
మోరల్ పోలీసింగ్ పేరుతో జంటపై దాడి
ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రూర్కెలాలో మోరల్ పోలీసింగ్ పేరుతో ఓ జంటను స్థానికులు చితకబాదారు. యువతీ, యువకుడిని నడివీధిలోకి లాగిన స్థానికులు..
రూర్కెలా: ఉత్తరాఖండ్ లో మోరల్ పోలీసింగ్ పేరుతో ఓ జంటను స్థానికులు చితకబాదారు. యువతీ, యువకుడిని నడివీధిలోకి లాగిన స్థానికులు వారిని నోటికొచ్చిన బూతులు తిట్టారు. తలో చేయి వేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. రూర్కీ ఏరియాకు చెందిన యువకుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం.
ఈ విషయంపై గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ యువతీ, యువకుడు ఒకే గదిలో ఉన్న సమయంలో పట్టుకున్న స్థానికులు వారిని చితక బాదారు. పైగా ఆ దృశ్యాలన్నింటినీ చిత్రీకరించారు. తమను వదిలిపెట్టాలని వారు వేడుకున్నా కనికరించలేదు. మహిళ అని కూడా చూడకుండా చితకబాదారు. యువకులతో పాటు, మహిళలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. చిట్టచివరకు పెద్ద మనుషుల జ్యోకం చేసుకొని సర్థి చెప్పటంతో ఆ జంటను వదిలిపెట్టారు. ఈ నెల 17న ఈ ఘటన జరిగింది. వారం రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది.