నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తోన్న సాంగ్..ప్రముఖ వ్యాపారవేత్త ఫిదా! | Uttarakhandi Song Gulabi Sharara Sparks a Craze In Social Media | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సాంగ్.. విన్నారంటే స్టెప్పు వేయాల్సిందే!

Published Tue, Dec 26 2023 7:21 PM | Last Updated on Tue, Dec 26 2023 8:40 PM

Uttarakhandi Song Gulabi Sharara Sparks a Craze In Social Media - Sakshi

ఏదైనా కొత్త సాంగ్ వచ్చిందంటే చాలు సంగీత ప్రియులకు పండగే. చిన్న జానపద పాటల నుంచి సినిమాల పాటల వరకు కనెక్ట్ అవుతారు. భాషతో సంబంధం లేకుండా కాలు కదిపేస్తారు. అలా గతంలో చాలా సాంగ్స్ సినీ ప్రేక్షకులను ఓ ఊపు ఉపేశాయి. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ సాంగ్‌ నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తోంది. ఎక్కడ చూసినా ఆ పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సాంగ్‌కు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం 'గులాబీ షరారా' అనే ఉత్తరాఖండ్ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రముఖ సింగర్ ఇందర్ ఆర్య రూపొందించిన మెలోడీ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంక సైతం ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోందని.. ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎంజాయ్‌ చేస్తున్నారంటూ రాసుకొచ్చారు. పాఠశాల పిల్లల నుంచి పెద్దల వరకు డ్యాన్స్ రీల్స్‌ను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. అయితే ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజై నాలుగు నెలలైనా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement