Roorkee
-
వైరల్ వీడియో: నడిరోడ్డుపై విద్యార్థినిల హల్చల్
-
Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు
Cricketer Rishabh Pant- Car Accident: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైన తర్వాత పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదాన్ని పసిగట్టిన పంత్ కారు నుంచి దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్‌కు ఢిల్లీ నుంచి వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్‌ను ప్రాథమిక చికిత్స కోసం తొలుత డెహ్రాడూన్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మాక్స్ హాస్పిటల్‌కు తరలించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. మంగ్లూర్ పరిధిలోని నేషనల్ హైవే-58 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక ఎస్సీ దేహాత్ స్వపన్ కిషోర్ తెలిపినట్లు వెల్లడించింది. అద్భుత శతకంతో ఇక ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో 25 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అద్భుత సెంచరీతో మెరిశాడు. బంగ్లా పర్యటన తర్వాత దుబాయ్ వెళ్లిన అతడు.. అనంతరం స్వస్థలం ఉత్తరాఖండ్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ నేపథ్యంలో పంత్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. కాగా అనతికాలంలోనే టీమిండియా కీలక సభ్యుడిగా ఎదిగిన పంత్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తమ అంబాసిడర్‌గా నియమించుకుంది. చదవండి: Rishabh Pant: 6 సార్లు తృటిలో చేజారిన శతకం! అయితే ఏంటి? నాకు అదే ముఖ్యమంటూ.. IPL: జట్టును నాశనం చేయకండి.. చేతనైతే: సన్‌రైజర్స్‌పై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నడిరోడ్డుపై విద్యార్థినిల హల్చల్.. జుట్టు పట్టుకుని కర్రలతో..
కొందరు విద్యార్థినిలు ఓ హోటల్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో దారుణంగా తన్నుకున్నారు. ఓ అమ్మాయిని రోడ్డుపై పడుకోబెట్టి కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రూర్కీలోని ఓ హోటల్ వద్ద విద్యార్థినిలు ఒకరినొకరు తన్నుకున్నారు. అమ్మాయిలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని లాగడం, కిందపడేసి నేలపై లాగడం, కర్రలతో బాదుకున్నారు. ఇదంతా ఓ హోటల్ పక్కనే ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో జరిగింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీరి ఫైటింగ్‌ను వీడియో తీశారు. కాగా, వీరి ఫైటింగ్ సందర్బంగా వీడియో తీస్తున్న వ్యక్తి.. వారంతా పక్కనే ఉన్న పాఠశాలకు చెందిన విద్యార్థినిలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, అక్కడున్న వారు వెంటనే విద్యార్థినిలను నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు.. అసలు వీరి ఫైటింగ్‌కు సంబంధించి కారణంగా తెలియరాలేదు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఇబ్బందేంలేదు.. తేల్చిచెప్పిన ఐఐటీ-రూర్కీ
రామగోపాలరెడ్డి ఆలమూరు సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల ముంపు సమస్యే ఉత్పన్నం కాదని ఐఐటీ–రూర్కీ కూడా తెగేసిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు గోదావరికి గరిష్టంగా వరద వచ్చిన సమయంలో సీలేరు, శబరి నదుల్లో ఏ స్థాయిలో వరద మట్టం ఉంటుందో.. ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతేస్థాయిలో ఉంటుందని తేల్చింది. రూర్కీ–ఐఐటీ అధ్యయన నివేదికను పరిశీలిస్తే.. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల తమ భూభాగం ముంపునకు గురవుతుందని ఆ నివేదికను చూపుతూ ఒడిశా సర్కార్ చేస్తున్న వాదనలో వీసమెత్తు నిజం కూడా లేదన్నది స్పష్టమవుతోంది. గోదావరిలో గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్–ప్రాబబుల్ మాగ్జిమమ్ ఫ్లడ్), పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై రూర్కీ–ఐఐటీలోని హైడ్రాలజీ విభాగంతో ఒడిశా జలవనరుల శాఖ అధ్యయనం చేయించింది. ఆ రెండు అంశాలపై రెండేళ్లపాటు అధ్యయనం చేసిన రూర్కీ–ఐఐటీ 2019, ఫిబ్రవరిలో ఒడిశా సర్కార్‌కు వేర్వేరుగా నివేదికలిచ్చింది. అందులోని ప్రధానాంశాలివీ.. ఏకరీతిలో వర్షం కురిస్తే.. గోదావరి పరీవాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. బంగాళాఖాతంలో 1986, ఆగస్టు 12–14 మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావంవల్ల ఆగస్టు 15, 16న మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి సబ్ బేసిన్ (ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా)ల లో వర్షం కురిసిందని రూర్కీ–ఐఐటీ పేర్కొంది. దీనివల్ల గోదావరి ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు గరిష్టంగా 94,900 క్యూసెక్కులు (35,06,338 క్యూసెక్కులు) వరద వచ్చిందని వెల్లడించింది. గోదావరి చరిత్రలో ఇదే గరిష్ట వరద ప్రవాహం మొత్తం గోదావరి బేసిన్లో మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి సబ్ బేసిన్లు 70 శాతంలో విస్తరించి ఉన్నాయని.. 1986, ఆగస్టు 15, 16న కురిసిన వర్షపాతం మొత్తం గోదావరి బేసిన్లో ఒకేరోజు.. ఒకే సమయంలో కురిస్తే.. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 1,64,872 క్యూమెక్కులు (58,05,143 క్యూసెక్కులు) వరద వచ్చే అవకాశముందని వివరించింది. ఒకే సమయంలో ఒకే రీతిలో వర్షం సాధ్యమా? వాతావరణ మార్పుల ప్రభావంవల్ల ప్రస్తుతం ఒక చదరపు కిలోమీటర్ పరిధిలోనే ఏకరీతిలో వర్షం కురవడంలేదు. అలాంటిది ఆరు రాష్ట్రాల్లోని గోదావరి బేసిన్లో ఒకే రోజు ఒకే సమయంలో ఒకే రీతిలో వర్షం కురవడం అసాధ్యమని వాతావరణ శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముంటుందని తేల్చిన ఐఐటీ–రూర్కీ అధ్యయనం శాస్త్రీయం కాదని స్పష్టంచేస్తున్నారు. మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్‌కు 1986, ఆగస్టు 16న వచ్చిన గరిష్ట వరద ప్రవాహం 35,06,338 క్యూసెక్కులను పరిగణలోకి తీసుకుంటే.. వెయ్యేళ్లకు ఓసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కులు, పదివేల ఏళ్లకు ఓసారి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరదవచ్చే అవకాశముందని ఐఐటీ–హైదరాబాద్ అధ్యయనంలో తేల్చడం గమనార్హం. ఇక గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కులకు మించి వరదవచ్చే అవకాశమేలేదని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. పోలవరం ప్రాజెక్టులోకి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వేను నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించింది. ఆ మేరకే ప్రపంచంలో అతిపెద్ద స్పిల్ వేను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పులేదు ♦పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై రూర్కీ– ఐఐటీ వెల్లడించిన అంశాలేమిటంటే.. ♦పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. కనిష్ట నీటిమట్టం 41.15 అడుగులు. గరిష్టస్థాయిలో నీటిని నిల్వచేస్తే.. 637 చదరపు కిలోమీటర్లు భూమి ముంపునకు గురవుతుంది. ఇందులో ఏపీలో 601, ఒడిశా లో 12, ఛత్తీస్‌గఢ్‌లో 24 చ.కి.మీ. ఉంటుంది. ♦పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎగువ భాగంలో 145 కి.మీల దూరంలో దుమ్ముగూడెం ఉంటుంది. కూనవరం వద్ద శబరి నది గోదావరిలో కలుస్తుంది. అక్కడి నుంచి ఎగువన 72 కి.మీల పొడవున శబరి ప్రవహిస్తుంది. కొంటాకు 25 కిమీల ఎగువన శబరిలో సీలేరు నది కలుస్తుంది. ♦గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టు కట్టకముందు సీలేరు నది 25 కిమీల వద్ద నీటిమట్టం 70.80 మీటర్లు ఉంటే.. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక నీటిమట్టం 70.81 మీటర్లు ఉంటుంది. అంటే.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల పెరిగే నీటి మట్టం ఒక సెంటీమీటరే. ♦అలాగే, ఇదే స్థాయిలో వరద వచ్చినప్పుడు.. పోలవరం కట్టకముందు శబరి నదిలో 40 కిమీల వద్ద నీటిమట్టం 105.4 మీటర్లు ఉంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అది 105.4 మీటర్లే ఉంటుంది. అంటే.. శబరిపైనా పోలవ రం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉండదన్న మాట. ♦ఇక రూర్కీ–ఐఐటీ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ సంస్థ అంచనా వేసిన మేరకు గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉండదని స్పష్టమవుతోంది. -
మాస్క్‌లతో వచ్చి రూ 45 లక్షలు మాయం..
సాక్షి, రూర్కెలా : పట్టపగలు దోపిడీ ముఠా రెచ్చిపోయింది. ఒడిషాలోని రూర్కెలా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లోకి మంగళవారం ఉదయం దూసుకొచ్చిన దుండగులు బ్యాంకు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి రూ 45 లక్షలు లూటీ చేశారు. హెల్మెట్లు, మాస్క్‌లు ధరించిన ఏడెనిమిది మంది దుండగులు పట్టణంలోని ఐఓబీ బజార్ బ్రాంచ్‌లోకి వచ్చారని, ఉద్యోగులను తుపాకీతో బెదిరించి సొమ్ముతో ఉడాయించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దోపిడీ ఘటన సమాచారం అందుకున్న రూర్కెలా ఎస్పీ, డీఐజీలు హుటాహుటిన బ్యాంక్‌కు చేరుకున్నారు. బ్యాంకు లూటీపై దర్యాప్తునకు ఆదేశించారు. దోపిడీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టణంలోకి వచ్చే దారులన్నింటినీ మూసివేశారు. పొరుగు రాష్ట్రం జార్ఖండ్ నుంచి దోపిడీ ముఠా ఈ లూటీకి తెగబడిందని అనుమానిస్తున్నారు. -
మోరల్ పోలీసింగ్ పేరుతో జంటపై దాడి
రూర్కెలా: ఉత్తరాఖండ్ లో మోరల్ పోలీసింగ్ పేరుతో ఓ జంటను స్థానికులు చితకబాదారు. యువతీ, యువకుడిని నడివీధిలోకి లాగిన స్థానికులు వారిని నోటికొచ్చిన బూతులు తిట్టారు. తలో చేయి వేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. రూర్కీ ఏరియాకు చెందిన యువకుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ యువతీ, యువకుడు ఒకే గదిలో ఉన్న సమయంలో పట్టుకున్న స్థానికులు వారిని చితక బాదారు. పైగా ఆ దృశ్యాలన్నింటినీ చిత్రీకరించారు. తమను వదిలిపెట్టాలని వారు వేడుకున్నా కనికరించలేదు. మహిళ అని కూడా చూడకుండా చితకబాదారు. యువకులతో పాటు, మహిళలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. చిట్టచివరకు పెద్ద మనుషుల జ్యోకం చేసుకొని సర్థి చెప్పటంతో ఆ జంటను వదిలిపెట్టారు. ఈ నెల 17న ఈ ఘటన జరిగింది. వారం రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది. -
మోరల్ పోలీసింగ్ పేరుతో జంటపై దాడి