
కొందరు విద్యార్థినిలు ఓ హోటల్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో దారుణంగా తన్నుకున్నారు. ఓ అమ్మాయిని రోడ్డుపై పడుకోబెట్టి కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. రూర్కీలోని ఓ హోటల్ వద్ద విద్యార్థినిలు ఒకరినొకరు తన్నుకున్నారు. అమ్మాయిలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని లాగడం, కిందపడేసి నేలపై లాగడం, కర్రలతో బాదుకున్నారు. ఇదంతా ఓ హోటల్ పక్కనే ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో జరిగింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీరి ఫైటింగ్‌ను వీడియో తీశారు.
కాగా, వీరి ఫైటింగ్ సందర్బంగా వీడియో తీస్తున్న వ్యక్తి.. వారంతా పక్కనే ఉన్న పాఠశాలకు చెందిన విద్యార్థినిలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, అక్కడున్న వారు వెంటనే విద్యార్థినిలను నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు.. అసలు వీరి ఫైటింగ్‌కు సంబంధించి కారణంగా తెలియరాలేదు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment