fighting case
-
వైరల్ వీడియో: నడిరోడ్డుపై విద్యార్థినిల హల్చల్
-
నడిరోడ్డుపై విద్యార్థినిల హల్చల్.. జుట్టు పట్టుకుని కర్రలతో..
కొందరు విద్యార్థినిలు ఓ హోటల్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో దారుణంగా తన్నుకున్నారు. ఓ అమ్మాయిని రోడ్డుపై పడుకోబెట్టి కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రూర్కీలోని ఓ హోటల్ వద్ద విద్యార్థినిలు ఒకరినొకరు తన్నుకున్నారు. అమ్మాయిలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని లాగడం, కిందపడేసి నేలపై లాగడం, కర్రలతో బాదుకున్నారు. ఇదంతా ఓ హోటల్ పక్కనే ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో జరిగింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీరి ఫైటింగ్‌ను వీడియో తీశారు. కాగా, వీరి ఫైటింగ్ సందర్బంగా వీడియో తీస్తున్న వ్యక్తి.. వారంతా పక్కనే ఉన్న పాఠశాలకు చెందిన విద్యార్థినిలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, అక్కడున్న వారు వెంటనే విద్యార్థినిలను నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు.. అసలు వీరి ఫైటింగ్‌కు సంబంధించి కారణంగా తెలియరాలేదు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
వైరల్: అసభ్య సంజ్ఞల యుద్ధం
ఈ వేలు మా నాన్నలోని పవర్.. ఈ వేలు నా మీసంలోని పవర్ అంటూ హరికృష్ణ పవర్‌ఫుల్‌గా చెప్పిన డైలాగ్ చూశాం. కానీ వేళ్లతోనే యుద్ధం చేసుకున్న ఇద్దరు వ్యక్తులను మరో వ్యక్తి వీడియో తీసి పెట్టడంతో వైరల్ అయింది. న్యూయార్క్‌లోని ఎన్వైసీ వీధిలో ఇద్దరు వ్యక్తులు ఎందుకో గొడవకు దిగారు. అటుగా వెళుతున్న గయ్ బుల్లెచ్ వీరి గొడవను వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ గొడవలో పంచ్‌లు, ముష్టిఘాతాలు ఉన్నాయేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆ ఇద్దరు ఒకరికొకరు అసభ్యకరమైన సంజ్ఞను (మధ్య వేలును) చూపించుకుంటూ రెచ్చిపోయారు. వారిలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా సమస్య ఎదురైనా వేలును చూపించడం మాత్రం ఆపలేదు. ఈ చర్య పలువురిని నవ్వించడంతో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఇది ఫేక్ వీడియో అని ఒకరు, జీవితం అంత సాఫీగా సాగదు అనడానికి ఇది నిదర్శనమని మరొకరు కామెంట్ చేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. -
అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
సాక్షి, కమలాపూర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిపల్లిగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి తన కిరాయి రౌడీలతో తమపైనే దాడి చేయించాడని, ఆ కాంగ్రెస్ గూండాలపై, వారిని తమపైకి దాడికి పురిగొల్పిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఇనుగాల రవీందర్ డిమాండ్ చేశారు. మర్రిపల్లిగూడెంలో శుక్రవారం ఆయన స్థానికులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గురువారం రాత్రి జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు భర్త మాదాడి వెంకట్‌రెడ్డి కౌశిక్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడన్నారు. దీంతో ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈటలనే విమర్శిస్తావా అని అడిగామని, ఇందుకు అతను తమను కులం పేరుతో దూషిస్తూ వీళ్లను పక్కకు లాక్కెళ్లి తన్నండని చెప్పాడని, దీంతో కౌశిక్‌రెడ్డి వెంట వచ్చిన గూండాలు, బౌన్సర్లు తమను లాక్కెళ్లి ఆయుధాలతో దాడి చేసి గాయపర్చారని ఆరోపించారు. ఆ తర్వాత తాము ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే మాపై ఎక్కడ కేసు అవుతుందోనన్న భయంతో అరగంట తర్వాత వారి వాహనాల అద్దాలు వాళ్లే పగులగొట్టి ధ్వంసం చేసుకుని తమపై నెపం మోపారని ఆరోపించారు. సుమారు 30 నుంచి 40 మంది కాంగ్రెస్ గూండాలు, బౌన్సర్ల దాడిలో తనతో పాటు ఇనుగాల సారంగపాణి, వంగ రమేష్, సీహెచ్.బెనర్జీ, ఎండీ.ఖాసీం గాయపడ్డారన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. సమావేశంలో వంగ రమేష్ రత్నాకర్, నాయకులు పాల్గొన్నారు. -
దాడి కేసులో మూడేళ్లు జైలు
అనంతపురం లీగల్ : దాడి కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకెళితే... గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన హరిప్రసాద్ యాదవ్, అతని సోదరుడు సుబ్బయ్యకు ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. తనకు సరిగా ఆస్తి పంచలేదని హరిప్రసాద్‌యాదవ్ అనేక మార్లు సోదరుడి వద్ద ప్రస్తావించినా ఎటువంటి ప్రయోజనమూ లేకపోవడంతో 2012 అక్టోబర్ 20న సోదరుడి భార్య గోపాలమ్మ, కుమారుడు నవీన్‌పై దాడి చేశాడు. గాయపడిన గోపాలమ్మను అనంతపురం ఆస్పత్రికి, తీవ్రంగా గాయపడిన నవీన్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గోపాలమ్మ ఫిర్యాదు మేరకు గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 13 మంది సాక్షులను విచారించి, హరిప్రసాద్‌పై నేరం రుజువు కావడంతో అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసులు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్ వాదించారు.