
సాక్షి, రూర్కెలా : పట్టపగలు దోపిడీ ముఠా రెచ్చిపోయింది. ఒడిషాలోని రూర్కెలా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లోకి మంగళవారం ఉదయం దూసుకొచ్చిన దుండగులు బ్యాంకు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి రూ 45 లక్షలు లూటీ చేశారు. హెల్మెట్లు, మాస్క్‌లు ధరించిన ఏడెనిమిది మంది దుండగులు పట్టణంలోని ఐఓబీ బజార్ బ్రాంచ్‌లోకి వచ్చారని, ఉద్యోగులను తుపాకీతో బెదిరించి సొమ్ముతో ఉడాయించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దోపిడీ ఘటన సమాచారం అందుకున్న రూర్కెలా ఎస్పీ, డీఐజీలు హుటాహుటిన బ్యాంక్‌కు చేరుకున్నారు. బ్యాంకు లూటీపై దర్యాప్తునకు ఆదేశించారు. దోపిడీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టణంలోకి వచ్చే దారులన్నింటినీ మూసివేశారు. పొరుగు రాష్ట్రం జార్ఖండ్ నుంచి దోపిడీ ముఠా ఈ లూటీకి తెగబడిందని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment