుట తన కూతురిని వదిలేయాలంటూ ఓ తల్లి బతిమిలాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యి.. చర్చకు దారి తీసింది. మరో ఘటనలో.. సెఫీడెహ్ రష్నో అనే యువతి హిజాబ్ వ్యవహారం తర్వాత కనిపించకుండా పోయింది. మతపరమైన మోరల్ పోలీసింగ్ పేరిట అక్కడ జరుగుతున్న దారుణాలను మానవ హక్కుల సంఘాలు నిలదీస్తున్నా లాభం లేకుండా పోతోంది. -
అబ్బాయితో దోస్తీ: అమ్మాయికి చిత్రహింసలు
పాట్నా: అబ్బాయితో కనిపించిందని ఓ అమ్మాయిని వెంటపడి వేధించారు కొందరు దుండగులు. తాము స్నేహితులమే అని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా బెదిరింపులతో పాటు దాడికి దిగారు. ఈ హేయమైన ఘటన బిహార్‌లోని గయాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గయాలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటోంది. ఇది చూసిన కొందరు దుండగులు వారిని తప్పుగా ఊహించుకున్నారు. వారిని సమీపించి ఇక్కడేం చేస్తున్నారని నిలదీశారు. దీంతో తత్తరపాటుకు లోనైన ఆ అమ్మాయి తాము స్నేహితులమని చెప్పగా వారు వినిపించుకోలేదు. ఫ్రెండ్స్ అయితే మీకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ చిత్రహింసలు పెట్టారు. మీ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. మమ్మల్ని వదిలేయండి, వెళ్లిపోతాం.. అని దీనంగా ప్రార్థించినప్పటికీ వారు చెవికెక్కించుకోకుండా చివరికి అన్నంత పనే చేశారు. వీడియో తీయొద్దని ఆ బాలిక చేతులెత్తి వేడుకున్నా కనికరించలేదు. కనీసం ముఖం కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే కూడా ఆమె దగ్గరున్న స్కార్ఫ్‌ను లాగేశారు. స్కార్ఫ్ ఇవ్వమని గింజుకున్నా పట్టించుకోకుండా శిలావిగ్రహాల్లా చూస్తూ నిలబడిపోయారు. ఆమె అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తే వెంటపడి మరీ లాక్కొచ్చారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడి మీద కూడా దాడికి దిగారు. పైగా ఆమె వివరాలు చెప్పమని బెదిరించడంతో ఆ బాలిక భయంభయంగానే తనది ఫతేపూర్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా గయా ఎస్ఎస్పీ ఆదిత్య కుమార్ త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి తస్మాత్ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు, జైలుకెళ్లాడు -
బైక్‌పై వెళ్తున్న జంటపై దాడి..
గువాహటి : నైతికత పేరుతో బైక్‌పై వెళ్తున్న జంటపై అస్సాంలోని పుకుర్‌పూర్ వాసులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాల్సిందిగా వారిపై ఒత్తిడి తెచ్చారు. జూన్19న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై గ్రామస్థుల చేతిలో దాడికి గురైన యువకుడి సోదరుడు మాట్లాడుతూ.. ‘బైక్‌పై వెళ్తున్న జంటను అడ్డగించిన గ్రామస్థులు.. యువతి, యువకులు జంటగా వెళ్లడంపై అభ్యంతరం తెలిపి దూషణలకు దిగారు. దానిని తప్పుగా భావించి వారిపై దాడి చేశారు. ఊరిలో సమావేశం ఏర్పాటు చేసి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ జంటపై ఒత్తిడి తీసుకుచ్చారు’ అని తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అస్సాం డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పోలీసులే ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపడుతున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. -
వద్దని వేడుకున్నా ప్రేమికులను వీడియో తీసి..
- కులం పేరుతో దూషణలు.. బెదిరింపులు.. - పరారీలో నిందితులు.. వీడియోను తొలగించిన ఫేస్బుక్ చెన్నై: బైక్‌పై వెళుతోన్న ప్రేమికులను అడ్డగించి, వారిని కులం పేరుతో దూషించి, బెదిరింపులకు పాల్పడిన ‘మోరల్ పోలింగ్ వీడియో’ ఒకటి తమిళనాడులో సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు ఫేస్బుక్ సంస్థ సదరు వీడియోను తొలగించింది. పెరంబలూరుకు చెందిన వేలుమురుగన్ కోలంగినాథ్ అనే యువకుడి ఫేస్బుక్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ అయింది. అందులో.. తమను అడ్డుకున్న యువకుల బృందాన్ని ప్రేమజంట బతిమాలుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. తాము ప్రేమికులమని, కేవలం మాట్లాడుకోవడానికే వచ్చామని వివరించారు. ‘ప్లీజ్.. ఈ అమ్మాయి భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి వీడియో తీయకండి..’ అని వేడుకున్నా ముష్కర బృందం వినిపించుకోలేదు. కులం పేరుతో తీవ్రంగా దూషించి, బెదిరించిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. వేల్మురుగన్ అడ్రస్‌ను కనిపెట్టి ఇంటికి వెళ్లగా, అప్పటికే విషయం తెలుసుకున్న అతను ఊరు విడిచి పారిపోయాడు. నిందితుడి బంధువుల ద్వారా అతని ఆచూకీ కనిపెడతామని, నలుగురైదుగురు కలిసి ఈ దుశ్యర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపించిన మరో బైక్ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బహుశా పెరంబలూరు సమీప గ్రామంలో ఇది జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
యువతి,యువకుడిపై పోకిరీల దారుణం
-
ఆ ఘటన అవమానకరం.. సీఎం సీరియస్
తిరువనంతపురం: మోరల్ పోలీసింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం నాడు కొచ్చి బీచ్ లో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనను ఆయన ఖండించారు. ఇది అవమానకర ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కొచ్చి బీచ్ లో బుధవారం పలు యువ జంటలపై శివసేన కార్యకర్తలు దాడులు చేశారు. పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరిమికొట్టారు. ఈ ఘటనపై ప్రజాస్వామిక వాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక వార్త ఇక్కడ చదవండి: ‘ఉమెన్స్ డే’ జంటలను పరుగెత్తించి కొట్టారు -
పోలీసుల వేధింపులు.. ఫేస్బుక్లో లైవ్!
ఇద్దరు పోలీసులు కలిసి తమను వేధిస్తుంటే.. ఆ మొత్తం వ్యవహారాన్ని ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రపంచానికి చూపించి కేరళకు చెందిన ఓ ప్రేమజంట ధైర్యంగా నిలబడింది. ఇంకా పెళ్లి కాని ఆ యువతీ యువకులు.. తిరువనంతపురంలోని మ్యూజియం పార్కులో కూర్చుని ఉండగా.. వాళ్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులు వాళ్లను ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో బాగా ఇబ్బంది పడిన వాళ్లు.. పోలీసుల వేధింపులు మొత్తాన్ని ఫేస్బుక్ ద్వారా లైవ్‌లో చూపించారు. తాము అసభ్యంగా ప్రవర్తిస్తున్నామంటూ పో్లీసులు ఆరోపించారని, కానీ తాము కేవలం కూర్చుని మాట్లాడుకుంటున్నామని ఆ యువకుడు చెప్పాడు. తాను కేవలం అమ్మాయి భుజం మీద చేయి వేసుకుని కూర్చున్నానని, అందులో అసభ్యత ఏముందని అతడు ప్రశ్నించాడు. పోలీసులు తమతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో.. బాగా ఆందోళనకు గురైన యువతి తాము కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఇలాంటి పరిస్థితి చాలామందికి వస్తోందని, వాళ్లు కూడా బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె చెప్పింది. వచ్చిన ఇద్దరు పోలీసులలో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారని, తాము అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వాళ్లు చెప్పినప్పటి నుంచి తాము ఫేస్బుక్ లైవ్ ఆన్ చేశామని యువకుడు తెలిపాడు. వాళ్లిద్దరూ పార్కులో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల వాళ్లను అదుపులోకి తీసుకుని వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కురచ దుస్తులపై కొరడా!
చండీగఢ్: మహిళల కురచ దుస్తుల ధారణపై చండీగఢ్ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. పొట్టి బట్టలేసుకుని బార్లు, డిస్కోతెక్ లకు వెళ్లడానికి వీలు లేకుండా చేయాలని అధికారులు భావిస్తున్నారు. మినీ స్కర్ట్ లు, అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి బార్లు, డిస్కోతెక్ లకు వెళ్లడంపై నిషేధం విధించనున్నారు. 'కంట్రోలింగ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ అమూజ్ మెంట్ 2016' కింద చర్యలు చేపట్టనున్నారు. రాత్రి వేళల్లో పెరిగిపోతున్న అసాంఘిక, జాతివ్యతిరేక కార్యకలాపాలకు నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై బార్ యజమానులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మోరల్ పోలీసింగ్ కిందకు వస్తుందని పేర్కొన్నారు. నేరాల అదుపుచేసేందుకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని వాదిస్తున్నారు. అసభ్యకరమైన దుస్తులు వేసుకున్నారని ఏవిధంగా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు రూపొందించామని అధికారులు అంటున్నారు. -
మోరల్ పోలీసింగ్ పేరుతో జంటపై దాడి
రూర్కెలా: ఉత్తరాఖండ్ లో మోరల్ పోలీసింగ్ పేరుతో ఓ జంటను స్థానికులు చితకబాదారు. యువతీ, యువకుడిని నడివీధిలోకి లాగిన స్థానికులు వారిని నోటికొచ్చిన బూతులు తిట్టారు. తలో చేయి వేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. రూర్కీ ఏరియాకు చెందిన యువకుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ యువతీ, యువకుడు ఒకే గదిలో ఉన్న సమయంలో పట్టుకున్న స్థానికులు వారిని చితక బాదారు. పైగా ఆ దృశ్యాలన్నింటినీ చిత్రీకరించారు. తమను వదిలిపెట్టాలని వారు వేడుకున్నా కనికరించలేదు. మహిళ అని కూడా చూడకుండా చితకబాదారు. యువకులతో పాటు, మహిళలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. చిట్టచివరకు పెద్ద మనుషుల జ్యోకం చేసుకొని సర్థి చెప్పటంతో ఆ జంటను వదిలిపెట్టారు. ఈ నెల 17న ఈ ఘటన జరిగింది. వారం రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది. -
మోరల్ పోలీసింగ్ పేరుతో జంటపై దాడి
-
మోరల్ పోలీసింగ్ పేరుతో.. ప్రేమజంటపై దాడి!
-
న‘గరం’.. కిస్
‘కిస్ ఆఫ్ లవ్’.. పేరుతో ఉద్యాన నగరం చట్టం.. సంప్రదాయం మధ్య జరిగే యుద్ధానికి వేదిక కానుంది. మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తూ కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ సెగ త్వరలో సిలికాన్ సిటీకి తగలనుంది. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలో బెంగళూరు కూడా వేదిక కానుంది. అయితే హిందూ సంస్కృతి, సంప్రదాయలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే శ్రీరామ సేన, ఆర్ఎస్ఎస్ ప్రభావం అధికంగా ఉన్న ఈ రాష్ర్టంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కత్తిమీద సాము లాంటిదే. ఈ కార్యక్రమాన్ని చేపడితే కచ్చితంగా అడ్డుకుంటామని ఇప్పటికే ఆ సంస్థలు హెచ్చరించాయి. బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం చట్ట రీత్యా నేరం కాదు. అయితే అది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. దీంతో తాము చట్ట ప్రకారం నడుచుకోవాలా.. లేక భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలా.. ‘కిస్ ఆఫ్ లవ్’ వారికి సపోర్ట చేయాలా.. లేక శ్రీరామ సేన, ఆర్ఎస్ఎస్లకు మద్ధతివ్వాలా.. అర్థం కాక హోం శాఖ తలపట్టుకుంది. చట్టం X సంప్రదాయం * సిలికాన్ సిటీని తాకిన ముద్దుల సెగ * 22న ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం! * నగరంలోని టౌన్‌హాల్ ఎదుట నిర్వహించేందుకు సన్నాహాలు * అడ్డుకుని తీరుతామంటున్న శ్రీరామసేన, ఆర్ఎస్ఎస్.. సంస్థలు * కార్యక్రమానికి సంబంధించిన అనుమతిపై స్పష్టత ఇవ్వని హోం శాఖ సాక్షి, బెంగళూరు : మోరల్ పోలీసింగ్ (నైతిక పోలీసుగిరి)కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ ఇప్పుడు ఉద్యాననగరిని తాకనుంది. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఇప్పటికే అనేక మంది విమర్శలు, మరెంతో మంది మద్దతుతో సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఉద్యాననగరిలో సైతం నిర్వహించనున్నారు. నగరంలోని కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలతో కలిసి నగరానికి చెందిన హక్కుల కార్యకర్త రచితా తనేజా (23) ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 22న నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక నగరంలోని ప్రముఖ చారిత్రాత్మక కట్టడం ‘టౌన్‌హాల్’ ఎదుట ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రజా హక్కుల కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై నిర్వాహకుల్లో ఒకరైన రచితా తనేజా మాట్లాడుతూ...‘మోరల్ పోలీసింగ్కి వ్యతిరేకంగానే కాదు.. మోరల్ పోలిసింగ్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి సానుభూతిని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలచాము. నగరానికి చెందిన దాదాపు 150 మంది యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.’ అని తెలిపారు. ముందుగా ఎంజీ రోడ్ అనుకున్నా.... నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ముందుగా ఎంజీ రోడ్‌లోని రంగోలి మెట్రో ఆర్ట్ సెంటర్ వద్ద నిర్వహించాలని భావించినప్పటికీ అనంతరం నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనేక ధర్నాలకు వేదికగా నిలుస్తున్న టౌన్‌హాల్ ఎదుటే నైతిక పోలీస్గిరీపై తమ వ్యతిరేకతను తెలియజేయాలని భావించి ‘కిస్ ఆఫ్ లవ్’ వేదికను టౌన్‌హాల్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఇతర నగరాల్లో కార్యక్రమ నిర్వహణ సమయంలో ఏర్పడిన ఇబ్బందులు తిరిగి నగరంలో పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ముందుగానే రాష్ట్ర హోం శాఖ నుంచి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అనుమతిపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర హోం శాఖ... ఇక ఉద్యాననగరిలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరతామని శ్రీరామ సేన, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో నగరంలో ఈ కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ కార్యక్రమ నిర్వహణకు అనుమతిని ఇవ్వడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ మంగళవారమిక్కడ మాట్లాడుతూ...‘చట్ట ప్రకారం, చట్టానికి లోబడి ఎలాంటి కార్యక్రమానికైతే అవకాశం ఉంటుందో వాటికి అనుమతులు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే సంసృతి హద్దులు దాటి చేసే పనులపై మాత్రం పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు. కాగా బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం చట్ట రీత్యా నేరమేమీ కాదని.. అయితే భారతీయ సంసృతీ సాంప్రదాయాల ప్రకారం మాత్రం ఇది సరికాదని నగరానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి సందర్భంలో ఈ అంశాన్ని చట్ట పరిధిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా.. లేక భారతీయ సంసృతీ, సంప్రదాయాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటారా అనే అంశంపై హోం శాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ గందరగోళం నడుమ కార్యక్రమానికి అనుమతి లభించక పోతే ‘కిస్ ఆఫ్ లవ్’ను ఈనెల 29కి వాయిదా వేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. -
హాట్ హాట్‌గా..‘లిప్‌లాక్’
న్యూఢిల్లీ: నగరంలో ‘లిప్‌లాక్’ హాట్ టాపిక్‌గా మారిపోయింది. బహిరంగంగా జంటలు ముద్దు పెట్టుకోకూడదని, ఇది హిందూ సంస్కృతికి వ్యతిరేకమని కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై (మోరల్ పోలిసింగ్‌పై) నిరసన వ్యక్తమవుతోంది. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో కేరళలోని కోచిలో ఈ నెల 2వ తేదిన ఉద్యమం మొదలైంది. బహిరంగంగా ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడాన్ని అనైతిక చర్యగా బావిస్తూ కొన్ని శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ‘ముందుల ఉద్యమం’ పేరుతో యువత జంటలుగా ‘లిప్‌లాక్’ చేస్తూ బహిరంగాగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముంబై, కోల్‌కత్తాతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హల్చల్ చేసిన ‘లిప్‌లాక్’ సందడి దేశరాజధానికి విస్తరించింది. శనివారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జంటలు రోడ్లమీదికి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగడంతో విద్యార్థుల అరెస్టులు, విడుదల జరిగిపోయాయి. దీనికి కొనసాగింపుగా ఆదివారం జవహర్లాల్ నె హ్రూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి యువజంటలు గంగాదాబా ఎదుట ముద్దులు పెటుకొని నిరసన కొనసాగించారు. ‘ప్రేమను వ్యక్తం చేసే స్వేచ్ఛ’ కావాలని నినదించారు. మన వేదాల్లో కూడా ఈ స్వేచ్ఛ ఉన్నదని, ప్రముఖ ఖజురాహో దేవాలయంపై కూడా ముద్దుల సన్నివేశాలతో కూడిన శిల్పాలు ఉన్నాయని విషయాన్ని విద్యార్థి యువజంటలు గర్తుచేశారు. కాగా, వామపక్ష విద్యార్థి సంఘాలు లిప్‌లాక్ ఉద్యమాన్ని బలపర్చుతుండగా, మితవాద విద్యార్థి సంఘాలు, ఆర్ఎస్ లాంటి శక్తులు అడ్డుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. -
'కిస్ ఆఫ్ లవ్' ఫేస్ బుక్ ఖాతా హ్యాక్!
కొచ్చి:'నైతిక పో్లీసింగ్'కు నిరసనగా కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి తెరలేపిన పేస్ బుక్ బృందం సభ్యులకు మరో ఆటంకం ఎదురయ్యింది. ఆ ఖాతాలో ఉన్న మరో ఐదుగురు సభ్యుల వివరాలు హ్యాకింగ్ గురయినట్లు ఆర్గనైజేషన్ ప్రధాన సభ్యుడు రాహుల్ పసుపాలన్ మీడియాకు తెలిపాడు. దీని వెనుక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు బృంద సభ్యుడు రాహుల్ పసుపాలన్ చెప్పారు. హ్యాకింగ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే, తమపై దాడి చేసే ఉద్దేశంతో ఆదివారం కార్యక్రమం జరిగే వేదిక వద్దకు కొందరు మారణాయుధాలతో వచ్చారని ఆరోపించారు. కోచిలోని సాగర తీరంలో కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించాలని ఈ గ్రూప్ భావించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కిస్ ఆఫ్ లవ్ కు తొంభై వేల వరకూ లైక్ లు వచ్చినట్లు రాహుల్ పసుపాలన్ స్పష్టం చేశాడు. -
ఆగిన ‘ముద్దు’ కార్యక్రమం!
కొచ్చి: కేరళలోని కొచ్చి సాగర తీరంలో ఆదివారం జరగాల్సిన ‘ముద్దు (కిస్ ఆఫ్ లవ్)’ అనే కార్యక్రమం పోలీసుల నిర్బంధం కారణంగా ఆగిపోయింది. నిర్వాహకులను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ‘నైతిక పోలీస్’ విధానాన్ని వ్యతిరేకిస్తూ ‘ఫ్రీ థింకర్స్’ అనే ఫేస్బుక్ గ్రూపు కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించతలపెట్టింది. యువతీ యువకులు సాగర తీరానికి వచ్చి ఒకర్ని ఒకరు కౌగిలించుకుని, ముద్దాడుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఆదివారం ప్లకార్డులతో లా కాలేజీ నుంచి సాగర తీరంలోని వేదిక వద్దకు నిర్వాహకులు మద్దతు దారులతో వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు సుమారు 30 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. మీడియా కవరేజీతో వేదిక వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్బంగా అభిమానులు ముద్దుల పండుగ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. -
'కిస్ ఆఫ్ లవ్'పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు!
కొచ్చి:'నైతిక పోలీసింగ్’కు నిరసనగా పిలుపునిచ్చిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించి తీరుతామని నిర్వాహకులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వనప్పటికీ ప్రజల్లో నైతిక పోలీసింగ్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు దీన్ని జరుపుతామని ‘ఫ్రీ థింకర్స్’ అనే ఫేస్బుక్ స్నేహితుల బృందం తెలిపింది. సుమారు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించడం తెలిసిందే. మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆ ముద్దుల వ్యవహారంలో మేం వేలు పెట్టం!
మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఎర్నాకులం ప్రభుత్వ న్యాయకళాశాల, శ్రీ సత్యసాయి అనాథల ట్రస్టులకు చెందిన ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎం షఫీక్‌లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఐపీసీలోని నిబంధనలను ఈ కార్యక్రమం ఉల్లంఘిస్తోందని, ఇది భారతీయ సంస్కృతికి కూడా విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యతను నిరోధించాల్సిందిగా ఎర్నాకులం జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్లను ఆదేశించాలని కోరారు. నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అణగదొక్కడానికి వీల్లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల ఓ ఫేస్బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు. అయితే నిరసనకారులు మాత్రం శాంతిభద్రతల సమస్యను సృష్టించకూడదని ఆయన అన్నారు. గతవారం కోజికోడ్‌లోని ఓ హోటల్లో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కొంతమంది భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అక్కడ విధ్వంసం సృష్టించారు. దీనికి నిరసనగానే నవంబర్ రెండో తేదీ ఆదివారం నాడు కౌగిలింతలు, ముద్దులతో బహిరంగ నిరసన నిర్వహించాలని వివిధ పక్షాలు నిర్ణయించాయి. -
ముద్దులు, కౌగిలింతలతో ప్రేమికుల నిరసన
తిరువనంతపురం: 'మోరల్ పోలీసింగ్' పేరుతో గతవారం కేరళలోని కోజికోడ్ రెస్టారెంట్ లో యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా కోచి మెరైన్ డ్రైవ్ వద్ద యువతీ, యువకులు పెద్ద ఓ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 2 తేదిన నిర్వహించే కార్యక్రమంలో బహిరంగంగా ప్రేమ జంటలు ముద్దులు, కౌగిలింతలు పెట్టుకుని నిరసన తెలుపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ నిరసన కార్యక్రమానికి సంబందించిన విషయాలను తెలిపేందుకు సోషల్ మీడియాను కూడా ఆసరా చేసుకోనున్నారు. త్వరలోనే ఫేస్ బుక్ పేజ్ ను ప్రారంభించనున్నట్టు నిరసనకారులు తెలిపారు. అక్టోబర్ 23 తేదిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కోజికోడ్ లోని రెస్టారెంట్ పై యువ మోర్చా కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో కొంతమంది యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.